Y.S.R. Cuddapah

News November 1, 2024

కడప: 4 నుంచి బీఈడీ సెమిస్టర్‌ పరీక్షలు

image

వైవీయూ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో 2, 4 సెమిస్టర్ల విద్యార్థులకు ఈ నెల 4వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. ఈ పరీక్షలను జిల్లాలోని కేంద్రాలను నిర్వహిస్తున్నామని 16,900 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. హాల్ టికెట్లను చదువుతున్న కళాశాల నుంచి పొందాలని సూచించారు.

News November 1, 2024

పుల్లంపేట: మహిళ చీరకు అంటుకున్న మంట

image

కొవ్వొత్తి పొరపాటున చీరకు అంటుకొని మహిళ గాయాలపాలైన ఘటన పుల్లంపేట మండలంలోని రామాపురంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఓ మహిళ ఇంట్లో దీపాలు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు చీరకు మంట అంటుకొని గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు.

News October 31, 2024

కడప యువకుడి ప్రతిభ భళా

image

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కడపలో యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. కడప చిన్నచౌక్‌కు చెందిన సాయి చరణ్ తనలోని ప్రతిభతో గంటల తరబడి కష్టపడి క్యూబ్స్‌తో సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపాన్ని చేశారు. ఇతను గతంలో అనేకమంది ప్రముఖుల చిత్రాలను అనేక మంది చిత్రీకరించారు. తల్లిదండ్రుల సహకారంతోనే ఇలాంటివి చేస్తున్నట్లు సాయి చరణ్ స్పష్టం చేశారు.

News October 31, 2024

కడప నుంచి బెంగళూరు బయలుదేరిన జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కడప జిల్లాలో తన మూడు రోజుల పర్యటన ముగించుకొని బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు నుంచి రెండు రోజుల క్రితం హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వెళ్లి అనంతరం పులివెందుల చేరుకున్నారు. మంగళ, బుధవారాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలను, ప్రతి ఒక్కరిని పులివెందులలోని తన నివాసంలో కలిశారు. క్యాడర్‌కు దిశానిర్దేశం చేసి గురువారం ఉదయం ఇడుపులపాయ చేరుకొని హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు.

News October 31, 2024

ప్రొద్దుటూరు మహిళకు ఐకానిక్ అవార్డు

image

అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కడప జిల్లా మహిళ సత్తా చాటింది. ప్రొద్దుటూరుకు చెందిన సుజిత బ్యూటీ క్లినిక్ నడుపుతున్నారు. చెన్నై వేదికగా WBPC ఆధ్వర్యంలో కాస్మటాలజిస్ట్ పోటీలు నిర్వహించారు. ఇందులో దాదాపు 18 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనగా.. వరల్డ్ బ్యూటీ కాస్మటాలజిస్ట్, అస్థెటిక్ ఐకాన్ అవార్డులను సుజిత దక్కించుకున్నారు. హీరో విశాల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆమెను పలువురు అభినందించారు.

News October 31, 2024

కడప జిల్లా వాసికి వైవీయూ డాక్టరేట్

image

వైవీయూ తెలుగు శాఖ స్కాలర్ తమ్మిశెట్టి వెంకట నారాయణకు డాక్టరేట్ లభించింది. ఆచార్య ఎం.ఎం.వినోదిని పర్యవేక్షణలో “తెలుగులో శ్రామిక కథలు – స్త్రీ చైతన్యం (1980 నుంచి 2015 వరకు)” అనే శీర్షికపై పరిశోధన చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలం బూడిదగుంటపల్లెకు చెందిన వెంకట నారాయణ చేసిన పరిశోధనలో మూడున్నర దశాబ్ద కాలంలో గ్రామీణ, పట్టణ మహిళల స్థితిగతులు, ఆనాటి పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు.

News October 30, 2024

కడప: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

కడప-కృష్ణాపురం రైలు మార్గంలోని ఎగువ రైలు పట్టాలపై షేక్ అన్వర్ బాషా (62) ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే హెడ్ కానిస్టేబుల్ గోపాల్ తెలిపారు. రామాపురం మండలం హసనాపురం గ్రామానికి చెందిన అన్వర్ బాషా అప్పుల బాధతో మంగళవారం మధ్యాహ్నం ముంబయి-చెన్నై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ వివరించారు.

News October 30, 2024

కడప: కూతురిపై మద్యం మత్తులో తండ్రి లైంగిక దాడి

image

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కసాయిలా మారి కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దముడియం మండల పరిధిలోని నెమళ్లదిన్నెకి చెందిన మతిస్తిమితం లేని కూతురిపై మద్యం మత్తులో తండ్రి అత్యాచారం చేసినట్లు సమాచారం. అయితే బాలిక 2 రోజులుగా నీరసంగా ఉండటంతో తల్లి కూతురిని ప్రశ్నించింది. దీంతో బాలిక తల్లి భర్తపై పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది.

News October 29, 2024

సిద్ధవటం పెన్నా నదిలో యువతి గల్లంతు

image

సిద్ధవటం పెన్నా నదిలో ఎగువ పేట దళిత వాడకు చెందిన సునీత (19) గల్లంతైనట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. మంగళవారం నదిలోకి దిగిన యువతి ప్రవాహ వేగంలో కొట్టుకుపోయిందన్నారు. దీంతో పోలీసులు పెన్నా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. తమ బిడ్డను ఎలాగైనా కాపాడాలని యువతి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

News October 29, 2024

పెద్దముడియం: కూతురిపై తండ్రి లైంగిక దాడి

image

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కసాయిలా మారి కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం పెద్దముడియంలో జరిగింది. నెమళ్లదిన్నె గ్రామానికి చెందిన మతిస్తిమితం లేని ఓ బాలికపై మద్యానికి బానిసైన తండ్రి అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.