News April 12, 2025

ఆస్ట్రేలియాలో భారత కాన్సులేట్‌పై మళ్లీ దాడి

image

ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్‌పై మళ్లీ దాడి జరిగింది. కాన్‌బెరాలోని రాయబార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు గ్రాఫిటీతో జాతి విద్వేష నినాదాలను పెయింట్‌తో రాశారు. గతంలోనూ ఎంబసీపై ఈ దాడులు జరగడం గమనార్హం. అధికారులకు ఫిర్యాదు చేశామని భారత హైకమిషన్ తెలిపింది. దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని వెల్లడించింది.

Similar News

News March 16, 2026

శుక్రుడు మరీ ఇంత స్లోనా?

image

సౌర కుటుంబంలో అత్యంత వింతైన గ్రహం శుక్రుడు. సాధారణంగా గ్రహాలకు తమ చుట్టూ తాము తిరగడానికి పట్టే సమయం(రోజు) కంటే, సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం (సంవత్సరం) ఎక్కువ. కానీ శుక్ర గ్రహం తన చుట్టూ తాను నెమ్మదిగా తిరుగుతుంది. అందుకే అక్కడ ఒక రోజు(243d) గడవకముందే ఒక సంవత్సరం(225d) పూర్తవుతుంది. ఈ కాలగమనం ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 16, 2026

ఎప్‌స్టీన్‌‌ ఫైల్స్ ప్రచారం.. పరువు నష్టం దావా వేసిన కేంద్ర మంత్రి కూతురు

image

కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ కూతురు హిమాయని ఢిల్లీ హైకోర్టులో ₹10Crకు పరువు నష్టం దావా వేశారు. US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌తో తనకు సంబంధం ఉన్నట్లు కొందరు SMలో తప్పుడు ప్రచారం చేశారని ఆమె పేర్కొన్నారు. ఆ కంటెంట్‌ను తొలగించాలని కోరారు. కాగా ఎప్‌స్టీన్‌తో హర్దీప్‌ పూరీకి సంబంధాలున్నట్లు 2014-15 మధ్య విమర్శలు రాగా ఆయన ఖండించారు.

News March 16, 2026

LPG బదులు పైప్డ్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్‌లు: CBN

image

AP: గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు పోకుండా చూడాలని CBN కంపెనీల అధికారులను ఆదేశించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, గుడులకు గ్యాస్ సరఫరా ఆగకుండా చూడాలన్నారు. ప్రజల్లో ఆందోళన లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. LPG బదులు పైప్డ్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్స్ వినియోగించేలా చేయాలన్నారు. LPG వాడకం తగ్గించేలా హోటళ్లతో చర్చించాలని సూచించారు. రాష్ట్రంలో 17,209MT స్టాక్ ఉందని CMకు అధికారులు తెలిపారు.