News April 8, 2025
జైపూర్ బాంబు పేలుళ్ల నిందితులకు కోర్టు శిక్ష

జైపూర్ (రాజస్థాన్) బాంబు పేలుళ్ల నిందితులకు అక్కడి ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటనలో నిందితులైన షహబాజ్ హుస్సేన్, సర్వర్ అజ్మీ, మహ్మద్ సైఫ్, సైఫుర్ రెహ్మాన్‌లకు జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. 2008 మే13న జైపూర్‌లో 15నిమిషాల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఈ ఘటనలో 71 మంది మృతి చెందగా, 180 మందికి పైగా గాయపడ్డారు.
Similar News
News April 25, 2025
హిండెన్‌బర్గ్‌తో కలిసి పనిచేసిన రాహుల్ గాంధీ?

అదానీ గ్రూప్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిండెన్‌బర్గ్ సంస్థతో కలిసి పనిచేశారని స్పుత్నిక్ ఇండియా నివేదిక తెలిపింది. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కనిపెట్టిందని పేర్కొంది. ‘2023, మేలో హిండెన్‌బర్గ్‌కు సంబంధించిన వారితో కాలిఫోర్నియాలో రాహుల్ భేటీ అయ్యారు. రాహుల్‌కు సన్నిహితుడైన శామ్ పిట్రోడా ఈ-మెయిల్స్‌ను హ్యాక్ చేయడం ద్వారా మొసాద్ ఈ సంగతి గుర్తించింది’ అని తెలిపింది.
News April 25, 2025
మేధా పాట్కర్ అరెస్ట్

సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌ను పరువునష్టం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2000లో ‘నర్మదా బచావో’ ఆందోళనకు వ్యతిరేకంగా ప్రస్తుత LG VK సక్సేనా ప్రకటనలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆయనపై పాట్కర్ కేసు వేశారు. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆమెపై సక్సేనా సైతం పరువు నష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల ఆమెకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
News April 25, 2025
ఉగ్రదాడి: భారతీయులకు క్షమాపణలు చెప్పిన నటి

పహల్గామ్ ఉగ్రదాడిపై నటి హీనా ఖాన్ విచారం వ్యక్తం చేశారు. ఓ ముస్లింగా భారతీయులందరికీ క్షమాపణలు తెలియజేశారు. మతం చూసి దాడికి పాల్పడటం హీనమైన చర్య అని ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ నోట్ రాసుకొచ్చారు. ఈ ఘటన తనపై మానసికంగా ప్రభావం చూపించిందని తెలిపారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా కలిసికట్టుగా పోరాడుదామని పేర్కొన్నారు. భారతీయురాలిగా దేశం తరఫున నిలబడతానని చెప్పారు.