Y.S.R. Cuddapah

News December 15, 2024

కడపలో ప్రతిపక్ష వైసీపీకి బిగ్ షాక్.?

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు తన సొంత జిల్లా కడపలో బిగ్ షాక్ తగలనుందా.? కడప కార్పొరేషన్‌లో ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు YCPని వీడి TDPలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక కార్పొరేటర్ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా మిగిలిన ఏడుగురు కార్పొరేటర్లు ఎల్లుండి CM చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి.

News December 15, 2024

రాజంపేట: పుట్టినరోజు నాడు తీవ్ర విషాదం

image

రాజంపేటలో శనివారం రోడ్ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన కిరణ్ రాజంపేట ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. శనివారం కిరణ్‌ పుట్టినరోజు కావడంతో పులివెందులకు చెందిన బన్నీ చెన్నైలో చదువుతూ రాజంపేటకు వచ్చారు. కాగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. కిరణ్ పుట్టిన రోజు నాడే చివరి రోజైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

News December 15, 2024

ఇంధన భద్రత, పొదుపు ప్రతి ఒక్కరి భాద్యత: కడప కలెక్టర్

image

ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేది వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి గోడపత్రాలు, కరపత్రాలను శనివారం తన క్యాంప్ ఆఫీసులో కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి విడుదల చేశారు. ఇంధనాన్ని పొదుపు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

News December 14, 2024

సావిశెట్టిపల్లె నీటి సంఘం అధ్యక్షుడిగా విజయ రెడ్డి

image

శ్రీ అవధూత కాశినాయన మండలంలోని సావిశెట్టి పల్లె ఆయకట్టు చెరువుకు సంబంధించి శనివారం నీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల అధికారి బాలి రెడ్డి తెలిపారు. నీటి సంఘం అధ్యక్షుడిగా విజయరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా బండి సుబ్బ లక్ష్మమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, బండి రామచంద్రారెడ్డి, రఘురాంరెడ్డి వారిని అభినందించారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

News December 14, 2024

ఓబులవారిపల్లి: హత్య కేసు నిందితులు అరెస్ట్

image

ఓబులవారిపల్లి మండలం మంగంపేట 10వ వీధికి చెందిన గట్టు ఆంజనేయులు(57) హత్య కేసులో నిందితుడు అయ్యలరాజుపల్లికి చెందిన అంజనేయ ప్రసాద్‌కు సహకరించిన చంద్రకళ, సింహాద్రిని కూడా అరెస్టు చేశామని రాజంపేట డీఎస్పీ సుధాకర్ తెలిపారు. శుక్రవారం కోడూరు స్టేషన్‌లో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి, వివరాలు వెల్లడించారు. యూట్యూబర్ అయిన నిందితుడు సానుభూతి పొందడానికి వీడియో రిలీజ్ చేశారని తెలిపారు.

News December 14, 2024

రాష్ట్రంలో రాజంపేట టాప్

image

కోటి సభ్యత్వాలే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తోంది. రూ.100 కడితే రూ.5 లక్షల బీమా ఉండటంతో పలువురు టీడీపీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో నిన్నటి వరకు మొత్తం సభ్యత్వాల సంఖ్య 71 లక్షలు దాటింది. ఇందులో రాజంపేట టాప్‌లో ఉంది. ఆ తర్వాతే సీఎం సొంత నియోజకవర్గం కుప్పం ఉండటం గమనార్హం.

News December 13, 2024

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య: YS జగన్‌

image

కడప జిల్లా వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల్లో అధికార టీడీపీ నేతల దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్ట్‌లపై దాడి హేయమైన చర్యని YS జగన్‌ అభిప్రాయపడ్డారు. X వేదికగా ఈ దాడిని ఆయన శుక్రవారం తీవ్రంగా ఖండించారు. మీడియాపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. నిజాలు నిర్భయంగా వెలికితీస్తున్న మీడియా గొంతు నొక్కేయాలనుకోవడం కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్య అన్నారు.

News December 13, 2024

కీలక విషయాలు బయటపెట్టిన కడప కలెక్టర్

image

సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కడప కలెక్టర్ శ్రీధర్ కీలక విషయాలు బయటపెట్టారు. ‘వేరే జిల్లాలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్‌తో మా జిల్లాలో 3,600 మంది పింఛన్ తీసుకుంటున్నారు. వీరిపై అనుమానంతో తనిఖీలు చేయగా కేవలం 127 మందే అర్హులని తేలింది. మిగిలిన వాళ్లు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకున్నారు’ అని CMకు చెప్పారు. వెంటనే వారి నుంచి పెన్షన్ డబ్బులు రికవరీ చేసి.. అవసరమైతే కేసు పెట్టాలని CM ఆదేశించారు.

News December 13, 2024

రాజంపేట: ఆటో డ్రైవర్ సూసైడ్

image

రాజంపేట మండలం ఆకేపాడు నవోదయ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ రాజశేఖర్ (37) కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. మద్యానికి బానిసైనా రాజశేఖర్ ఇంట్లో తన భార్య డ్వాక్రా కోసం ఉంచుకున్న డబ్బులు, కొంత నగలు అమ్మి మద్యానికి ఖర్చు చేశాడు. దీంతో భార్యాభర్తల ఇరువురి మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 12, 2024

కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు ఎప్పుడంటే?

image

కడప : పలు కారణాలరీత్యా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల సెమిస్టర్ల పరీక్షల కోసం కొత్త తేదీలను వైవీయూ సీఈ ఆచార్య కె.కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 2 తేదీన జరగాల్సిన పరీక్షలు ఇదేనెలలో 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 3 తేదీన జరగాల్సిన పరీక్ష 21వ తేదీ ఉంటుందని సీఈ తెలిపారు. విద్యార్థులు సంబంధిత తేదీలలో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.