News April 11, 2025
తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నైనార్ నాగేంద్రన్?

తమిళనాడు బీజేపీ కొత్త చీఫ్‌గా ఆ పార్టీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అన్నామలై కూడా నాగేంద్రన్ పేరును ప్రతిపాదించగా, ఇతర నేతలు మద్దతు తెలిపినట్లు సమాచారం.
Similar News
News April 20, 2025
GTకి గుడ్ న్యూస్.. త్వరలో స్టార్ ప్లేయర్ రీఎంట్రీ?

తొలి 2 మ్యాచ్‌ల తర్వాత వ్యక్తిగత కారణాలతో స్వదేశం వెళ్లిపోయిన GT స్టార్ బౌలర్ కగిసో రబాడా త్వరలో తిరిగిరానున్నట్లు సమాచారం. మరో 10 రోజుల్లో అతను జట్టుతో చేరే అవకాశం ఉందని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించారు. ప్రస్తుతం 5 విజయాలతో గుజరాత్ టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. రబాడా కూడా వస్తే బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది.
News April 20, 2025
రూ.3,900 కోట్ల భూమిని కాపాడిన బాలుడి లెటర్!

TG: హైడ్రాకు ఓ బాలుడు రాసిన లేఖ రూ.3,900 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. లంగర్‌హౌజ్‌కు చెందిన బాలుడు జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ సెంటర్ దగ్గర్లోని ఖాళీ స్థలంలో కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల నార్నె ఎస్టేట్స్ అనే సంస్థ అక్కడ కంచె ఏర్పాటు చేసి తవ్వకాలు చేపట్టడంతో అతడు హైడ్రాకు లేఖ రాశాడు. అది ప్రభుత్వ భూమి అని గుర్తించిన హైడ్రా, అక్కడి 39 ఎకరాల భూమిని తాజాగా స్వాధీనం చేసుకుంది.
News April 20, 2025
వక్ఫ్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర: ఒవైసీ

వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తగ్గేదే లేదని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ దారుసలాంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్రం నిర్ణయంతో ముస్లింల సమాధులకూ స్థలాలు ఉండబోవని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 నుంచి నిరసనలు చేపడతామన్నారు.