India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 7న మెగా పేరెంట్స్- టీచర్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు కడప జిల్లాకు రానున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కడపలోని పవన్ కళ్యాణ్ పర్యటించే మునిసిపల్ స్కూలులో ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ గురువారం పరిశీలించారు.
కడప నూతన SPగా రాహుల్ మీనా వస్తున్నారనే కథనాలు జిల్లాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల YCP సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి కేసులో SP హర్షవర్ధన్ రాజు అలసత్వం వహించాడని ఆయన్ను తప్పించారు. ఆ తర్వాత అన్నమయ్య జిల్లా SP విద్యాసాగర్ నాయుడును అదనపు SPగా ఉన్నతాధికారులు నియమించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గుంతకల్ రైల్వే SPగా పనిచేస్తున్న రాహుల్ మీనా వస్తారని సమాచారం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రపంచ పర్యాటక మ్యాపులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గండికోట పర్యాటక ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గండికోట పర్యాటక అభివృద్ధిపై బుధవారం సమీక్షించారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రం” భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తుందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు రావడం సంచలనంగా మారింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎక్కడ ప్రమాదాలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఉమ్మడి కడప జిల్లాలో ఎటువంటి ప్రకంపనలు రాకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మన జిల్లాలో ఎక్కడైనా భూప్రకంపనల ప్రభావం ఉంటే కామెంట్ చేయండి.
కడప జిల్లాలో పెద్ద ఎత్తున ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారి షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాలల్లో పిల్లల అపార్ నమోదు పూర్తి చేయలేదని 829 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిజిఆర్‌ఎస్‌లో వచ్చిన ప్రతి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా పరిష్కరించాలని మంగళవారం అధికారులను కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. అమరావతి నుంచి సి.సి.ఎల్.ఏ.జి జయలక్ష్మి పి.జి.ఆర్.ఎస్ ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అన్నమయ్య జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం నేర సమీక్షపై పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వసనీయత పెంచే విధంగా అధికారులు నిరంతరం వ్యవహరించాలని అన్నారు.
2024-25 టెన్త్, ఇంటర్, డిగ్రీ అకాడమిక్ ఫలితాల్లో 100% ఉత్తీర్ణతను పెంపొందించి విద్యాశాఖలో వైఎస్ఆర్ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలన్నారు.
కడప జిల్లాలో వరుస హత్యలు కలవరం పెడుతున్నాయి. ప్రొద్దుటూరులోని ఓ లాడ్జీలో సోమవారం కొప్పుల రాఘవేంద్ర అనే రౌడీషీటర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అదేరోజు దువ్వూరు మండలం కానగూడూరులో తండ్రి మహబూబ్ బాషా చేతిలో కొడుకు పీరయ్య గారి హుస్సేన్ బాష (23) హత్యకు గురయ్యాడు. రోకలి బడెతో తలపై కొట్టాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బాషా మృతి చెందాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
డిసెంబర్ 7న సాయుధ దళాల జెండా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్ ఫ్లాగ్‌లు, స్టిక్కర్లను అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాయుధ దళాల త్యాగాలు, సేవలను గుర్తించేందుకు జెండా దినోత్సవం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అన్నారు. మాజీ సైనికులు, వీరనారులు వారి కుటుంబాల సంక్షేమానికి మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.