India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వక్ఫ్ సవరణ బిల్లును సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను సుప్రీం కోర్టు ఈ నెల 16న విచారించనుంది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్, డీఎంకే పార్టీ నేత రాజా, ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణను 13వ అంశంగా కోర్టు లిస్ట్ చేసింది. మరోవైపు తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఆదేశాలు జారీ చేయొద్దని కోరుతూ కేంద్రం సుప్రీంలో కేవియట్ పిటిషన్ వేసింది.

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఇది కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ మాత్రమేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పార్టీ నాయకత్వం శ్రేణులకు తెలిపింది. ఈ నెల 27న వరంగల్‌లో వజ్రోత్సవ సభకు ఆయన సిద్ధంగా ఉన్నారని వివరించింది.

చెన్నైలో చేపలు పడుతున్న ఓ వ్యక్తి, చేప వల్లే చనిపోయాడు. మణికందన్ అనే వ్యక్తి కీలావలంలోని చేపల చెరువులో రెండు చేపల్ని పట్టుకున్నారు. ఒకదాన్ని చేతితో, మరోదాన్ని నోటితో పట్టుకుని ఒడ్డుకు ఈదుకుంటూ వస్తుండగా నోటితో పట్టుకున్న చేప ఆయన గొంతులోకి వెళ్లిపోయింది. అక్కడే అది ఇరుక్కుపోవడంతో మణికందన్ విలవిల్లాడారు. స్థానికులు సాయం చేసేలోపే ప్రాణాలు విడిచారు.

అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో వేరే దేశాలకు తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఆస్ట్రేలియాను తమకు కలిసిరావాలని కోరగా బీజింగ్‌కు చుక్కెదురైంది. అమెరికా సుంకాలపై ఉమ్మడిగా పోరాడదామంటూ చైనా ఇచ్చిన పిలుపును ఆస్ట్రేలియా తిరస్కరించింది. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, చైనా చేతిని పట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఇతర దేశాలతో వాణిజ్యం చేస్తామని పేర్కొంది.

TG: అకాల వర్షాల కారణంగా 14,956 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి తెలిపింది. వాటిలో వరి, మొక్కజొన్న, మామిడి సహా పలు రకాల పంటలున్నాయని పేర్కొంది. ఒక్క గత నెలలో వానలకే 8408 ఎకరాల పంట నేలవాలిందని పేర్కొంది. ఈ నెల 3 నుంచి 9 వరకు 7 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వానలు చేకూర్చిన నష్టంపై రూపొందించిన నివేదికను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.

TG: రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఈ మూడు రోజులూ వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

26/11 ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవూర్ రాణా తమ పౌరుడు కాదంటూ పాక్ పేర్కొంది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గడచిన రెండు దశాబ్దాల్లో రాణా తన పాక్ పత్రాలను పునరుద్ధరించుకోలేదు. అతడు కెనడా జాతీయుడనేది సుస్పష్టం’ అని పేర్కొంది. మరోవైపు.. ముంబై ఉగ్రదాడుల్లో పాక్ నిఘా సంస్థ ISI పాత్ర ఉందన్న విషయం రాణాపై విచారణ అనంతరం బయటికొస్తుందని NIA వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

రామ్ చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. లాస్ట్ షాట్‌లో చెర్రీ సిక్స్ కొట్టిన స్టైల్ అదుర్స్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే, మూవీలో క్రికెట్‌తో పాటు రెజ్లింగ్ సీన్స్ ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇస్తాయని టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని మేనరిజమ్స్, నటనతో చెర్రీ కట్టిపడేస్తారని అంటున్నారు. ఇప్పటికే 30శాతం షూటింగ్ పూర్తయిందని, కీలక ఫైట్స్ షూట్ చేశారని సమాచారం.

నిన్న రాత్రి DCతో మ్యాచ్‌లో RCBకి సాల్ట్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. డీసీ బౌలర్ స్టార్క్ వేసిన ఒక ఓవర్లోనే 30 రన్స్ వచ్చాయి. బెంగళూరు కచ్చితంగా 220 ప్లస్ స్కోర్ చేస్తుందని ఫ్యాన్స్ భావించగా 167 పరుగులకే పరిమితమైంది. దీంతో విరాట్ సాల్ట్‌ను రనౌట్ చేసి మంచి ఊపును దెబ్బతీశారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు విరాట్ తప్పులేదంటూ కొంతమంది కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు.

ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి, నరహంతకుడు తహవూర్ రాణాను NIA ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని విచారించేందుకు రిమాండ్‌కు అప్పగించాలన్న సంస్థ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. రాణాకు 18రోజుల రిమాండ్‌ను విధిస్తున్నట్లు తెలిపింది.
Sorry, no posts matched your criteria.