news

News April 8, 2025

పేద బిడ్డల విద్యపై నిర్లక్ష్యం క్షమించరానిది: సీఎం రేవంత్

image

TG: గత 15ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ జరపకపోవడం తనను విస్మయానికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించారని నేరం అని Xలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంతకాలంగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తూ రాష్ట్రం పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

News April 8, 2025

జైపూర్ బాంబు పేలుళ్ల నిందితులకు కోర్టు శిక్ష

image

జైపూర్‌ (రాజస్థాన్) బాంబు పేలుళ్ల నిందితులకు అక్కడి ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటనలో నిందితులైన షహబాజ్ హుస్సేన్, సర్వర్ అజ్మీ, మహ్మద్ సైఫ్, సైఫుర్ రెహ్మాన్‌లకు జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. 2008 మే13న జైపూర్‌లో 15నిమిషాల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఈ ఘటనలో 71 మంది మృతి చెందగా, 180 మందికి పైగా గాయపడ్డారు.

News April 8, 2025

పవన్ తనయుడి ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పవన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింగపూర్‌లోని స్కూలులో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ తనయుడికి గాయాలైన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆయన తన కుమారుడి వద్దకు బయల్దేరారు.

News April 8, 2025

ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

image

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తున్న 250కు పైగా సేవలపై అవగాహన కల్పించనున్నారు. వారి ఫోన్లలో మన మిత్ర నంబర్(9552300009)ను సేవ్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది.

News April 8, 2025

చరిత్ర సృష్టించిన రజత్ పాటీదార్

image

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ సరికొత్త ఘనత సాధించారు. IPL సింగిల్ ఎడిషన్‌లో MIని వాంఖడే, KKRను ఈడెన్‌లో, CSKను చెపాక్‌లో ఓడించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. గతంలో పంజాబ్ ఈ ఫీట్ సాధించినా ఇద్దరు నాయకుల సారథ్యంలో నమోదైంది. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (KKR), డేవిడ్ హస్సీ (CSK, MI) కలిసి ఈ రికార్డు నెలకొల్పారు. కోహ్లీకి కూడా సాధ్యం కాని రికార్డును పాటీదార్ సాధించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News April 8, 2025

PM మోదీ రిటైర్మెంట్‌పై మహారాష్ట్ర CM ఆసక్తికర వ్యాఖ్యలు

image

PM మోదీ రిటైర్మెంట్‌పై పలు ఊహాగానాల నేపథ్యంలో మహారాష్ట్ర CM ఫడ్నవీస్ స్పందించారు. 2029 తర్వాత కూడా మోదీ దేశాన్ని నడిపిస్తారని అన్నారు. ‘మోదీ వారసుడి గురించి చర్చించేందుకు ఇది సరైన సమయం కాదు. 2029లో ఆయన మళ్లీ PM అవుతారు’ అని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో మోదీ రిటైరవుతారని ఇటీవల శివసేన UBT నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిిందే. కాగా SEPలో మోదీ 75వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు.

News April 8, 2025

విద్యార్థులకు ట్రంప్ ఝలక్.. చిన్న తప్పు చేసినా వీసా రద్దు?

image

ట్రంప్ నిర్ణయాలు విదేశీ విద్యార్థుల పట్ల శాపంగా మారుతున్నాయి. చిన్న పాటి ట్రాఫిక్ ఉల్లంఘనలకూ వీసాలు రద్దు చేస్తున్నారని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గాజాపై ఇజ్రాయిల్ దాడిలో హమాస్‌కు మద్దతుగా పోస్టులు పెట్టిన విద్యార్థుల వివరాలు అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీల అధికారులు సైతం ఆకస్మిక వీసాల రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

News April 8, 2025

పీఎం మోదీతో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భేటీ

image

పీఎం నరేంద్ర మోదీతో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భేటీ అయ్యారు. వీరిద్దరూ ఢిల్లీలో అత్యున్నత సమావేశం నిర్వహించారు. వీరితోపాటు విదేశాంగమంత్రి జైశంకర్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సహకారంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా క్రౌన్ ప్రిన్స్ ఇవాళ, రేపు భారత్‌లో పర్యటిస్తారు.

News April 8, 2025

2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి: మంత్రి రామ్మోహన్

image

AP: భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పనులు 71% పూర్తయ్యాయని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఈ ఎయిర్‌పోర్ట్ ఒక్కటే అధునాతనమైందని, దీంతో దేశ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని, 2026 నాటికి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మంత్రి ఇవాళ విమానాశ్రయ పనులను పరిశీలించారు.

News April 8, 2025

పవన్ కుమారుడికి గాయాలు.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

image

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు కావడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. కాగా మన్యం పర్యటన ముగించుకున్న పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి సింగపూర్ బయల్దేరనున్నారు. చిరంజీవి, సురేఖ దంపతులు సైతం సింగపూర్ బయల్దేరారు.