news

News August 23, 2025

మేజరైన యువతి కోరుకున్న వ్యక్తితో జీవించొచ్చు: హైకోర్టు

image

పెళ్లి కాని యువతి వివాహితుడితో కలిసి జీవించొద్దని చట్టంలో ఎక్కడా లేదని MP హైకోర్టు తెలిపింది. పురుషుడి భార్యకు తప్ప మరెవరికీ ఆమెపై ఫిర్యాదు చేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది. మేజరైన యువతికి నచ్చినవారితో జీవించే హక్కు ఉంటుందని పేర్కొంది. తమ కుమార్తె ఓ పెళ్లైన వ్యక్తితో వెళ్లిపోయిందని ఆమె పేరెంట్స్ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా పైవిధంగా తీర్పునిచ్చింది.

News August 23, 2025

HYD రావాలని OpenAIకి KTR విజ్ఞప్తి

image

ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేస్తామని ప్రకటించిన ప్రముఖ AI సంస్థ OpenAIని HYDకు రావాలని మాజీ మంత్రి KTR కోరారు. ‘హైదరాబాద్ అనువైన ప్రాంతం. ఇక్కడ THub, WEHub, TWorks, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సహా ఎన్నో ఉన్నాయి. MNCలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్, క్వాల్కమ్‌కు కేంద్రంగా ఉంది. AI విప్లవానికి శక్తినిచ్చే ప్రతిభ, ఆవిష్కరణలు, గ్లోబల్ కనెక్టివిటీని HYD తీసుకొస్తుంది’ అని Xలో పోస్ట్ చేశారు.

News August 23, 2025

CHECK NOW.. మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా?

image

AP: ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్తగా 6.71 లక్షల మందితో కలిపి మొత్తం 1.45 కోట్ల అర్హుల కుటుంబాలకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వనుంది. రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తుకు ఆమోదం వచ్చిందో లేదో ఇక్కడ <>క్లిక్ <<>>చేసి, దరఖాస్తు చేసిన అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఆమోదం వస్తే కొత్తగా QR కోడ్ రేషన్ కార్డు వస్తుంది.

News August 23, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 పెరిగి రూ.1,01,620కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,000 ఎగబాకి రూ.93,150 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 23, 2025

SBI క్రెడిట్ కార్డు హోల్డర్లకు అలర్ట్

image

సెప్టెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల విషయంలో మార్పులు చేస్తున్నట్లు SBI ప్రకటించింది. డిజిటల్ గేమింగ్ లావాదేవీలు, ప్రభుత్వ చెల్లింపులపై రివార్డు పాయింట్లు రావని వెల్లడించింది. లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డు, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI సెలక్ట్, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డు ప్రైమ్‌లకు ఇది వర్తిస్తుంది. ఇటీవల HDFC కూడా గేమింగ్ లావాదేవీలపై రివార్డు పాయింట్లను నిలిపివేసింది.

News August 23, 2025

దులీప్ ట్రోఫీకి గిల్ దూరం? కారణం అదేనా?

image

భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు మెడికల్ టీమ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ నెల 28 నుంచి జరగబోయే దులీప్ ట్రోఫీకి ఆయన దూరమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్‌కు మాత్రం అందుబాటులో ఉంటారని సమాచారం. కాగా దులీప్ ట్రోఫీలో గిల్ నార్త్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

News August 23, 2025

ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు!

image

TG: పార్టీ ఫిరాయింపు MLAలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ చర్యలు ప్రారంభించారు. విచారణకు రావాలని తాజాగా ఐదుగురు MLAలకు నోటీసులు ఇచ్చారు. వారిని విచారించాక మిగతా వారికి నోటీసులిచ్చే ఛాన్సుంది. 10 మంది MLAలు BRS టికెట్‌పై గెలిచి INCలో చేరారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని BRS డిమాండ్ చేస్తుండగా తాము పార్టీ మారలేదని పలువురు MLAలు చెబుతున్నారు.

News August 23, 2025

ధర్మస్థల: శవాలు పూడ్చానన్న వ్యక్తి అరెస్టు

image

కర్ణాటకలోని ధర్మస్థలలో వందలాది మంది మహిళల మృతదేహాలను పూడ్చానని చెప్పిన మాజీ శానిటరీ వర్కర్‌ను సిట్ అరెస్ట్ చేసింది. అతడు చెప్పినవన్నీ అబద్ధాలేనని తేల్చి అదుపులోకి తీసుకుంది. 1995-2014 వరకు మహిళల శవాలను పూడ్చానని అతడు ఫిర్యాదు చేయడంతో నేత్రావతి నది ఒడ్డున గత కొన్ని రోజులుగా సిట్ తవ్వకాలు జరిపింది. కానీ ఎలాంటి అవశేషాలు లభించలేదు. తన భర్తతో కొందరు అబద్ధాలాడిస్తున్నారని అతడి భార్య మీడియాకు చెప్పింది.

News August 23, 2025

ఫ్రీ బస్సు.. మరో గుడ్‌న్యూస్

image

APలో ఫ్రీ బస్సు ద్వారా ప్రతిరోజూ 21 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని RTC ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. తొలి వారం కోటి మంది ‘స్త్రీశక్తి’ ప్రయాణాలు చేసినట్లు వెల్లడించారు. దీని ద్వారా మహిళలకు వారంలో రూ.41.22 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. అటు బస్సుల్లో రద్దీని తగ్గించేలా త్వరలోనే 1050 ఎలక్ట్రిక్ బస్సులు, మరో 1500 బస్సులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

News August 23, 2025

డిగ్రీ అడ్మిషన్లపై గైడ్‌లైన్స్

image

AP: డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లపై ఉన్నత విద్యామండలి గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ అడ్మిషన్లకు అవకాశం కల్పించింది. విద్యార్థి కోరుకున్న కాలేజీకి వెళ్లి కాలేజీ లాగిన్ ద్వారా నచ్చిన కోర్సు ఎంపిక చేసుకోవచ్చు. మరో కాలేజీకి వెళ్లి మరో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరిగా వెళ్లిన కాలేజీకే ప్రాధాన్యత ఇస్తారు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నా, ఆఫ్‌లైన్ విధానానికే ప్రాధాన్యత ఇస్తారు.