Y.S.R. Cuddapah

News January 25, 2026

కడపలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

image

గణతంత్ర దినోత్సవ వేడుకలకు కడప సిద్ధమైంది. కడప పోలీస్ పెరేడ్ మైదానంలో రేపు ఉదయం 8:30 గంటలకు జాతీయ జండాను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎగురవేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి చేస్తున్నారు. దాదాపు ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News January 25, 2026

కమలాపురం రాజకీయాల్లో వీరశివారెడ్డి ప్రభావమెంత..?

image

కమలాపురం మాజీ MLA వీరశివారెడ్డి BJPలో చేరి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 1980లో కోగటం సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంబించారు. ఆ తర్వాత LM బ్యాంక్ ఛైర్మన్, కమలాపురం MPP, కడప DCMS ఛైర్మన్, కమలాపురం MLAగా 3సార్లు పనిచేశారు. కుమారుడు అనిల్ DCCB ఛైర్మన్‌గా పని చేశారు. గతంలో కాంగ్రెస్, TDP, YCPలో పనిచేసిన ఆయన ఇప్పుడు BJPలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది.

News January 25, 2026

కడపలో ఈనెల 28న మెగా జాబ్‌మేళా.!

image

కడపలోని సంధ్యా సర్కిల్ డాన్ బోస్కో ITI కళాశాలలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 28న మెగా జాబ్ మేళా జరగనుంది. అయితే ఈ మేళాలో 25 ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. 18-35 ఏళ్లమధ్య వయస్సు కలిగి ఉండాలి. 10Th, ఇంటర్, డిగ్రీ, PG, ఐటీ విద్యార్హలు అర్హులు. మొత్తం 1080 ఉద్యోగాలు ఉన్నాయని, 28వ తేదీన ITI కళాశాలలో ఇంటర్వ్యూ జరుగుతాయని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సురేశ్ తెలిపారు.

News January 25, 2026

ఒంటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రాముడి గ్రామోత్సవం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో రథసప్తమి సందర్భంగా సీత రామ లక్ష్మణ మూర్తుల మూలవిరాట్ విగ్రహానికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీతా రామలక్ష్మణల ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఉదయం 9:30 నుంచి స్వామి వారి గ్రామోత్సవం మొదలైంది. ఈ ఉత్సవంలో అడుగడుగున భక్తులు స్వామికి కాయ కర్పూరం సమర్పించి భక్తిని చాటుకున్నారు.

News January 25, 2026

కడప: వీటితో జాగ్రత్త.!

image

ఏ ఉత్సవానికైనా పటాకుల పేలుళ్లు కచ్చితంగా మారాయి. అయితే వాటి విషయంలో కొంతమంది వహిస్తున్న నిర్లక్ష్యంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల జరిగిన శోభాయాత్రలో సెక్యూరిటీ గార్డ్ <<18946125>>హరి శంకర ప్రసాద్(52)<<>> పటాకులు తన శరీరంపై పేలడంతో చనిపోయారు. అయితే పటాకులు పేలుస్తున్న వారి నిర్లక్ష్యం వల్ల వాటికి దూరంగా ఉన్న హరి దగ్గరకు అవి వచ్చి పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే ‘సోదరా పటాకుతో జాగ్రత్త’గా ఉండండి.

News January 25, 2026

పుష్పగిరిలో అద్భుత శిల్పం

image

వల్లూరు మండలం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలోని ‘పాద కంటక’ (ముళ్లు తీసే) శిల్పం అద్భుతమని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ తెలిపారు. సాధారణ గిరిజన వేషధారణకు భిన్నంగా, ఇందులో కిరాత దంపతులకు పట్టు వస్త్రాలు, నగలు చెక్కడం శిల్పి నైపుణ్యానికి, చిత్రభాషకు నిదర్శనమన్నారు. ఇది గిరిజన సంప్రదాయాన్ని దైవత్వంతో ముడిపెట్టే అపురూప దృశ్యమని శనివారం ఆయన పేర్కొన్నారు.

News January 25, 2026

కడప ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

image

రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యకుమార్ శనివారం ప్రకటించారు. కడప జిల్లాలో మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ కేంద్రం ఏర్పాటుకు టెండర్లు నిర్వహించామన్నారు. డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో కిడ్నీ రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

News January 25, 2026

వైవీయూలో అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూ

image

వైవీయు క్యాంపస్ కళాశాల ఇంగ్లిశ్ విభాగంలో అతిథి అధ్యాపకుల నియామకం కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 29న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆచార్య టి.శ్రీనివాస్ తెలిపారు. ఎం.ఎ. ఇంగ్లిష్ లిటరేచర్, నెట్/సెట్/పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. వివరాలకు www.yvu.edu.in ని సందర్శించాలని సూచించారు.

News January 24, 2026

మృతుడి భార్యకు ఉద్యోగం ఇస్తాం: కడప ఎమ్మెల్యే

image

కడపలో గురువారం నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్రలో <<18946125>>మృతి చెందిన హరి<<>> భార్యకు ఉద్యోగంతో పాటు ఆర్థికంగా ఆదుకుంటామని MLA మాధవి రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ కడప రిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న అయోధ్య ఐక్యవేదిక సభ్యులు, మేయర్ సురేశ్, టీడీపీ నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుమారుడి చదువు కోసం సహాయం అందిస్తామని ఐక్యవేదిక సభ్యులు హామీ ఇచ్చారు.

News January 24, 2026

పుష్పగిరిలో అద్భుత శిల్పం

image

వల్లూరు మండలం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలోని ‘పాద కంటక’ (ముళ్లు తీసే) శిల్పం అద్భుతమని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ తెలిపారు. సాధారణ గిరిజన వేషధారణకు భిన్నంగా, ఇందులో కిరాత దంపతులకు పట్టు వస్త్రాలు, నగలు చెక్కడం శిల్పి నైపుణ్యానికి, చిత్రభాషకు నిదర్శనమన్నారు. ఇది గిరిజన సాంప్రదాయాన్ని దైవత్వంతో ముడిపెట్టే అపురూప దృశ్యమని శనివారం ఆయన పేర్కొన్నారు.