India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలో రాగల నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం తెలిపింది.
శుక్రవారం: మోస్తరు నుంచి భారీ వర్షాలు
శనివారం: భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఆదివారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సోమవారం: మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నేటి నుంచి YSR, అన్నమయ్య జిల్లాల్లో డిసెంబర్ 1 వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కడప ఎంపీ YS అవినాశ్ రెడ్డి PA బండి రాఘవరెడ్డి తనపై మోపిన అభియోగాలకు సంబంధించిన కేసుపై ముందస్తు బెయిల్ పిటిషన్ కడపలోని జిల్లా కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. మెజిస్ట్రేట్ ఈ విచారణను 29కి వాయిదా వేశారు. అదే రోజున ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని పోలీస్ కస్టడీకి కోరిన పిటిషన్ విచారణ కూడా జరగనుంది.
జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య ఫ్లైయాష్ వివాదం నేపథ్యంలో ఇరువురి నేతలకూ CM చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ అమరావతికి వచ్చి తనను కలవాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఉచిత బూడిద వివాదంపై జిల్లా అధికారుల నుంచి సీఎం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైవీయూ పరిధిలో గల కమలాపురంలోని సీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్ఆర్ఎం డిగ్రీ, పీజీ కళాశాలలో బీఏ ఫస్టియర్ చదువుతున్న రేఖా మోని వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించారు. నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న దక్షిణ, పశ్చిమ భారత అంతర విశ్వవిద్యాలయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 45 కేజీల విభాగంలో ఈమె కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా ఆమెకు వైవీయూ వీసీ కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ పద్మ అభినందనలు తెలిపారు.
ప్రముఖ పాత్రికేయులు ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె. శ్రీనివాస్, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవిలకు గజ్జల మల్లారెడ్డి జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు. వైవీయూ వీసీ కె కృష్ణారెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. వైవీయూలో జరిగిన గజ్జల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కార ఎంపిక కమిటీ సమావేశాన్ని వైవీయూలో నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాత్రికేయులుగా ఖ్యాతి పొందారని తెలిపారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లైయాష్ తరలింపు విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొనడంతో జిల్లా అధికారుల నుంచి సీఎం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేలా వ్యహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన ఘటన పులివెందులలో చోటుచేసుకుంది. స్థానిక DSP మురళీ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వివేకానంద కాలనీలో ఉంటున్న యువతిని యస్వంత్ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, చివరికి కులం పేరుతో దూషించాడని యువతి తెలిపింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు అతణ్ని అరెస్ట్ చేశారు.
జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు భూపేశ్ రెడ్డిని JC ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాష్ తరలింపు విషయంలో అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని తెలిపారు. ఈ మేరకు కడప ఎస్పీకి లేఖ రాశారు. నేటి నుంచి తమ వాహనాలు లోడింగ్‌కు వెళ్తాయని, ఆపితే తేలిగ్గా తీసుకోమని అన్నారు. 1932 నుంచి రాజకీయాల్లో ఉన్నామని, తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తే దేనికైనా సిద్ధమేనని లేఖలో పేర్కొన్నారు.
అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాయచోటి పట్టణంలోని కాటిమాయకుంట రహదారి సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుడు రాయచోటి మండలం కాటిమాయకుంట చెందిన శ్రీను(45)గా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే ఇది హత్యా? లేక ఆత్మహత్యా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Sorry, no posts matched your criteria.