Y.S.R. Cuddapah

News September 28, 2024

ఈనెల 29న జిల్లాకు రానున్న మంత్రి సత్యకుమార్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తొలిసారి కడప జిల్లాకు రానున్నారు. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరులో జిల్లా కార్యకర్తల సమావేశం, నగర ప్రముఖులతో సమావేశం ఉంటుంది. 30వ తేదీ ఉదయం ప్రొద్దుటూరు సర్వజన ఆసుపత్రి పర్యటన అనంతరం, కడప రిమ్స్ ఆసుపత్రిలో ఆడిటోరియం, ల్యాబ్‌లను ప్రారంభిస్తారు. అనంతరం కడప నగరంలో పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు.

News September 28, 2024

కడప జిల్లాలో ఆర్డీవోల బదిలీలు

image

కడప జిల్లాలోని కడప, పులివెందుల, బద్వేల్ ఆర్డీవోలను బదిలీ చేస్తూ ఉన్నతధికారులు ఆదేశాలు జారీ చేశారు. కడప ఆర్డీవోగా జాన్ పలపర్తిని, జమ్మలమడుగు ఆర్డీవోగా ఆదిమూలం సాయి శ్రీ, బద్వేలు ఆర్డీవోగా చంద్రమోహన్‌ను, పులివెందుల ఆర్డీవోగా లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూషను నియమిస్తూ ఉన్నతధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటుపలువురు డిప్యూటీ కలెక్టర్లను జిల్లాలో బదిలీ చేశారు.

News September 27, 2024

కడప: వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు

image

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనలో భాగంగా కడప జిల్లా వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. తిరుపతి 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో లాంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

News September 27, 2024

పర్యాటక దినోత్సవాన్ని జయప్రదం చేయండి: కలెక్టర్ శంకర్

image

ప్రఖ్యాత గండికోట వేదికగా రేపు జరగబోయే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించే వేడుకలకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు ప్రతినిధులు పాల్గొంటారని జిల్లాలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ తెలిపారు. ప్రజల కోసం ప్రత్యేకంగా ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

News September 26, 2024

కడప: కేజీబీవీల్లో 604 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉద్యోగాలకు సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 342 టీచింగ్, 44 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, టైప్ 4 కేజీబీవీల్లో 165 టీచింగ్, 53 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు తెలిపారు. గురువారం ఆన్ లైన్ ద్వారా నగదు చెల్లింపునకు అవకాశం కల్పించారు. వివరాలకు apkgbv.apcfss.in వెబ్ సైట్‌‌‌ను సంప్రదించాలన్నారు.

News September 26, 2024

పులివెందుల: వివాహేతర సంబంధం.. రాళ్లతో కొట్టి చంపారు.

image

పులివెందులలో వేముల మండలం చాగలేరుకు చెందిన రామాంజనేయులుపై బుధవారం ఉదయం ఇద్దరు రాడ్లతో తలపై దాడి చేశారు. ఓ మహిళతో రామాంజనేయులు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమె కొడుకులు సందీప్, శివ నాగేంద్ర రామాంజనేయుని తీవ్రంగా గాయపరిచినట్లు సీఐ గంగనాథ్ తెలిపారు. క్షతగాత్రుడిని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు పేర్కొన్నారు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.

News September 26, 2024

కడప జిల్లాలో 13 మంది అరెస్ట్

image

జిల్లాలో జూదం ఆడుతూ 13 మంది బుధవారం అరెస్టయ్యారు. ఎర్రగుంట్లలోని ఎరుకల కాలనీలో 8, సింహాద్రిపురం మండలం వై.కొత్తపల్లెలో <<14196593>>ఐదుగురి<<>>ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి రూ.28,530 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టవ్యతిరేక పనులు ఎవరైనా చేస్తున్నట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు కోరుతున్నారు.

News September 26, 2024

కడప:మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ పరీక్షలు

image

కడప జిల్లా పరిధిలోని మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణారావు బుధవారం పేర్కొన్నారు. స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ అయితే అతి తక్కువ ఖర్చులోనే వైద్య సదుపాయాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యుల్లోని మహిళలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News September 26, 2024

కడప జిల్లాలో 252 మంది వీఆర్వోలు బదిలీ

image

కడప జిల్లా వ్యాప్తంగా 252 మంది వీఆర్వోలను బదిలీ చేసినట్లు కలెక్టర్ లోతేటి శివశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులను, వార్డు రెవెన్యూ కార్యదర్శులను బదిలీ చేసినట్లు తెలిపారు. వీఆర్వోలకు కేటాయించిన స్థానాలలో చేరాలని సూచించారు.

News September 25, 2024

కడప జిల్లాలో పటిష్ఠంగా ఇసుక సరఫరా: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారదర్శక విధానంతో జిల్లాలో ఉచిత ఇసుక సరఫరాను పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి రాష్ట్ర గనులు భూగర్భ శాఖ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌కు వివరించారు. ఉచిత ఇసుక సరఫరా అంశంపై కలెక్టర్లతో గనులు భూగర్భ శాఖ రాష్ట్ర కార్యదర్శి వీసీ ద్వారా సమీక్షించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ రవాణాదారులు మధ్య సేవాస్థాయి ఒప్పందం అంశాలపై వివరించారు.