news

News April 10, 2025

చంద్రబాబు గారూ.. రొయ్యల రేటు ఎందుకు పెరగడం లేదు?: జగన్

image

AP: సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశాలు ఆక్వా రైతులకు మేలు చేసేలా ఉండాలని YS జగన్ అన్నారు. ‘రొయ్యలకు వేసే మేతపై సుంకం 15% నుంచి 5%కి తగ్గింది. సోయాబీన్‌ రేటు కిలోకు రూ.105 నుంచి రూ.25కి పడిపోయింది. ముడిసరకుల రేట్లు పడిపోయినప్పుడు ఫీడ్‌ రేట్లు ఎందుకు తగ్గడం లేదు? US టారిఫ్స్ వాయిదా పడినా అక్కడికి ఎగుమతయ్యే రొయ్యల ధర ఎందుకు పెరగడం లేదు’ అని సీఎంను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

News April 10, 2025

కంగన ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్లు.. అధికారులు ఏమన్నారంటే?

image

BJP ఎంపీ కంగనా రనౌత్ మనాలిలోని నివాసానికి <<16040761>>రూ.లక్ష కరెంటు బిల్లు<<>> రావడంపై హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ అధికారులు స్పందించారు. జనవరి 16 నుంచి ఆమె ఎటువంటి చెల్లింపులు చేయట్లేదని, సాధారణ ఇళ్ల వినియోగం కంటే ఆ ఇంటికి 1500% ఎక్కువగా కరెంటు లోడ్ ఉందని వెల్లడించారు. మొత్తం కలిపి రూ.90,384 బిల్లు చెల్లించాలని తేల్చి చెప్పారు. తాను అసలు ఆ ఇంట్లో ఉండట్లేదని కంగనా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

News April 10, 2025

మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు: చిరంజీవి

image

అగ్నిప్రమాదంలో గాయపడ్డ పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడని చిరంజీవి ట్వీట్ చేశారు. ‘అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయస్వామి దయతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఎప్పటిలాగే ఉంటాడు. ఆంజనేయ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి మా బిడ్డను కాపాడాడు. మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. నా తరఫున, పవన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అని తెలిపారు.

News April 10, 2025

గవర్నమెంట్ స్కూళ్లలో ప్రీ స్కూల్ ఆలోచన: CM

image

TG: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ‘5 సంవత్సరాల వయసు ఉంటేనే ప్రభుత్వ స్కూళ్లకు పంపాలన్న నిబంధన ఉంది. అదే ప్రైవేటు స్కూళ్లల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అంటూ విధానం ఉండటంతో తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు. మూడేళ్లు ప్రైవేటు స్కూళ్లల్లో చదివించి ఒకటో తరగతికి ప్రభుత్వ స్కూళ్లకు ఎవరూ మార్చడం లేదు’ అని తెలిపారు.

News April 10, 2025

IPL: కెప్టెన్‌గా ధోనీ ట్రాక్ రికార్డు

image

ఐపీఎల్‌లో సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ పలు రికార్డులు కలిగి ఉన్నారు.
* అత్యధిక విజయాలు-133 మ్యాచులు
* అత్యధిక విన్నింగ్ శాతం: 58.9%
* ఐపీఎల్ ట్రోఫీలు-5(రోహిత్‌తో కలిసి)
* అత్యధిక సార్లు ప్లేఆఫ్ ఎంట్రీ-12
* అత్యధిక సార్లు ఫైనలిస్ట్-10

News April 10, 2025

లోకో పైలట్లకు నో బ్రేక్స్: రైల్వేశాఖ

image

డ్యూటీలో ఉండగా భోజనానికి, కాలకృత్యాలు తీర్చుకునేందుకు లోకో పైలట్లకు విరామ సమయాన్ని కేటాయించాలన్న విజ్ఞప్తిని రైల్వే శాఖ తిరస్కరించింది. రైలు ప్రమాదాలు పెరుగుతుండడం, వాటిలో చాలా వరకు మానవ తప్పిదాలే కారణమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పైలట్ల క్యాబిన్లలో వాయిస్, వీడియో రికార్డింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడాన్ని సమర్థించుకుంది. దీనివల్ల సిబ్బంది ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంది.

News April 10, 2025

30 లక్షల మందికి రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్

image

TG: పేదలకు సన్నబియ్యం న్యాయంగా అందేలా చూసే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జలసౌధలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దొడ్డు బియ్యం పేదలకు చేరకపోవడం వల్లనే సన్నబియ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి MLA తమ నియోజకవర్గంలో పథకం అమలును పర్యవేక్షించాలని సూచించారు. త్వరలోనే 30 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు.

News April 10, 2025

ఊహించని ప్రమాదం.. 218 మంది మృతి

image

డొమినికన్ రిపబ్లిక్‌లో నైట్ క్లబ్‌ <<16049528>>పైకప్పు కూలిన<<>> ఘటనలో మృతుల సంఖ్య 218కి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేవరకు సహాయక చర్యలు కొనసాగుతాయని అధికారులు చెప్పారు. 150 మందికి పైగా ప్రాణాలతో కాపాడినట్లు పేర్కొన్నారు. కాగా తమవారి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయనే వివరాలు ఇవ్వకపోవడంతో అధికారులపై మృతుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

News April 10, 2025

ట్రేడ్ వార్.. భయం లేదంటున్న చైనా

image

తమ దేశ ఉత్పత్తులపై అమెరికా 125% టారిఫ్ విధించడంపై చైనా స్పందించింది. యూఎస్ కవ్వింపు చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని, ఇది ప్రపంచ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొంది. అలాగే చైనాలో ప్రదర్శించే యూఎస్ సినిమాల సంఖ్యను తగ్గించనున్నట్లు చైనా ఫిల్మ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.

News April 10, 2025

రేపు ఓటీటీలోకి ‘ఛావా’ మూవీ

image

విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ మూవీ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.800 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!