India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి YS జగన్ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా దీపాలు వెలగాలని, ఆనందాలు వెల్లువలా పొంగాలని అన్నారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుతున్నట్లు జగన్ పేర్కొన్నారు.

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ తెలిపారు. అర్జీదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాశ్ బాబు తెలిపారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేపథ్యంలో ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల కుటుంబాలతో సమావేశమై, వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి, ప్రభుత్వం అందించే సౌకర్యాలపై అవగాహన కల్పించామని చెప్పారు.

బద్వేల్పై TDP అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ విషయంలో నియోజకవర్గంలోని ప్రజలకు IVRS కాల్స్ చేసి అభిప్రాయాలను తెలుసుకుంది. ఇందులో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న రితీశ్ రెడ్డి, DCC బ్యాంక్ ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేర్లను పేర్కొంది. బద్వేలులో ఎవరైనా నాయకుడిగా ఎదిగారంటే అది వీరారెడ్డి కుటుంబం దయేనని, రితీశ్ రెడ్డే తమ నాయకుడు అని పలువురు TDP నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు.

కడప జిల్లాలో మరో ఎస్సై సస్పెండ్ అయ్యారు. విచ్చలవిడి అవినీతి, ప్రవర్తన సరిగ్గా లేవనే ఆరోపణలతో పెండ్లిమర్రి ఎస్సై <<18044279>>మధుసూధర్ రెడ్డిని<<>> సస్పెండ్ చేస్తూ డీఐజీ కోయా ప్రవీణ్ ఉత్తర్వులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలోనే తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సై హృషికేశవరెడ్డిపై కూడా ఆరోపణలు రావడంతో ఆయనని కూడా సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అతడిపై అనేక అవినీతి ఆరోపణలు రావడం, ఇతని ప్రవర్తనపై కూడా పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

దీపావళి పండగ సందర్భంగా కడప జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 33 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తెలిపారు. బెంగళూరు – చెన్నై, హైదరాబాదు – విజయవాడకు నడుస్తాయన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఒంటిమిట్ట రామాలయానికి వచ్చే భక్తులకు 600 తిరుమల లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారి నవీన్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కోటి రూ.50గా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పొందవచ్చన్నారు.

పోలీసుల అనుమతి లేకుండా కడప జిల్లా వ్యాప్తంగా ఇళ్లల్లో బాణాసంచా నిలువలు కానీ బాణసంచా నిల్వలు, విక్రయాలు చేయరాదని ఎస్పీ నచికేత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే టపాసుల విక్రయాలు చేయాలని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పోలీసుల అనుమతి లేకుండా కడప జిల్లా వ్యాప్తంగా ఇళ్లల్లో బాణాసంచా నిలువలు కానీ బాణసంచా నిల్వలు, విక్రయాలు చేయరాదని ఎస్పీ నచికేత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే టపాసుల విక్రయాలు చేయాలని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.