news

News September 8, 2025

టిక్ టాక్‌పై బ్యాన్ ఎత్తివేయం: కేంద్ర మంత్రి

image

టిక్ టాక్ యాప్‌పై నిషేధం ఎత్తివేసే ఆలోచన లేదని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆ యాప్‌ను మళ్లీ పునరుద్ధరించే ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వంలో కూడా ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. కాగా భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో టిక్ టాక్ యాప్ మళ్లీ ఇండియాలోకి వస్తుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి ఈ విధంగా స్పందించారు.

News September 8, 2025

నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు: కాజల్

image

తనకు యాక్సిడెంట్ అయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఫన్నీగా ఉంటాయని తెలిపారు. దేవుడి దయతో తాను ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నానని చెప్పారు. తప్పుడు ప్రచారాలపై ఫోకస్ చేయకుండా నిజాలపై దృష్టి పెట్టాలని కోరారు. కాగా రోడ్డు ప్రమాదంలో కాజల్‌కు తీవ్రగాయాలు అయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

News September 8, 2025

రేపటి నుంచే ఆసియా కప్.. లైవ్ ఎక్కడ చూడాలంటే?

image

రేపటి నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగుతోంది. గ్రూప్-Aలో భారత్, పాక్, UAE, ఒమన్, గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లా, అఫ్గాన్, హాంకాంగ్ తలపడతాయి. దుబాయ్, అబుదాబి వేదికల్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచులు ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ 1, 3, 4, 5, సోని లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. గ్రూపు దశలో భారత్‌ 10, 14, 19 తేదీల్లో మ్యాచులు ఆడనుంది.

News September 8, 2025

‘సృష్టి’ కేసు.. ముగ్గురు వైద్యుల సస్పెండ్

image

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘<<17423890>>సృష్టి<<>>’ ఫర్టిలిటీ కేసులో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు సస్పెండ్ అయ్యారు. ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆంధ్ర వైద్య కళాశాల అనస్థీషియా HOD డాక్టర్ రవి, గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఉషాదేవి, శ్రీకాకుళం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యుల్లతను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురిపై HYDలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది.

News September 8, 2025

భారత్ పొరుగు దేశాల్లో గొడవలు.. ప్రభుత్వాల మార్పు

image

2021 మయన్మార్: ఎన్నికైన ప్రభుత్వంపై మిలిటరీ తిరుగుబాటు. ఆంగ్ సాన్ సూకీని అరెస్టు చేయడంతో పెద్దఎత్తున నిరసనలు
2022 శ్రీలంక: అప్పులు, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో ఆందోళనలు. ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్స రాజీనామా
2024 బంగ్లాదేశ్: షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన. హసీనా రాజీనామాతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.
>తాజాగా నేపాల్‌లో యువత ఆందోళన.. హోంమంత్రి రాజీనామా

News September 8, 2025

ఒకే ఫ్రేమ్‌లో పవర్, ఐకాన్, గ్లోబల్ స్టార్స్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ఫ్రేములో దర్శనమిచ్చారు. అల్లు అరవింద్ అమ్మ కనకరత్నం పెద్ద కర్మ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. చిరంజీవి దంపతులూ హాజరయ్యారు. ఈ ఫొటోలను గీతా ఆర్ట్స్ షేర్ చేసింది. కనకరత్నం ఆశీస్సులు తమపై ఉంటాయని పేర్కొంది. కాగా తమ అభిమాన హీరోలు ఒకే ఫొటోలో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News September 8, 2025

నేపాల్‌లో హింస.. హోంమంత్రి రాజీనామా

image

నేపాల్‌లో <<17651342>>హింసాత్మక ఘటనలు<<>> జరుగుతుండటంతో ఆ దేశ హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి పంపారు. సోషల్ మీడియా నిషేధంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అక్కడి యువత ఇవాళ ఆందోళనకు దిగింది. పోలీసులు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు. 250 మందికి పైగా గాయాలయ్యాయి.

News September 8, 2025

తొలి సౌత్ ఇండియా నటుడిగా బాలయ్య

image

ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో బెల్ మోగించిన తొలి సౌత్ ఇండియా నటుడిగా బాలకృష్ణ అరుదైన ఫీట్ అందుకున్నారు. ఇవాళ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రతినిధులతో ముంబై వెళ్లానని, అందులో భాగంగా NSEని సందర్శించానని పేర్కొన్నారు. NSE అధికారులు తన పట్ల చూపిన ఆత్మీయత, గౌరవం తన హృదయాన్ని తాకిందన్నారు. ప్రత్యేకంగా ఆహ్వానించి బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారని వివరించారు.

News September 8, 2025

రాష్ట్రానికి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

image

AP: సెప్టెంబర్ నెలకు సంబంధించి కేంద్రం నుంచి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘కాకినాడ పోర్ట్ నుంచి 17,294, మంగళూరు పోర్ట్ నుంచి 5,400, జైగర్ పోర్ట్ నుంచి 10,800, విశాఖ పోర్ట్ నుంచి 15,874 మెట్రిక్ టన్నుల యూరియా 2 రోజుల్లో రాష్ట్రానికి వస్తుంది. వ్యవసాయ అధికారుల సిఫారసు మేరకు మాత్రమే యూరియా వాడాలి. రైతులు ధైర్యంగా ఉండాలి’ అని సూచించారు.

News September 8, 2025

శ్రీదేవి తన గదికి రానిచ్చేది కాదు: బోనీ కపూర్

image

‘మామ్’ మూవీ షూటింగ్ సమయంలో శ్రీదేవి తన గదికి అస్సలు రానిచ్చేది కాదని ఆమె భర్త బోనీ కపూర్ తెలిపారు. ఆ పాత్ర పట్ల ఆమె ఎంత నిబద్ధతతో పనిచేసిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు. ‘ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్‌ను తీసుకోవాలనుకున్నాం. రెమ్యునరేషన్ ఎక్కువ అని వద్దనుకున్నాం. కానీ శ్రీదేవి తన పారితోషికం రూ.70 లక్షలు ఇచ్చి ఆయనను తీసుకురావాలని చెప్పారు’ అని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.