Y.S.R. Cuddapah

News January 10, 2026

swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

image

నాణ్యమైన విద్యను అందించే <>swayam<<>>, MOOCs ఆన్‌లైన్ కోర్సుల్లో ప్రతి ఒక్కరూ చేరాలని YVU వీసీ రాజశేఖర్ కోరారు. PM-U, PM-USHA ఆధ్వర్యంలో ఓపెన్ డిస్టెన్స్ ఆన్‌లైన్ ఫ్లాట్ ఫాం swayamపై వర్క్‌షాప్ నిర్వహించారు. IIT వంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలు ఇందులో ఉచితంగా విద్యను అందిస్తున్నాయన్నారు. ఫ్యాషన్ డిజైన్ నుంచి ఎరోప్లేన్ తయారీ, ఫొటోగ్రఫీ నుంచి వెబ్ డిజైన్ వంటి దాదాపు 700 కోర్సులు ఇందులో ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.

News January 9, 2026

కడప జిల్లాలో 81,345 విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు

image

కడప జిల్లాలో 81,345 విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. కడప డివిజన్లో 23,250, మైదుకూరులో 14,305, ప్రొద్దుటూరులో 30,304, పులివెందులలో 13,486 సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. స్మార్ట్ మీటర్లు విద్యుత్ వినియోగాన్ని పారదర్శకంగా చూపిస్తాయని ఎస్ఈ రమణ తెలిపారు. బిల్లులు ఆటోమేటిక్‌గా రూపొందుతాయన్నారు. విద్యుత్ పొదుపు, ఖర్చు తగ్గింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

News January 9, 2026

YVU: బీఈడీ, ఎంఈడీ పరీక్షా ఫలితాలు విడుదల

image

YVU బీఈడీ, ఎంఈడీ పరీక్షా ఫలితాలను వర్సిటీ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ శుక్రవారం విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ.. సెప్టెంబరులో పరీక్షలు జరిగాయన్నారు. ఫలితాలు సకాలంలో విడుదల చేశామన్నారు. విద్యార్థులు ఫలితాల కోసం వైవీయూ వెబ్సైట్ https://www.yvuexams.in/results.aspx ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. పద్మ, సీఈ ప్రొ. కృష్ణారావు పాల్గొన్నారు.

News January 9, 2026

20 సూత్రాల సమావేశానికి ప్రొద్దుటూరు MLA ఒక్కరే.!

image

కడపలోని 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంక దినకర్ అధ్యక్షతన శుక్రవారం కడపలో అభివృద్ధి సమావేశం జరిగింది. కాగా ఉమ్మడి కడప జిల్లాలో పదిమంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కీలకమైన ఈ సమావేశానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఒక్కరే హాజరయ్యారు. తన నియోజకవర్గంలోని సమస్యలపై ఆయన సమావేశంలో లేవనెత్తారు. వైసీపీ, జనసేనకు MLAలు ఉన్నా, వారెవ్వరూ సమావేశానికి హాజరుకాలేదు.

News January 9, 2026

కడప: సీట్‌లో కూర్చోకముందే ఆ SIలకు మళ్లీ ట్రాన్స్‌ఫర్

image

మూడు రోజులక్రితం కడప జిల్లాలో 18 మంది SIలు ట్రాన్స్‌ఫర్ అయిన విషయం తెలిసిందే. వారు బదిలీ అయిన స్టేషన్‌లో రిపోర్ట్ చేయకమునుపే వారిలో కొందరిని మళ్లీ బదిలీ చేశారు. మొదట ప్రొద్దుటూరు రూరల్ స్టేషన్ SIగా అరుణ్‌రెడ్డిని మైదుకూరుకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన అక్కడ సీట్‌లో కూర్చోకమునుపే కడప వీఆర్‌కి బదిలీ అయ్యారు. బద్వేల్ నుంచి శ్రీకాంత్‌ను మొదట ప్రొద్దుటూరు 1-టౌన్, ఇప్పుడు రూరల్‌కు బదిలీ చేశారు.

News January 9, 2026

గండికోట ఉత్సవాలు.. నేడు కడపలో బైక్ ర్యాలీ

image

గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కడపలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. రాజీవ్ మార్క్ సర్కిల్ వద్ద మధ్యాహ్నం 3.30 గంటలకు ర్యాలీ ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్, ఎర్రముక్కపల్లి సర్కిల్, ఐటీఐ బిల్ట్ సర్కిల్, వినాయక నగర్ సర్కిల్, అల్మాస్పేట్ మాసాపేట సర్కిల్, అన్నమయ్య సర్కిల్, అప్సర హాల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు జరుగుతుంది.

News January 8, 2026

ఒంటిమిట్ట: అమ్మమ్మను కత్తితో పొడిచాడు..!

image

ఒంటిమిట్ట మండలం నరసన్నగారిపల్లిలో కత్తిపోట్లు కలకలం రేపాయి. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాఘవమ్మ(70) పొలంలో పనిచేస్తుండగా ఆమె మనవడు నంద(20) కత్తితో పొడిచాడు. వెంటనే స్థానికులు గమనించి ఆమెను 108లో కడప రిమ్స్‌కు తరలించారు. మద్యానికి డబ్బులు ఇవ్వకపోతేనే దాడి చేసినట్లు సమాచారం. నంద తల్లి కువైట్‌లో ఉండగా.. ప్రస్తుతం అతను అమ్మమ్మ రాఘవమ్మ దగ్గర ఉంటున్నాడు.

News January 8, 2026

గండికోటలో తొలిసారి హెలికాప్టర్ ఎక్కేయండి..!

image

గండికోట ఉత్సవాలు ఈనెల 11, 12, 13న జరగనున్నాయి. టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతి అందించడానికి గండికోటలో మొదటిసారిగా హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి తెచ్చారు. ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున వసూళ్లు చేస్తారు. కాసేపు గండికోటలో హెలికాప్టర్‌లో తిప్పుతారు. సంబంధిత వాల్‌పోస్టర్లను కడప ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో TDP నేత శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.