news

News April 11, 2025

OTTలోకి వచ్చేసిన 4 సూపర్ హిట్ చిత్రాలు

image

ఇవాళ 4 సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. తమిళంలో మంచి విజయం సాధించిన ‘పెరుసు’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు IMDbలో 8.1/10 రేటింగ్ ఉంది. హిందీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఛావా’, తెలుగులో సూపర్ హిట్టయిన ‘కోర్ట్’ చిత్రాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యాయి. అలాగే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ప్రావింకూడు షప్పు’ సోనీ లివ్‌లో విడుదలైంది.

News April 11, 2025

BIG NEWS.. ఇంటర్ ఫలితాలపై కాసేపట్లో ప్రభుత్వ ప్రకటన?

image

AP: ఇంటర్ ఫలితాల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఫలితాల విడుదల చేసే తేదీని అధికారులు అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తికాగా, 2-3 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఫలితాలను bieap.gov.in, Way2Newsలో సులభంగా తెలుసుకోవచ్చు.

News April 11, 2025

ఏడాదిలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు.. శిరీషకు సీఎం అభినందన

image

TG: అనారోగ్యంతో బాధపడుతూనే ఏడాదిలో 5 GOVT ఉద్యోగాలు సాధించిన ఖమ్మం(D)కు చెందిన జ్యోతి శిరీషను CM రేవంత్ అభినందించారు. ‘రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి, రక్తహీనతను లెక్కచేయకుండా జీవితంలో విజయం సాధించాలన్న శిరీష పట్టుదల ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆమెను ప్రోత్సహించిన పేరెంట్స్‌కు అభినందనలు. శిరీష భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

News April 11, 2025

‘RRR’ పోస్టర్‌తో ‘ఆస్కార్’ ట్వీట్.. ఎందుకంటే?

image

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఇక నుంచి స్టంట్ డిజైన్‌ కేటగిరీని చేర్చుతున్నట్లు ‘ది అకాడమీ’ ట్వీట్ చేసింది. 2027లో రిలీజయ్యే చిత్రాల్లో ఎంపికైన వాటికి 2028లో అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనికి ‘RRR’ సినిమా పోస్టర్‌ను జోడించింది. దీనిపై RRR మేకర్స్ స్పందిస్తూ ‘ఇది మనమందరం గర్వించదగ్గ క్షణం. RRR మూవీ, అందులోని యాక్షన్‌ను ప్రపంచం ఇంకా సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంది’ అని Xలో రాసుకొచ్చారు.

News April 11, 2025

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్‌లో ఉండటం, టారిఫ్‌లను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటనతో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 1161 పాయింట్ల లాభంతో 75,043 వద్ద, నిఫ్టీ 387 పాయింట్ల లాభంతో 22,786 వద్ద కొనసాగుతున్నాయి. సిప్లా, లూపిన్, అరబిందో షేర్లు లాభాల్లో, TCS, అపోలో హాస్పిటల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

News April 11, 2025

అనారోగ్యంతో అప్పులపాలు.. ఆదుకుంటామని లోకేశ్ హామీ

image

AP: ఏలూరుకు చెందిన దుర్గాప్రసాద్ అనే చిరుద్యోగి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. నరాలు, గుండెకు సంబంధించిన సమస్యలు రావడంతో రూ.7లక్షలకు పైగా ఆస్పత్రి ఖర్చులు అయ్యాయి. కుటుంబాన్ని పోషించడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. అతడి పరిస్థితి తెలిసి, ప్రసాద్‌ను ఆదుకోవాలని టీడీపీ నేతలు మంత్రి లోకేశ్‌ను కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని తన టీమ్‌ను మంత్రి ఆదేశించారు.

News April 11, 2025

కియాలో 900 ఇంజిన్ల చోరీ.. ఇంటి దొంగల పనే!

image

AP: శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని కియా పరిశ్రమలో <<16027604>>900 ఇంజిన్ల చోరీపై<<>> విచారణ కొనసాగుతోంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తీసుకొచ్చే క్రమంలోనే దొంగతనం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ‘ఇందులో బయటివాళ్ల ప్రమేయం లేదు. కంపెనీ సిబ్బంది లేదా మాజీ ఉద్యోగుల హస్తం ఉంది. ఈ కేసులో ఎవరు ఉన్నారో దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు.

News April 11, 2025

అత్యధిక బిలియనీర్లు కలిగిన నగరాలివే!

image

ఈ ఏడాది అత్యధిక బిలియనీర్లు కలిగిన నగరాల్లో న్యూయార్క్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ 123 మంది బిలియనీర్లు ఉండగా వీరి మొత్తం విలువ $759 బిలియన్లుగా ఉంది. ఆ తర్వాత 90 మంది బిలియనీర్లు & $409 బిలియన్లతో మాస్కో రెండో స్థానంలో ఉంది. ముంబై రెండు స్థానాలు దిగజారి 6వ స్థానానికి చేరుకుంది. కాగా, ఇక్కడి 67 మంది బిలియనీర్ల నికర విలువ $349 బిలియన్లు. 3,4,5 స్థానాల్లో హాంకాంగ్, లండన్‌, బీజింగ్‌లు ఉన్నాయి.

News April 11, 2025

పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం

image

TGలో ప్రస్తుతం ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్లు అందజేస్తుండగా ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకోసం సెర్ప్ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. మే/జూన్ నుంచి దీనిని ప్రారంభించనుంది. వృద్ధులకు వేలిముద్రలు పడక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ కేటగిరీల్లో రాష్ట్రంలో 42.96L మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు ₹4,016, ఇతరులకు ₹2,016 అందుతోంది.

News April 11, 2025

మార్కెట్లో కనిపించని మామిడి సందడి

image

TG: ఏప్రిల్ రెండో వారం పూర్తవుతున్నా మర్కెట్‌లో అంతగా మామిడి పండ్లు కనిపించడం లేదు. సహజంగా మార్చి నుంచే మామిడిపండ్లతో నిండే మార్కెట్లలో ఇప్పుడు అంతగా సరఫరా లేదు. గత సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు పూత అంతగా రాలేదు. దీంతో జనవరి, ఫిబ్రవరిలో పూత రాగా, ఆ ప్రభావం సరఫరాపై పడింది. మార్కెట్లో అక్కడక్కడా మామిడి కనిపిస్తున్నా ధరలు మాత్రం మండిపోతున్నాయి. కిలో రూ.150-250 మధ్య పలుకుతున్నాయి.