India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
YS జగన్ మాట్లాడేందుకు మైక్ ఇస్తాం.. పులివెందుల పౌరుషం ఉంటే అసెంబ్లీకి రావాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘అసెంబ్లీలో ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధం. తప్పులు చేసినందుకే జగన్ అసెంబ్లీకి రావడం లేదు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, అనుచిత పోస్టులు పెడితే ఊరుకోమని చట్ట ప్రకారం కచ్చితంగా శిక్షిస్తాం’ అని స్పష్టం చేశారు.
2024-2025వ సంవత్సరం సంపద సృష్టి లక్ష్యంగా అభివృద్ధి చక్రాన్ని పున: ప్రారంభించే ఉద్దేశ్యంతో రూ.2,94,427.25 కోట్లతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటిలో రాష్ట్ర బడ్జెట్‌పై కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్, టీడీపీ నాయకులు శివప్రసాద్ నాయుడు, బీజేపీ నాయకులు వెంకటరమణ గౌడ్ పాల్గొన్నారు.
ఆధార్ నమోదు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మేరకే సర్వీసు ఛార్జీలను చెల్లించాలని, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సోమవారం ఒక ప్రకటన ద్వారా ప్రజలకు సూచించారు. జిల్లాలో ఆధార్ సేవల నిర్వహణపై సోమవారం జేసీ అదితి సింగ్, ఆర్డీవోలు జిల్లాలోని పలు ఆధార్ సేవ కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఆధార్ సేవాకేంద్రాల్లో సేవలు అందించాలన్నారు.
వెంపల్లెలో సోమవారం రాత్రి కొందరు రెచ్చిపోయారు. స్థానికుల వివరాల ప్రకారం.. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిపై రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వెంపల్లెలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
కడప జిల్లాలో వేర్వేరు చోట్ల నదిలో దిగి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నూరు మండలం వాటర్ గండి వద్ద పెన్నా నదిలో పడి కడపకు చెందిన బిల్లపాటి బాబు మృతి చెందినట్లు CI పురుషోత్తమరాజు తెలిపారు. CKదిన్నె మండలం బుగ్గవంక డ్యామ్‌లో చేపల వేటకు వెళ్లి ఇప్పెంట గ్రామం యానాది కాలనీవాసి తాటిముక్కల అంకయ్య (54) మృతి చెందాడు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి కడప ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, యువతకు ఉద్యోగ కల్పన, పరిశ్రమలు, గండికోట అభివృద్ధి వంటి అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన MLAలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
రాష్ట్రస్థాయి అండర్ – 14 రగ్బీ పోటీల్లో వేంపల్లె జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపినట్లు ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ తెలిపారు. కమలాపురంలో జరిగిన ఈ రగ్బీ పోటిల్లో బాలికల విభాగంలో బిందు మాధవి 2వ స్థానం, బాలుర విభాగంలో నూరుల్లా 3వ స్థానంలో రాణించినట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపడంతో హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు. ప్రపంచ పర్యావరణ మార్పులు.. వాటి పరిణామాలపై జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇందులో ప్రపంచంలోని 40 దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. గ్రీన్ జోన్లలో మరింత పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాలపై చర్చలు జరిగాయి.
తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన భాషోద్యమ వీరుడు సీపీ బ్రౌన్. 10-11-1798లో కలకత్తాలో జన్మించారు. ఈస్ట్ ఇండియా తరఫున భారత్‌కు వచ్చి 1820లో కడపల డిప్యూటీ కలెక్టర్‌గా పని చేరారు. ఆ రోజుల్లో కడపలో ఇళ్లు కొనుక్కొని అక్కడే ఉన్నారు. తెలుగు నేర్చుకుని తెలుగు భాషా పరిశోధనకు కృషి చేశారు. అనేక తెలుగు గ్రంథాలను కూడా రాశారు. అలాంటి గొప్ప వ్యక్తికి మన కడప జిల్లాతో సంబంధాలు ఉండటం గర్వంగా ఉందని పలువురు అన్నారు.
కడపలో ఓ పోస్టర్ కలకలం రేపుతోంది. నగరంలోని 7రోడ్ల వద్ద EX ఆర్మీ పేరిట ఈ పోస్టర్‌ని గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేసే దమ్మున్న మగాడు, మొనగాడు లేడా అని పోస్టర్లో రాశారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, సీపీఎం, సీపీఐ అన్ని పార్టీలను విమర్శించారు ఇంతకూ ఈ పోస్టర్‌ని ఎవరు ఎవరు అంటించారనేది ప్రజల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ చర్చనీయాంశమైంది.
Sorry, no posts matched your criteria.