news

News September 8, 2025

బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి: భట్టి

image

TG: ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను ఇవ్వాలని Dy.CM భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘రుణమాఫీ, రైతు భరోసా పేరిట ప్రభుత్వం రైతుల పక్షాన రూ.30వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వండి. ఆస్తుల తాకట్టు, FDలు చేయండంటూ వారిని ఒత్తిడి చేయొద్దు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి’ అని సూచించారు.

News September 8, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఈ రాత్రికి ఢిల్లీకి TG సీఎం రేవంత్
* యూరియాపై ఏ ఒక్క రైతు ఆందోళన చెందొద్దు: అచ్చెన్న
* గుంటూరు తురకపాలెంలో HYD శ్రీబయోటెక్ శాస్త్రవేత్తల బృందం పర్యటన
* యూరియా కోసం సిద్దిపేటలో రైతుల ఆందోళన.. హైవేపై ట్రాఫిక్ జామ్
* భారత మెన్స్ హాకీ జట్టుకు అభినందనలు: మంత్రి మండిపల్లి
* వరంగల్ (D) మామునూరులో ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్.. TG, AP, బిహార్, ఝార్ఖండ్ NCC విద్యార్థులు హాజరు

News September 8, 2025

మల్లెపూలతో విమానం ఎక్కిన నటికి బిగ్ షాక్

image

బ్యాగులో మల్లెపూలు పెట్టుకొని ఆస్ట్రేలియా వెళ్లిన మలయాళ నటి నవ్య నాయర్‌కు మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్ అధికారులు రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఓనం కార్యక్రమంలో పాల్గొనేందుకు మెల్‌బోర్న్ వెళ్లగా ఎయిర్‌పోర్ట్ చెకింగ్‌లో మల్లెపూలు కనిపించాయి. ఇది బయో సెక్యూరిటీ చట్టాలకు విరుద్ధమంటూ ఫైన్ వేశారు. పండ్లు, పూలు, విత్తనాల రవాణాతో ప్రయాణికులకు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ఈ చట్టాలు రూపొందించారు.

News September 8, 2025

ఆ జట్టులో నాకు గౌరవం దక్కలేదు.. ఏడ్చేశా: గేల్

image

IPL ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్‌పై మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆ జట్టులో నాకు గౌరవం దక్కలేదు. టోర్నీ పాపులారిటీకి ఎంతో కృషి చేసినా, ఫ్రాంచైజీకి విలువ తేగల నన్ను చిన్నపిల్లాడిలా చూశారు. జీవితంలో ఫస్ట్ టైమ్ డిప్రెషన్‌లోకి వెళ్లా. కుంబ్లేతో మాట్లాడినప్పుడు ఏడ్చేశా’ అని చెప్పుకొచ్చారు. రాహుల్ తనను జట్టులోనే ఉండాలని చెప్పాడని, కానీ బ్యాగ్ సర్దుకొని వచ్చేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News September 8, 2025

విటమిన్ల కోసం ఇవి తినండి!

image

విటమిన్ A- క్యారెట్లు, కాలేయం. B1 – తృణధాన్యాలు, చిక్కుళ్లు. B2 – పాలు, గుడ్లు, పాలకూర. B3 – చికెన్, వేరుశనగ. B5 – అవకాడో, గుడ్లు. B6 – అరటిపండు, సాల్మన్ చేప, ఆలుగడ్డలు. B7 – గుడ్లు, బాదం, కాలీఫ్లవర్. B9 – ఆకుకూరలు, పప్పులు, సిట్రస్. B12 – చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు. విటమిన్ D – సూర్యకాంతి, చేపలు, పాలు. K- కాలే, బ్రోకలీ, సోయాబీన్. E – పొద్దుతిరుగుడు గింజలు, బాదం. C – నారింజ, జామ. SHARE IT

News September 8, 2025

బదిలీలపై చివరి దశకు కసరత్తు!

image

AP: ఆల్ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలపై కసరత్తు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై నిన్న CS, DGP, CMO అధికారులతో CM చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. JCల నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీలు.. SPల నుంచి DIG, IGల వరకు కీలక పోస్టుల్లో కొత్త అధికారులు వచ్చే అవకాశముందని చెబుతున్నాయి. సరైన స్థానంలో సరైన అధికారి అనే కాన్సెప్ట్ కోసం CM కసరత్తు చేస్తున్నారని పేర్కొంటున్నాయి.

News September 8, 2025

CM రేవంత్‌కు సుప్రీంకోర్టులో ఊరట

image

TG: CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ‘BJP అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది’ అని గతేడాది మే 4న కొత్తగూడెం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై TG BJP వేసిన పిటిషన్‌ను SC డిస్మిస్ చేసింది. కోర్టును రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దని CJI గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కాగా ఈ పిటిషన్‌ను గతంలో HC కొట్టేయగా BJP నేత కాసం వెంకటేశ్వర్లు SCలో సవాల్ చేశారు.

News September 8, 2025

ఈవారం ఓటీటీలోకి రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలు

image

సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కూలీ’ ఈనెల 11న ఓటీటీలో(అమెజాన్ ప్రైమ్ వీడియో) విడుదల కానుంది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.500 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా తెరకెక్కిన ‘సైయారా’ చిత్రం ఈనెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

News September 8, 2025

మహాలయ పక్షాలు అంటే ఏంటి?

image

భాద్రపద మాసంలో కృష్ణ పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షాలు అని అంటారు. అవి నేడు ప్రారంభమయ్యాయి. ఈ దినాలు పితృ దేవతలకు సంబంధించినవని, పితృ కార్యాలు చేయడానికి పవిత్రమైనవని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో కాలం చేసిన పెద్దలకు మనం విడిచే తర్పణాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని అంటున్నారు. ఈ 15 రోజుల్లో ఈ కార్యాలు చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదని ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం.

News September 8, 2025

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలు

image

శ్రీ కాళహస్తీశ్వర ఆలయం(తిరుపతి జిల్లా), శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం, మహానంది నందీశ్వర ఆలయం, యాగంటి ఉమా మహేశ్వర ఆలయం(నంద్యాల), ద్రాక్షారామం భీమేశ్వర స్వామి గుడి(కోనసీమ), అమరేశ్వర స్వామి ఆలయం (అమరావతి), పాలకొల్లు క్షీరారామ ఆలయం, భీమవరం సోమారామ ఆలయం(ప.గో), తాడిపత్రి రామలింగేశ్వరస్వామి (అనంతపురం), కుమారారామం కుమారభీమేశ్వర స్వామి ఆలయం(కాకినాడ), భైరవకోన దేవాలయం(ప్రకాశం).