India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: అనంతపురం(D) గుత్తి సబ్ డివిజినల్ కార్యాలయంలో సీనియర్ ఇన్‌స్పెక్టర్ సతీశ్ కుమార్ CM చంద్రబాబు, మంత్రి అచ్చెన్న సంతకాలను ఫోర్జరీ చేశారు. దీంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేశారు. గతేడాది ఎన్నికల సమయంలో షేర్ మార్కెట్ పనులు చేసుకుంటూ అతను విధులకు గైర్హాజరయ్యారు. దీంతో అతనిపై చర్యలకు ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు. దీని నుంచి తప్పించుకునేందుకు CM, మంత్రి పేర్లతో సిఫారసు లేఖ తయారుచేసి సతీశ్ దొరికిపోయారు.

AP: రాష్ట్రంలోని KGBVల్లో ఇంటర్ ఫస్ట్, సెకండియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 21 వరకు పొడిగించారు. SC, ST, BC, మైనారిటీ, డ్రాపౌట్స్, అనాథలు మాత్రమే అప్లై చేసుకోవాలని సమగ్ర శిక్ష సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు.
వెబ్‌సైట్: <

TG: వనజీవి <<16071045>>రామయ్య<<>> అసలు పేరు దరిపల్లి రామయ్య. వృక్షో రక్షతి రక్షితః అంటూ మొక్కల పెంపకాన్ని ప్రచారం చేశారు. తన కుటుంబ సభ్యులకు చెట్ల పేర్లను పెట్టడం ప్రకృతి పట్ల ఆయన ప్రేమకు నిదర్శనం. గత ప్రభుత్వం హరితహారంలో ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇంటికి ఎవరు వచ్చినా ఒక మొక్కను గిఫ్ట్‌గా ఇచ్చేవారు. ఆయన కృషిని గౌరవిస్తూ ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశాల్లో రామయ్య జీవితాన్ని చేర్చింది.

ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్‌పై మళ్లీ దాడి జరిగింది. కాన్‌బెరాలోని రాయబార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు గ్రాఫిటీతో జాతి విద్వేష నినాదాలను పెయింట్‌తో రాశారు. గతంలోనూ ఎంబసీపై ఈ దాడులు జరగడం గమనార్హం. అధికారులకు ఫిర్యాదు చేశామని భారత హైకమిషన్ తెలిపింది. దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని వెల్లడించింది.

TG: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటుతో మరణించారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు గాంచిన ఆయనను 2017లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి.

విభజన సమస్యల్ని పరిష్కరించుకునేందుకు గాను తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలోనే సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. AP CM చంద్రబాబు దీనికి సంబంధించి మొదటి అడుగు వేసే ఆలోచనలో ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. చంద్రబాబు, రేవంత్ గత ఏడాది జులైలో ప్రజాభవన్‌లో తొలిసారి సమావేశమైనా చాలా సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. వాటన్నింటిపై ఇప్పుడు చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

TG: ఈ నెల 15 నుంచి 30 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1,000 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించింది. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అదే నెల 15-30 మధ్య రోజుకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలు జులై 22న వెల్లడిస్తారు.

ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాను US నుంచి తీసుకొచ్చేందుకు NIA గల్ఫ్ స్ట్రీమ్ G550 జెట్‌ను ఉపయోగించింది. ఆగకుండా 12,500KM ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. ఇందులో 19 మంది ప్రయాణించవచ్చు. ఈ జెట్ విలువ దాదాపు రూ.500-600కోట్లు కాగా భారత్ రూ.4 కోట్లు రెంట్ చెల్లించినట్లు తెలుస్తోంది. విశాలమైన క్యాబిన్లు, పటిష్ఠ భద్రత కలిగిన ఈ విమానాన్ని ప్రభుత్వాధినేతలు, బిలియనీర్లు ఎక్కువగా వినియోగిస్తారు.

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కూడా సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. ఉదయం ఉ.11 గం. నుంచి సా.5.30 వరకు సేవలు అందించనున్నాయి. ఈ మేరకు ఇవాళ రెండో శనివారం అధికారులకు సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెంపు కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

దూకుడుగా ఆడితేనే SRH ఆటగాళ్ల అత్యుత్తమ ఆట బయటికొస్తుందని ఆ జట్టు కోచ్ వెటోరీ తెలిపారు. ‘మా బ్యాటర్లకు ఎలాంటి బంతులేయాలన్నదానిపై ఇతర జట్లు పూర్తి ప్లాన్‌తో వస్తున్నాయి. ఇద్దరు బ్యాటర్లు చెలరేగినా SRHను ఆపడం ఇక కష్టం. ఎవరో ఇద్దరు ఎదురు దాడి మొదలుపెడితే మిగిలినవారికీ ఆ దూకుడు స్ఫూర్తిగా నిలుస్తుంది. మా ప్లేయర్స్ కమ్ బ్యాక్ ఇస్తారన్న నమ్మకం నాకుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.