news

News April 11, 2025

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ నగదు బహుమతి

image

మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్‌కు హరియాణా BJP ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. బరువు ఎక్కువున్న కారణంతో వినేశ్ ఒలింపిక్స్ ఫైనల్లో డిస్ క్వాలిఫై అవ్వగా ఆమెకు పతక విజేతలకు ఇచ్చే గౌరవాన్నే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇల్లు/ఉద్యోగం/నగదులో ఏది కావాలో ఎంచుకోవాలని సూచించగా ఆమె నగదుకే మొగ్గు చూపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వినేశ్‌కు రూ.4 కోట్ల నగదు ఇవ్వనుంది.

News April 11, 2025

PHOTO GALLERY: కులవృత్తుల వారికి పనిముట్లు అందించిన సీఎం

image

AP: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి(మ) వడ్లమానులో వివిధ కులవృత్తుల వారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వారికి పనిముట్లు, ప్రోత్సాహకాలు అందించారు. కాసేపు సెలూన్ షాపులో కూర్చుని ముచ్చటించారు. పశువులకు మేత తినిపించారు. టీడీపీకి మొదటినుంచీ బీసీలే వెన్నెముక అని అన్నారు.

News April 11, 2025

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

image

వారాంతంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. టారిఫ్స్‌ను 90 రోజులు నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 1,310 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 429 పాయింట్లు వృద్ధి సాధించింది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, NTPC, M&M, రిలయన్స్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సెర్వ్, భారతీ ఎయిర్‌టెల్, HDFC బ్యాంక్ షేర్లు భారీ లాభాలు సాధించాయి.

News April 11, 2025

వెయ్యి రోజులుగా ఆగని పీరియడ్స్.. మహిళ ఆవేదన

image

తనకు వెయ్యి రోజులుగా రుతుస్రావం అవుతున్నట్లు అమెరికాకు చెందిన టిక్‌టాకర్ పాపి వెల్లడించారు. 950 రోజుల తీవ్ర ఆవేదన తర్వాత ఆమె ఈ విషయాన్ని తన యూజర్లతో పంచుకున్నారు. మహిళలకు సాధారణంగా నెలలో 3-7 రోజుల పాటు పీరియడ్ బ్లీడింగ్ జరుగుతుంటుంది. మొదట్లోనే టెస్టులు చేయించానని, వైద్యులు సైతం అయోమయంలో పడినట్లు ఆమె తెలిపారు. చివరికి తనకు బైకార్న్యుయేట్ యుట్రస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

News April 11, 2025

నెగటివ్ ప్రచారంపై ఘాటుగా స్పందించిన హీరోయిన్

image

సోషల్ మీడియాలో నెగటివిటీని ప్రచారం చేసే వారికి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందని హీరోయిన్ త్రిష ఇన్‌స్టాలో ప్రశ్నించారు. ఖాళీగా కూర్చొని ఇతరులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేయడమే పనా అని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారితో కలిసి జీవించేవారి గురించి ఆలోచిస్తే బాధగా అనిపిస్తుందన్నారు. నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి తమిళంలో డబ్బింగ్ చెప్పకపోవడంతో SMలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

News April 11, 2025

పెండింగ్ కేసుల పరిష్కారానికి త్వరలో ఈవెనింగ్ కోర్టులు!

image

జిల్లా కోర్టుల్లోని పెండింగ్ కేసుల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 785 ఈవెనింగ్ కోర్టులు ఏర్పాటు చేయాలని న్యాయ శాఖ యోచిస్తోంది. ప్రస్తుత కోర్టు ప్రాంగణాల్లోనే సాధారణ పనివేళల అనంతరం 5pm-9pm మధ్య ఇవి పనిచేస్తాయని సమాచారం. గత 3 ఏళ్లలో రిటైరైన జడ్జీలను కాంట్రాక్టు పద్ధతిలో వీటిలో నియమిస్తారని తెలుస్తోంది. మైనర్ క్రిమినల్ కేసులు, 3 ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించదగిన కేసులను ఈ కోర్టుల్లో విచారించనున్నారు.

News April 11, 2025

తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నైనార్ నాగేంద్రన్?

image

తమిళనాడు బీజేపీ కొత్త చీఫ్‌గా ఆ పార్టీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్‌ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అన్నామలై కూడా నాగేంద్రన్‌ పేరును ప్రతిపాదించగా, ఇతర నేతలు మద్దతు తెలిపినట్లు సమాచారం.

News April 11, 2025

త్వరలో బీసీ సంరక్షణ చట్టం: చంద్రబాబు

image

AP: టీడీపీ వచ్చాకే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఉద్యోగాల్లో 33%, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. మరోవైపు అమరావతిలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

News April 11, 2025

GOOD NEWS: ‘అగ్నివీర్’ దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. జూన్‌లో కామన్ ఎంట్రన్స్ టెస్టు తెలుగు సహా 13 భాషల్లో ఉండనుంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్ అసిస్టెంట్, క్లర్క్/స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎనిమిది, టెన్త్ పాసైన 17-21 ఏళ్ల యువకులు అర్హులు.
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

News April 11, 2025

బిహార్‌లో వర్ష బీభత్సం.. 80 మంది మృతి

image

అకాల వర్షాల కారణంగా బిహార్‌లో 80 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ తెలిపారు. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలు, పిడుగుల వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. పంటలకు అపార నష్టం కలిగిందన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.4లక్షల చొప్పున పరిహారం అందించామన్నారు.