Y.S.R. Cuddapah

News February 11, 2026

అరకప్పు కాఫీకి కాడు అభివృద్ధి కోసం పని చేయండి: కడప కలెక్టర్

image

ప్రొద్దుటూరు అభివృద్ధి సమీక్షలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. అరకప్పు కాఫీ కోసం కాకుండా అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని పొద్దుటూరు మున్సిపల్ అధికారులకు చురకలు అంటించారు. ఇటీవల ప్రొద్దుటూరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు 1/2 టీ కోసం గొడవ పడి, హోటల్ ర్యాంప్ కూల్చివేతకు జేసీబీ తీసుకెళ్లారు. ఈ ఘటనపై ACP నాగరాజును సస్పెండ్, ఛైర్మన్ వెంకటేశ్వర్లును టెర్మినేట్ చేశారు.

News February 11, 2026

కడప: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

image

కడప జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని DEO షంషుద్దీన్ చెప్పారు.

News February 10, 2026

కడప: డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఇదే చివరి అవకాశం

image

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలల విద్యార్థులు పెండింగ్ సబ్జెక్టులను ఒకేసారి రాసుకునే అవకాశాన్ని కల్పించినట్లు సీఈ ప్రొ. కె.ఎస్.వి. కృష్ణారావు తెలిపారు. 2010 నుంచి 2019 సంవత్సరాలలో డిగ్రీ చదివి పాస్ కాని వారికి ఇదే చివరి అవకాశమన్నారు. మార్చి 16వ తేదీ లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు YVU అధికార వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News February 10, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు:
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.15,950
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,674
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,670.

News February 10, 2026

రేపే అసెంబ్లీ: ఆకేపాటి, సుధ ఎంట్రీ ఇస్తారా..?

image

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా YCP MLAలు ఆకేపాటి అమరనాథరెడ్డి, దాసరి సుధ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సమావేశాలకు దూరంగా ఉన్న వీరు కీలకమైన బడ్జెట్ సమావేశాల్లోనైనా అడుగుపెడతారా అన్న అంశంపై ఆయా నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సభలో పాల్గొని సమస్యలపై గళమెత్తి నిధులు రాబట్టాలని స్థానికులు కోరుతున్నారు.

News February 10, 2026

SO..SAD కడప: మనుమడి బర్త్ డేకి వచ్చి మృతి.!

image

కడపలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్పీబంగ్లా నుంచి ఆర్టీసీ బస్టాండ్ వెళ్లే మార్గంలో జిల్లాని కోర్టు సమీపంలో ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి రాయచోటికి చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు. తన మనుమడి పుట్టినరోజుకు కడపకు రాగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

News February 9, 2026

ఎర్రగుంట్ల: కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు

image

ఎర్రగుంట్ల(M) పోట్లదుర్తిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాకోబ్(60) తన తల్లి సుందరమ్మ(90)పై ఆదివారం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బంధువులు వెంటనే ఆమెను ప్రొద్దుటూరుకు, ఆపై RIMSకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు CI విశ్వనాథరెడ్డి తెలిపారు. జాకోబ్ తన కూతురు లత వద్ద రూ.18 లక్షలు తీసుకున్నాడు. ఈ అప్పును తీర్చమన్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు CI చెప్పారు.

News February 9, 2026

కడప జిల్లాలో పలువురు సీఐలు బదిలీ

image

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
☛ నంద్యాల ఫ్యాక్షన్ జోన్‌కు ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్ సీఐ రియాజ్ అహ్మద్ బదిలీ
☛ గోవిందరెడ్డి కడప VR నుంచి ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్ బదిలీ
☛ దస్తగిరి కడప VR నుంచి అన్నమయ్య ఎస్సీ, ఎస్టీ సెల్‌కు బదిలీ
☛ లింగప్ప బద్వేల్ నుంచి మన్నూరుకు బదిలీ
☛ రామకృష్ణ సత్యసాయి జిల్లా నుంచి బద్వేల్‌కు బదిలీ.

News February 9, 2026

ఆర్థిక అక్షరాస్యత పై విస్తృతంగా అవగాహన కల్పించండి: కలెక్టర్

image

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలపై ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌తో కలసి ఆవిష్కరించారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

News February 9, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.1,650
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.1,476
* వెండి 10 గ్రాముల ధర: రూ.2,730.