news

News April 23, 2025

BREAKING: మోదీ సౌదీ పర్యటన రద్దు

image

ప్రధాని మోదీ రెండు రోజుల <<16179736>>సౌదీ అరేబియా పర్యటనను<<>> మధ్యలోనే రద్దు చేసుకున్నారు. కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో కాసేపట్లో జెడ్డా నుంచి బయలుదేరనున్నారు. ఇవాళ ఉ.5 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. ఉగ్రవాదుల ఏరివేతపై దిశానిర్దేశం చేయనున్నారు. ఉగ్రదాడిలో <<16183726>>దాదాపు 30 మంది పౌరులు<<>> మరణించిన విషయం తెలిసిందే.

News April 23, 2025

TODAY HEADLINES

image

* ‘హిరోషిమా’ మృతులకు CM రేవంత్ నివాళులు
* రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు: జగన్
* సీఎం రేవంత్‌కు సిగ్గుంటే ముక్కు నేలకు రాయాలి: కేటీఆర్
* వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ సస్పెండ్
* జమ్మూ కశ్మీర్‌ ఉగ్ర దాడిలో 30 మంది మృతి
* తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
* సివిల్స్ ఫలితాలు విడుదల
* భారీగా పెరిగిన బంగారం ధరలు
* LSGపై DC ఘనవిజయం

News April 23, 2025

పహల్గాం ఉగ్రదాడి అమానుషం: రాష్ట్రపతి

image

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ముర్ము ఖండించారు. ఆ ఘటన చాలా బాధ కలిగించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఉగ్రదాడి గురించి తెలిసి షాక్‌కు గురయ్యాను. ఇది పిరికిపంద చర్య. అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. అమాయక పౌరులపై దాడి చేయడం క్షమార్హం కాదు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం’ అని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఉగ్రదాడిని ఖండించారు.

News April 23, 2025

రేపు ఉదయం 10 గంటలకు..

image

AP: రాష్ట్రంలో రేపు ఉదయం 10 గంటలకు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షలతోపాటు ఓపెన్ స్కూల్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్ రిజల్ట్స్ కూడా విడుదల కానున్నాయి. ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. మీకెంతో ఇష్టమైన Way2News యాప్ ద్వారా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు.
ALL THE BEST

News April 23, 2025

పహల్గాం దాడి కలచివేసింది: ట్రంప్

image

J&K పహల్గాం దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ‘చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రధాని మోదీకి, భారతీయులకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మీకు మా ప్రగాఢ సంతాపం’ అని తెలిపారు.

News April 23, 2025

IPL: లక్నోపై ఢిల్లీ ఘన విజయం

image

LSGతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఛేజింగ్‌లో రాహుల్(57*), పోరెల్(51) అర్ధ శతకాలతో రాణించారు. ఓ మోస్తరు లక్ష్యం కావడంతో ఢిల్లీ బ్యాటర్లు ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. మార్క్రమ్ 2 వికెట్లు తీశారు. ఇవాళ విజయం సాధించినా రన్‌రేట్ పరంగా PTలో DC 2వ స్థానంలో కొనసాగుతోంది. GT అగ్రస్థానంలో ఉంది.

News April 22, 2025

ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ ఆఫీసర్ మృతి

image

J&k పహల్గామ్‌లో ఇవాళ జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మనీశ్ రంజన్ మృతి చెందారు. ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పహల్గామ్ పర్యటనకు వెళ్లగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భార్య, పిల్లలను తనకు ఎదురుగా పరిగెత్తమని చెప్పారు. ఇంతలోనే బుల్లెట్లు తగిలి మనీశ్ ప్రాణాలు వదిలాడు. భార్యాపిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.

News April 22, 2025

వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ సస్పెండ్

image

AP: YCP నేత, MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. మాజీ CM, ఆ పార్టీ అధినేత YS జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దువ్వాడ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

News April 22, 2025

దిగజారుతున్న పంత్ ప్రదర్శన.. ఫ్యాన్స్ ఫైర్

image

IPL: LSG కెప్టెన్ రిషభ్ పంత్ ప్రదర్శన రోజురోజుకూ దిగజారుతోంది. ఇవాళ DC మ్యాచ్‌లో చివర్లో వచ్చి డకౌట్ కాగా, ఆ జట్టు ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. వేలంలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ ఇస్తే, ఇలాగేనా ఆడేది? అంటూ మండిపడుతున్నారు. పంత్ ఈ ఏడాది లీగ్‌లో 8 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధశతకం(63) చేశారు. రెండు సార్లు డకౌట్ అయ్యారు. కేవలం 13.25 యావరేజ్, 96.36 స్ట్రైక్‌రేట్‌తో పేలవంగా ఆడుతున్నారు.

News April 22, 2025

రేపు 39 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: రేపు రాష్ట్రంలోని 39 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం(7), విజయనగరం(17), మన్యం(13), అల్లూరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ నంద్యాల జిల్లాలోని దోర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. సిద్ధవటం-43.8, కర్నూలు-43.5, వతలూరు-42.9, పెద్ద దోర్నాలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.