News April 11, 2025
అనారోగ్యంతో అప్పులపాలు.. ఆదుకుంటామని లోకేశ్ హామీ

AP: ఏలూరుకు చెందిన దుర్గాప్రసాద్ అనే చిరుద్యోగి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. నరాలు, గుండెకు సంబంధించిన సమస్యలు రావడంతో రూ.7లక్షలకు పైగా ఆస్పత్రి ఖర్చులు అయ్యాయి. కుటుంబాన్ని పోషించడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. అతడి పరిస్థితి తెలిసి, ప్రసాద్‌ను ఆదుకోవాలని టీడీపీ నేతలు మంత్రి లోకేశ్‌ను కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని తన టీమ్‌ను మంత్రి ఆదేశించారు.
Similar News
News February 12, 2026
T20 WC: భారత్ భారీ స్కోర్

నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 209/9 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (61), హార్దిక్ (52) రాణించారు. దూబే 23, శాంసన్ 22, తిలక్ 25, సూర్య 12 పరుగులు చేశారు. 19వ ఓవర్లో భారత్ 3 వికెట్లు(పాండ్య, దూబే, అక్షర్) కోల్పోవడంతో స్కోర్ కాస్త తగ్గింది.
News February 12, 2026
‘ఆయుష్’లో త్వరలో 358 పోస్టుల భర్తీ: మంత్రి సత్యకుమార్

AP: ఆయుష్ శాఖలో వివిధ కేటగిరీల్లో నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా 358 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘వీటిలో డాక్టర్, సైకియాట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్, పంచకర్మ థెరపిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్, మల్టీపర్పస్ వర్కర్, స్వీపర్ వంటి పోస్టులు ఉన్నాయి. అలాగే 1 ఆయుర్వేద, 3 హోమియో కాలేజీల్లోని 140 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తాం’ అని వివరించారు.
News February 12, 2026
‘వందేమాతరం’ ఆలాపన ఉత్తర్వులపై ముస్లిం బోర్డు అభ్యంతరం

అన్ని స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ గేయంలోని 6 చరణాలను ఆలపించాలని కేంద్రం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ పాటలో దుర్గా, ఇతర దేవతల ఆరాధనకు సంబంధించిన పదాలున్నాయి. అల్లాను మాత్రమే ఆరాధించే ముస్లింల నమ్మకాలకు ఇది విరుద్ధం’ అని పేర్కొంది.


