India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

IBPS క్లర్క్ పోస్టులకు నిన్నటితో దరఖాస్తు గడువు ముగియగా దాన్ని ఆగస్టు 28 వరకు పొడిగించారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో మొత్తం 10,270 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. ఏపీలో 367, తెలంగాణలో 261 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లై కోసం ఇక్కడ <
>>SHARE IT

AP: అమరావతిపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. ‘వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాలి. అది పూర్తిగా మట్టితో నిండిపోవడంతో నీళ్లు వెనక్కి వచ్చాయి. అధికారులు రోడ్డుకు గండికొట్టి నీటిని బయటకు పంపించారు. అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ వాళ్లు డిజైన్ చేశారు. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే ఛీ కొడతారు’ అని తెలిపారు.

EV కారు బ్యాటరీపై ప్రజల్లో నెలొకన్న సందేహాలను Deloitte 2025 రిపోర్ట్ నివృత్తి చేస్తోంది. ఆ నివేదిక ప్రకారం.. EV కారు కొన్న మూడేళ్లకే లక్షలు పెట్టి బ్యాటరీ మార్చనక్కర్లేదు. వాటికి కనీసం 10-20 ఏళ్ల లైఫ్ ఉంటుంది. TATA మోటార్స్ లైఫ్ టైమ్, OLA 8ఏళ్లు వారంటీ ఇస్తున్నాయి. టెస్లా డేటా ప్రకారం 2లక్షల కి.మీ. డ్రైవ్ చేసినా బ్యాటరీ కెపాసిటీ 80% ఉంటుంది. EV కార్ల ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

TG: కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును రద్దు చేయాలని కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే ముందుకెళ్తామని ఏజీ హైకోర్టుకు తెలిపారు.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కుమారుడు రామ్ చరణ్ ఎమోషనల్ విషెస్ చెప్పారు. ‘నా హీరో, నా గైడ్, నా స్ఫూర్తి మీరే. నేను సాధించిన విజయం, నేను నేర్చుకున్న విలువలు మీ నుంచి పొందినవే. 70ఏళ్ల వయసులో మీరు మరింత స్ఫూర్తిని నింపుతున్నారు. బెస్ట్ ఫాదర్‌గా ఉన్నందుకు థాంక్స్’ అని పోస్ట్ చేశారు. అటు చిరంజీవి బర్త్‌డే నేపథ్యంలో సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి <<17474104>>మద్దతు ఇవ్వడానికి<<>> వైసీపీకి సిగ్గుండాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైరయ్యారు. ‘వైసీపీ ముసుగు మళ్లీ తొలగింది. బీజేపీకి బీ-టీమ్ అని రుజువైంది. మోదీకి దత్తపుత్రుడే అని ప్రజలకు అర్థమైంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ముగ్గురూ మోదీ తొత్తులే. బీజేపీకి ఊడిగం చేసే బానిసలే. టీడీపీ, జనసేనది తెరమీద పొత్తు. వైసీపీది తెరవెనుక అక్రమ పొత్తు’ అని ట్వీట్ చేశారు.

AP: మద్యం కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని సిట్ ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. గతంలోనే నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో తిరుపతి జిల్లా పుత్తూరులోని ఆయన ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ రూపకల్పన సమయంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు.

TG: KCR, KTRకు పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెట్టే సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని BRS హెచ్చరించింది. ‘KCR, KTRను టార్గెట్ చేస్తూ SMలో కొందరు పోస్టులు పెడుతున్నారు. వారికి కాంగ్రెస్ డబ్బులు ఇస్తోంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. గొర్రెల స్కామ్‌పై SMలో పలు వీడియోలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో వీధికుక్కలపై ఆగస్టు 11న ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. షెల్టర్లకు తరలించిన కుక్కలకు స్టెరిలైజ్, ఇమ్యునైజేషన్ తర్వాత బయట ప్రదేశాల్లో వదిలేయాలని సూచించింది. రేబిస్ సోకిన, దూకుడుగా ఉండే కుక్కలను వదలవద్దని ఆదేశించింది. వీధికుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టవద్దని ఆదేశించింది. ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రదేశాలను ఎంపిక చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.

మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టిన రోజు <<17480281>>శుభాకాంక్షలు<<>> వెల్లువెత్తుతున్నాయి. ‘సినిమా, సమాజానికి మీరు చేసిన అద్భుతమైన కృషి గర్వకారణం, స్ఫూర్తిదాయకం’ అని మంత్రి లోకేశ్, ‘వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాల మంత్రులు, సినీ హీరోలు, దర్శకులు విషెస్ తెలియజేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.