India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో కడప జిల్లా నుంచి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు జిల్లాలోని ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందరోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన పనితీరుపై చర్చించారు.
విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం 1వ తరగతి విద్యార్థిని తన పాకెట్ మనీని విరాళంగా అందించింది. వివరాలిలా ఉన్నాయి. పులివెందులకు చెందిన ఒకటో తరగతి విద్యార్ధిని ఎం.వర్ణిక వరద బాధితులను చూసి చలించి పోయింది. వారికి సహాయం చేయాలని అనుకుంది. ఈ క్రమంలో తన బాబాయి ప్రణీత్ కుమార్‌తో కలిసి బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌కు తన పాకెట్ మనీ రూ.72,500 విరాళంగా అందించింది.
ఉమ్మడి కడప జిల్లాలో రెండో విడత 8 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
➤ కడప: ఓల్డ్ బస్టాండ్ వద్ద
➤ కడప: ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ వద్ద
➤ కడప: ZP ఆఫీస్ వద్ద
➤ జమ్మలమడుగు: ఆపోజిట్ MRO ఆఫీస్ వద్ద
➤ ప్రొద్దుటూరు: దూరదర్శన్ సెంటర్ వద్ద
➤ పులివెందుల: ఓల్డ్ జూనియర్ కాలేజీ వద్ద
➤రాజంపేట: RB బంగ్లా వద్ద
➤రాయచోటి: గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద SHARE IT.
ఈనెల 19 నుంచి ఏపీ ఆన్‌లైన్ శాండ్ పోర్టల్ అందరికీ అందుబాటులోకి రానుందని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. ఈ పోర్టల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభిస్తారని తెలిపారు. ఇసుక బుకింగ్ ప్రక్రియ, రవాణాదారుల జాబితా పొందుపరిచే ప్రక్రియ, బల్క్ వినియోగదారుల ఇసుక అవసరాన్ని ముందుగానే వెరిఫికేషన్‌ను భూగర్భ శాఖ ద్వారా జేసీ లాగింగ్‌కు పంపించాలని తెలిపారు.
వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి మాజీ మంత్రి దివంగత YS వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రూ.10లక్షల విరాళాన్ని అందజేశారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌తో మంగళవారం చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.
విజయవాడ వరద బాధితులకు టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అండగా నిలిచారు. తన సొంత నిధులు రూ.6 లక్షలు విరాళంగా ప్రకటించారు. అలాగే పులివెందుల నాయకులు, కార్యకర్తల నుంచి మరో రూ.4 లక్షలు విరాళంగా వచ్చాయి. మొత్తం రూ.10 లక్షల చెక్కును రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుకు బీటెక్ రవి అందజేశారు.
కడప జిల్లాలోని మండల ప్రత్యేకాధికారులు ప్రాధాన్యతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ యోజన, సాలిడ్ వెస్ట్ ప్రాసెసింగ్ సెంటర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, స్వచ్ఛతా హీ సేవ, హౌసింగ్, నూతన ఇసుక పాలసీ, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు
రాజంపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో సెప్టెంబర్ 20న జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేసీ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. రాజంపేట పరిసర ప్రాంతాల్లోని యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైదియా దేవి పాల్గొన్నారు.
వేంపల్లి పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చల్లా.సుబ్బారావు ఆర్మీలో ఉద్యోగం చేస్తు మరణించినట్లు బంధువులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీలో 18 ఏళ్లుగా ఉద్యోగం చేసేవాడు. ఈనెల 15వ తేదీన అనారోగ్యంతో మరణించడంతో ఆయన మృతదేహాన్ని మంగళవారం వేంపల్లెకు తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య రేణుకా వారికి ఇద్దరు పిల్లలు హేమ,జగదీష్ కలరు. ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు.
మౌలిక వసతులు, సిబ్బంది కొరత సాకులు చూపి పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దని సీఎం లేఖ రాయడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సగం ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కొరత ఉందన్నారు. ఆ మాత్రాన వీటిని మూసేస్తారా అని ప్రశ్నించారు. ఎన్ఎంసీకి అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చి మెడికల్ కళాశాల ప్రారంభించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.