India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలోని అటవీ ప్రాంతాలను, వన్య ప్రాణులను సంరక్షించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అటవీ శాఖ, డిస్టిక్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాలలో టూరిజం స్పాట్లను గుర్తించి అభివృద్ధి చేయాలని తెలిపారు. ఆయా టూరిజం స్పాట్లలో పర్యాటకులు సందర్శించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
రాయచోటి పట్టణం కొత్తపేట- రామాపురానికి చెందిన కరాటే రామచంద్ర రైస్ పుల్లింగ్ మిషన్ నిర్వహిస్తున్నాడు. అయితే అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రామచంద్ర కుటుంబ సభ్యులను బెంగళూరుకు చెందిన నవీన్ మనుషులు కిడ్నాప్ చేసిన కేసులో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ తెలిపారు. వారిలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఆగస్టు 31న సంబేపల్లిలో కిడ్నాప్ జరిగినట్లు సమాచారం.
రాయచోటి పట్టణం కొత్తపేట- రామాపురానికి చెందిన కరాటే రామచంద్ర రైస్ పుల్లింగ్ మిషన్ నిర్వహిస్తున్నాడు. అయితే అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రామచంద్ర కుటుంబ సభ్యులను బెంగళూరుకు చెందిన నవీన్ మనుషులు కిడ్నాప్ చేసిన కేసులో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ తెలిపారు. వారిలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఆగస్టు 31న సంబేపల్లిలో కిడ్నాప్ జరిగినట్లు సమాచారం.
ప్రభుత్వ సబ్సిడీతో గృహాలకి ఇంటి పైకప్పు మీద సోలార్ రూఫ్ టాప్ నెలకొల్పుటకు, పీఎం సూర్య ఘర్ ముఫ్ట్ బీజలి యోజన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ పథకం గృహ వినియోగదారులకి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.
పుణ్యక్షేత్రమైన గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. కడప దేవాదాయశాఖ సూపరింటెండెంట్ రమణమ్మ పర్యవేక్షణలో 55 రోజులుగా భక్తులు స్వామివారికి హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించినట్లు తెలిపారు. 7 శాశ్వత హుండీల ద్వారా రూ. 36,48,364, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ. 62,317ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
కడప జిల్లా గువ్వల చెరువు ఘాటు రోడ్డులో బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. గువ్వల చెరువు ఘాటు మూడవ మలుపు వద్ద బీర్ బాటిళ్ల లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు సంబంధించి దరఖాస్తు గడువును సెప్టెంబర్ 17వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈవో అనురాధ తెలిపారు. డిసెంబర్ 8వ తేదీన నిర్వహించే ఈ పరీక్ష కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్లో అప్లికేషన్ ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్‌సైట్ www.bse.ap.gov.inలో అందుబాటులో ఉందని తెలిపారు.
సోమవారం YSR వర్ధంతి సందర్భంగా జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులర్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ వీఆర్‌లో పనిచేస్తున్న సీఐ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాలో సీఎం, మంత్రులు, అధికారులు సహాయక చర్యల్లో ఉంటే ఈ సీఐ మాత్రం జగన్ వెంట ఉన్నారని విమర్శిస్తున్నాయి. ఒక YCP కార్యకర్తగా సీఐ ఉండటం సిగ్గుచేటని ఆగ్రహిస్తున్నాయి.
కడప జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందించాలని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ మంగళవారం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలలో తీసుకోవాల్సిన చర్యలపై, విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు.
పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా నిబంధనలకు లోబడి కడప ఏరోడ్రమ్ అభివృద్ధి పనులను చేపట్టేందుకు, చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా కలెక్టర్ ఏరోడ్రమ్ కమిటీ చైర్మన్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కడప విమానాశ్రయం టర్మినల్ బిల్డింగ్‌లో ఏరోడ్రమ్, ఎయిర్ ఫీల్డ్ ఇన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీల సమావేశం జరిగింది. దీంతో విమానాశ్రయ అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.