Y.S.R. Cuddapah

News January 29, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.18,500
* బంగారం 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.17,020
* వెండి 10 గ్రాముల ధర రూ.4,000.

News January 29, 2026

కడపలో ఇంటిని కూల్చిన ఘటన update

image

కడపలోని ఎర్రముక్కపల్లి కందిపాలెంలో రెండు రోజుల కిందట ఇంటిని అర్ధరాత్రి కూల్చిన ఘటనలో ద్వారకనాథరెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు కడప వన్ టౌన్ సీఐ వి.చిన్నపెద్దయ్య తెలిపారు. ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంకా పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News January 29, 2026

ఒంటిమిట్ట: ఇవాళ ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి సన్నిధిలో ఇవాళ భీష్మ ఏకాదశి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ టీటీడీ అధికారులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్‌కి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలకరించి, ఘనంగా గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు.

News January 28, 2026

ఫిబ్రవరి 2 నుంచి సంపూర్ణత అభియాన్ ప్రారంభం: కలెక్టర్

image

ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సంపూర్ణత అభియాన్ 2.0 ప్రారంభించాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన పలు ఇండికేటర్లను పక్కాగా అమలు చేయాలన్నారు. గత ఏడాది 100% విజయం సాధించిన నేపథ్యంలో మార్చి నెలాఖరికి అన్ని అంశాల్లో 100% సాధించి ప్రధాన స్థానంలో నిలవాలన్నారు.

News January 28, 2026

కడప రథోత్సవం.. ఎంక్వైరీకి ఆదేశం

image

తిరుమలకు తొలిగడపగా ఉన్న దేవుని కడపలో ఈ నెల 25న జరిగిన రథోత్సవంలో జరిగిన కొన్ని ఘటనలపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎంక్వైరీకి ఆదేశించారు. రథంపై ఉన్న కొత్త దేవతా ప్రతిమలను తీసుకురావడం, ముత్యాల శేషయ్య ఛారిటీకి ఆలయ పెద్ద మర్యాద ఇవ్వకపోవడం, గుర్రాలు రథసారథిలేని రథంపై దేవదేవుని ఆశీస్సుల కోసం భక్తులకు దర్శనం కల్పించడం లాంటి ఘటనలపై ఎంక్వైరీకి ఆదేశించారు.

News January 28, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.17,100
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.15,732
* వెండి 10 గ్రాములు ధర రూ.3,730.

News January 28, 2026

ఖాజీపేట: ‘మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు’

image

ఖాజీపేట (M) బి.కొత్త పల్లె గ్రామానికి చెందిన ముత్తూర్ హృషి కేశవ రెడ్డి గ్రూప్ 2 (ఏఎస్ఓ జిఏడి)ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈయన గతంలో 2019-23 వరకు కూనవారి పల్లె గ్రామ సచివాలయ సెక్రెటరీగా, 2023లో బ్రహ్మంగారిమఠంలో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం గ్రూప్ -2 లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, (సాధారణ పరిపాలన శాఖ) ఉద్యోగం లభించింది. ఈయన మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం విశేషం.

News January 27, 2026

ప్రొద్దుటూరు: సీఐ శ్రీరామ్‌కు లూప్ లైన్ కొత్తేమీ కాదు.!

image

ప్రొద్దుటూరు 1టౌన్ సీఐ శ్రీరామ్ కు లూప్ లైన్ అనేది కొత్తేమీ కాదు. ప్రతి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ మధ్య ఆయన్ను లూప్ లైన్లో ఉంచారు. అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో VRలో పెట్టారు. అదే జిల్లాల్లో DCRBలోను ఉంచారు. కడప, తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ విభాగంలోను ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ బృందంలో కీలక అధికారిగా శ్రీరామ్ ఉన్నారు.

News January 27, 2026

ప్రొద్దుటూరు 1 టౌన్ CI బదిలీ

image

ప్రొద్దుటూరు 1 టౌన్ <<18970409>>CI శ్రీరామ్‌ బదిలీ <<>>అయ్యారు. ఒకటిన్నర నెల క్రితం ఆయన బాధ్యతలు స్వీకరించగా.. చట్టానికి వ్యతిరేకంగా ఉన్నవారిపై ఉక్కుపాదం మోపారు. దీంతో ఆయనపట్ల అధికార పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉండగా ఆ విషయం MLA దృష్టికి తీసుకుని వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం నూతన సీఐగా TV కొండారెడ్డిని నియమిస్తూ అన్నమయ్య SP ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన RSASTF-అన్నమయ్యలో పనిచేస్తున్నారు.

News January 27, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా.
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రూ.16550.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రూ.15226.00
*వెండి 10 గ్రాముల ధర: రూ.3580.00