India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘మామ్’ మూవీ షూటింగ్ సమయంలో శ్రీదేవి తన గదికి అస్సలు రానిచ్చేది కాదని ఆమె భర్త బోనీ కపూర్ తెలిపారు. ఆ పాత్ర పట్ల ఆమె ఎంత నిబద్ధతతో పనిచేసిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు. ‘ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్‌ను తీసుకోవాలనుకున్నాం. రెమ్యునరేషన్ ఎక్కువ అని వద్దనుకున్నాం. కానీ శ్రీదేవి తన పారితోషికం రూ.70 లక్షలు ఇచ్చి ఆయనను తీసుకురావాలని చెప్పారు’ అని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
AP: ప్రజా సమస్యలపై చర్చించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు తగిన సమయం ఇస్తామన్నారు. అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘యూరియాపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. యూరియాపైనే కాదు మిగతా అన్ని సమస్యలపైనా చర్చిద్దాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈనెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.
వైద్యం వ్యాపారపరమైన ఈ రోజుల్లో ఓ వైద్యుడు లక్షలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి దైవంగా మారారు. నేపాల్‌కి చెందిన డా.సందుక్ రూయిట్ తన జీవితాన్ని పేదవారికి చూపును ప్రసాదించేందుకు అంకితం చేశారు. హిమాలయ పర్వతాల్లోని మారుమూల గ్రామాల నుంచి ఆసియా, ఆఫ్రికా అంతటా ఆయన సేవలు విస్తరించాయి. ఆయన ప్రారంభించిన ‘హిమాలయన్ క్యాటరాక్ట్ ప్రాజెక్ట్’ 14లక్షలకు పైగా రోగులకు చికిత్స చేసింది.
రైల్వేలో 32,438 గ్రూప్-D పోస్టుల భర్తీకి <<15529908>>RRB<<>> నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు నవంబర్ 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు 10 రోజుల ముందు ఎగ్జామ్ సెంటర్, డేట్ వంటి వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అభ్యర్థులు అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక <
ఫిట్‌గా మారేందుకు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 8 కిలోల బరువు తగ్గినట్లు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ ర్యాన్ ఫెర్నాండో తెలిపారు. ఐపీఎల్ తర్వాత 2-3 నెలల్లోనే డైట్, కఠోర సాధన చేసి వెయిట్ లాస్ అయినట్లు వెల్లడించారు. ఇందుకు ఆయన ఎలాంటి ఫ్యాషన్ డ్రగ్స్ వాడలేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కొందరు బరువు తగ్గేందుకు GLP-1 మందును వాడారు. కానీ హిట్‌మ్యాన్ మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదని పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హైకోర్టును గడువు కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖరుతో కోర్టు ఆదేశించిన డెడ్‌లైన్ ముగియనుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఓటరు స్లిప్పులు కూడా తయారు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్ ఎన్నికలకు మరికొంత వ్యవధి కోరేందుకు సిద్ధమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వచ్చే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతోంది? ఈ అంశంపై వే2న్యూస్ కాన్‌క్లేవ్ నిర్వహిస్తోంది. అమరావతి (మంగళగిరి) CK కన్వెన్షన్‌లో ఈనెల 12న ఈ సదస్సు జరగనుంది. దేశంలో డిజిటల్ మీడియా సంస్థ తొలిసారి నిర్వహిస్తున్న ఈ కాన్‌క్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు సహా రాష్ట్ర ప్రముఖులు ఎందరో హాజరుకానున్నారు. ఇందులో ఏపీ@2035 లక్ష్యాలు, ఆలోచనలతో రోడ్ మ్యాప్ ప్రజెంట్ చేస్తారు.
Note: Invite Only Event
‘35 చిన్న కథ కాదు’ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన మలయాళ క్యూటీ నివేదా థామస్ తాజా ఫొటోలు వైరలవుతున్నాయి. వైట్ శారీలో ఓనమ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో గతంతో పోలిస్తే కాస్త బరువు తగ్గినట్లు ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గద్దర్ అవార్డు వేడుకల సమయంలో నివేదా <<16710784>>బరువు<<>> పెరిగారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
దేశం అంతటా VoNR (Voice over 5G) సేవలను JIO యాక్టివేట్ చేసింది. ఇప్పటివరకూ VoLTE ఉండగా ప్రస్తుతం 5G నెట్‌వర్క్‌పై పనిచేసే VoNR అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల నెట్‌వర్క్ వీక్‌గా ఉన్నప్పుడు 5G నుంచి 4Gకి మారడం లాంటి సమస్యలు ఉండవు. కాల్ నాణ్యత మెరుగవుతుంది. స్పష్టంగా వినిపిస్తుంది. కాల్ త్వరగా కనెక్ట్ అవుతుంది. బ్యాటరీ ఆదా అవుతుంది. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఇంటర్నెట్ వేగం తగ్గదు.
AP: దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని హెచ్చరించింది.
Sorry, no posts matched your criteria.