Y.S.R. Cuddapah

News January 11, 2026

పల్లెనిద్ర తప్పనిసరి: కడప ఎస్పీ

image

పోలీస్ అధికారులంతా తప్పనిసరిగా పల్లెనిద్ర చేపట్టాలని జిల్లా ఎస్పీ నచికేత్ సూచించారు. శనివారం కడప పోలీస్ సబ్ డివిజన్ నేర సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి నిలపాలన్నారు. ఫిర్యాదు దారులపట్ల మర్యాదపూర్వకంగా నడుచుకొని సమస్యని పరిష్కరించాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు.

News January 11, 2026

గండికోట ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శ్రీధర్

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న గండికోట ఉత్సవాలకు సంబంధించి తుది మెరుగులు దిద్దుకుంటున్న ఏర్పాట్లను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాట్లుచేయాలని అధికారులకు సూచించారు. స్టేజీ, పార్కింగ్ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సలహాలు, సూచనలు ఇచ్చారు.

News January 10, 2026

గండికోటలో మొదటిరోజు షెడ్యూల్ ఇదే.!

image

గండికోటలో 11వ తేదీ మొదటిరోజు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
*సాయంత్రం 4:00 -5:30 గం.వరకు శోభాయాత్ర
*5:30 గం.లకు గండికోట ఉత్సవాలు
*6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన
*రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్
*రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం
*రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో
*రాత్రి 8:15 – 9:45 గం.వరకు – మంగ్లీచే సంగీత కచేరీ

News January 10, 2026

గండికోటలో మొదటిరోజు షెడ్యూల్ ఇదే.!

image

గండికోటలో 11వ తేదీ మొదటిరోజు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
*సాయంత్రం 4:00 -5:30 గం.వరకు శోభాయాత్ర
*5:30 గం.లకు గండికోట ఉత్సవాలు
*6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన
*రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్
*రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం
*రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో
*రాత్రి 8:15 – 9:45 గం.వరకు – మంగ్లీచే సంగీత కచేరీ

News January 10, 2026

గండికోటలో మొదటిరోజు షెడ్యూల్ ఇదే.!

image

గండికోటలో 11వ తేదీ మొదటిరోజు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
*సాయంత్రం 4:00 -5:30 గం.వరకు శోభాయాత్ర
*5:30 గం.లకు గండికోట ఉత్సవాలు
*6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన
*రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్
*రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం
*రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో
*రాత్రి 8:15 – 9:45 గం.వరకు – మంగ్లీచే సంగీత కచేరీ

News January 10, 2026

గండికోట ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు

image

గండికోట ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈనెల 11, 12, 13న ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు RTC రీజనల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి శనివారం తెలిపారు. జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల నుంచి మొత్తం 39 బస్సులను నడుపుతున్నామన్నారు. జమ్మలమడుగు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 10 వరకు బస్సులు తిరుగుతాయన్నారు. ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.

News January 10, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు..!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540

News January 10, 2026

గండికోట ఉత్సవాలు.. హెలికాఫ్టర్ రైడ్ ధర తగ్గింపు

image

గండికోట ఉత్సవాలలో హెలికాఫ్టర్ రైడింగ్‌లో ధరల తగ్గించినట్లు కలెక్టర్ తెలిపారు. ముందుగా ఒక వ్యక్తికి రూ. 5 వేలుగా నిర్ణయించగా.. దానిని రూ.3 వేలకు తగ్గిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. 6 నిమిషాలు రైడింగ్ ఉంటుందన్నారు. గండికోట చుట్టు పక్క ప్రాంతాలు, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయాన్ని హెలికాఫ్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.

News January 10, 2026

యాక్సిడెంట్.. కడప యువకుడి మృతి

image

కదిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా లింగాలలోని రామట్ల పల్లికి చెందిన అశోక్ (26) మృతి చెందాడు. బెంగళూరుకు బైకులో వెళుతుండగా మార్గమధ్యంలో డివైడర్‌ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో మృతుని కటుంబంలో విషాదం అలుముకుంది.

News January 10, 2026

swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

image

నాణ్యమైన విద్యను అందించే <>swayam<<>>, MOOCs ఆన్‌లైన్ కోర్సుల్లో ప్రతి ఒక్కరూ చేరాలని YVU వీసీ రాజశేఖర్ కోరారు. PM-U, PM-USHA ఆధ్వర్యంలో ఓపెన్ డిస్టెన్స్ ఆన్‌లైన్ ఫ్లాట్ ఫాం swayamపై వర్క్‌షాప్ నిర్వహించారు. IIT వంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలు ఇందులో ఉచితంగా విద్యను అందిస్తున్నాయన్నారు. ఫ్యాషన్ డిజైన్ నుంచి ఎరోప్లేన్ తయారీ, ఫొటోగ్రఫీ నుంచి వెబ్ డిజైన్ వంటి దాదాపు 700 కోర్సులు ఇందులో ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.