India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఒక మోస్తరు వర్షం కురిసింది. సిద్ధవటంలో అత్యధికంగా 6.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బి కోడూరులో 1.8 మిల్లీమీటర్లు, బద్వేలులో 1.2 మిల్లీమీటర్లు, ప్రొద్దుటూరులో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో ఈ ప్రాంతాల్లో పంటలు సాగుచేసిన కాస్త ఊరట కలిగింది.
ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ షాక్ కొట్టి మూడేళ్ల బాలుడు చనిపోయిన విషాద ఘటన పుల్లంపేట మండలం దలవాయిపల్లెలో చోటు చేసుకుంది. బిందుప్రియకు మూడేళ్ల కుమారుడు జాన్ వెస్లిన్ ఉన్నాడు. తల్లి శుక్రవారం వేడినీటి కోసం బాత్రూంలోని బకెట్‌లో వాటర్ హీటర్‌ను ఉంచి ఆన్ చేసింది. తల్లి ఇంట్లో పని చేసుకుంటుండగా ఆడుకుంటూ అటువైపుగా వెళ్లిన బాలుడు దానిని తాకాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.
కడప జిల్లాలో ఉత్పత్తి అయ్యే చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో చేనేత సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైలవరం మండలం టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందేలా చర్యలు చేపడతామన్నారు.
YVUలో కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం, కీబోర్డ్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించనున్నట్లు ప్రవేశాల సంచాలకుడు డా.టి.లక్ష్మి ప్రసాద్ తెలిపారు. ప్రవేశాలు ఈ నెల 8వ తేదీ నుంచి 22 వరకు DOA కార్యాలయంలో జరుగుతాయని తెలిపారు. ఆసక్తి కల అభ్యర్థులు www.yvu.edu.in వెబ్సైట్ సంప్రదించాలన్నారు. పదేళ్ల వయసు నుంచి ఆపై ఉన్నవారు అర్హులన్నారు.
రాయచోటిలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో ఉరివేసుకొని నాసిర్ హుస్సేన్ అనే హిందీ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తలు విడివిడిగా ఉండడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతుడు వీరబల్లి మండలం, యర్రంరాజుగారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఒకే లైనుపై రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఢీ కొనకుండా ముందస్తుగా ప్రమాదాన్ని పసిగట్టి నివారించే వ్యవస్థ కవచ్‌ను కడప జిల్లాలో అమలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు సంబంధిత సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇది కార్యరూపం దాలిస్తే ముంబై – చెన్నై మార్గంలో నాల్వార్, గుంతకల్, నందలూరు, రేణిగుంట లైనులో ఈ వ్యవస్థ అమలు కానుంది.
కడప జిల్లాలోని కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు ఆర్డీవో కార్యాలయాల ఏవోలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయ ఏవోగా డి. తిరుపతయ్య, పులివెందుల ఆర్డీవో కార్యాలయ ఏవోగా ఎంఏ రమేశ్, బద్వేల్ ఆర్డీవో కార్యాలయ ఏవోగా సి. అక్బల్ బాషా, కడప ఆర్డీవో కార్యాలయ ఏవోగా పి. శంకర్ రావు నియమితులయ్యారు.
కడప జిల్లాలో గురువారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లాకు నాలుగవ స్థానం లభించింది. మొత్తం 2,64,013 మంది లబ్ధిదారులకు గాను.. 2,58,100 మంది (97.76%)కి పెన్షన్‌ను పంపిణీ చేశామన్నారు. అందుకుగాను పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ శివశంకర్ అభినందనలు తెలిపారు.
కడప జిల్లా చెన్నూరు మండలం ఉప్పరపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఉప్పరపల్లికి చెందిన గాజులపల్లె శివ కడప నబి కోటకు చెందిన కొప్పర్తి మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చమని కడప ఏడు రోడ్ల కూడలి వద్ద శివను షర్టు పట్టుకొని అసభ్యంగా తిడుతూ కొట్టాడు. దీంతో అవమాన భారంతో తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడని కుటుంబీకులు తెలిపారు.
పులివెందుల – కదిరి ప్రధాన రహదారిపై ఉదయం ఆటోని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కూలి పనులు నిమిత్తం పులివెందుల ప్రాంత గ్రామాలకు వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. వీరంతా సత్య సాయి జిల్లా బట్రేపల్లి వాసులు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.