news

News April 7, 2025

45 ఏళ్ల వయసులో గెలుపు.. చరిత్ర సృష్టించిన బోపన్న

image

భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించారు. ‘ATP మాస్టర్స్ 1000’ ఈవెంట్‌లో డబుల్స్ మ్యాచ్ గెలిచిన ఓల్డెస్ట్ ప్లేయర్(45 ఏళ్ల ఒక నెల)గా నిలిచారు. బోపన్న-షెల్టన్ జోడీ ఫ్రాన్సిస్కో- టబీలోపై 6-3, 7-5 తేడాతో విజయం సాధించింది. కాగా 2017లో కెనడాకు చెందిన డేనియల్ 44 ఏళ్ల 8 నెలల వయసులో ఫాబ్రిక్ మార్టిన్‌తో కలిసి మ్యాచ్ గెలిచారు. అది కూడా బోపన్న-పాబ్లో జోడీపై కావడం విశేషం.

News April 7, 2025

కంచ భూములపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

image

TG: కంచ గచ్చిబౌలి భూముల అంశంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. AI సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి దుష్ప్రచారం చేశారని పేర్కొంది. బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపింది. వీటిని సృష్టించిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరింది. న్యాయస్థానం ఈ నెల 24న విచారిస్తామంది.

News April 7, 2025

ట్రంప్ టారిఫ్స్.. 10 శాతం కుంగిన టాటా షేర్లు

image

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్‌తో టాటా మోటార్స్ షేర్లు ఈ రోజు భారీగా నష్టపోయాయి. టారిఫ్‌ల నేపథ్యంలో జాగ్వార్ లాండ్ రోవర్ ఎగుమతులు నిలిపేయాలన్న సంస్థ నిర్ణయంతో 10 శాతం మేర కుంగాయి. కార్ల ఎగుమతిపై అమెరికా విధించే 26శాతం సుంకాలు ఈ నెల 2నుంచే అమలుకాగా, విడిభాగాలపై పన్నులు మే3 నుంచి వర్తిస్తాయి. అయితే భారత్ నుంచి అమెరికాకు కార్ల ఎగుమతి విలువ 8.9 మిలియన్ డాలర్లు కాగా, మెుత్తం ఎగుమతుల్లో ఇది 0.13 శాతమే.

News April 7, 2025

సంక్షోభంలో ’ఆక్వా’.. నిద్రపోతున్న సర్కార్: జగన్

image

AP: రాష్ట్రంలో ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోతే ప్రభుత్వం నిద్రపోతోందా అని మాజీ CM జగన్ ప్రశ్నించారు. టారిఫ్‌ల పేరు చెప్పి సర్కార్ మిన్నకుండిపోయిందని ఎక్స్‌లో విమర్శించారు. ‘100 కౌంట్ రొయ్యల ధర రూ.280 నుంచి రూ.200కు పడిపోయింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ధరల పతనాన్ని అడ్డుకోవాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి చేతులు దులుపుకోవడం సరికాదు’ అని ఆయన మండిపడ్డారు.

News April 7, 2025

ఆ రోజు నుంచి బస్సులు బంద్: RTC JAC

image

TGSRTCలో సమ్మె సైరన్ మోగింది. మే 6 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు RTC JAC వెల్లడించింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇచ్చిన సమ్మె నోటీసులపై యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్ట్రైక్ చేపడతామని ప్రకటించింది. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని JAC నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా RTCలో కొత్త నియామకాలు, బకాయిలు, కారుణ్య నియామకాలు సహా పలు డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

News April 7, 2025

HCU విద్యార్థులపై కేసులు ఎత్తేయండి: భట్టి

image

TG: కంచ భూముల పరిరక్షణ కోసం నిరసనలు చేసిన HCU విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులు ఉపసంహరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణలో న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. న్యాయశాఖ అధికారులు ఇందుకు తగిన సూచనలు చేయాలని వెల్లడించారు.

News April 7, 2025

భద్రాద్రి రాముడి పట్టాభిషేకం(PHOTOS)

image

TG: భద్రాచలంలో శ్రీరాముడి మహాపట్టాభిషేకం ఇవాళ కన్నుల పండుగలా సాగింది. మిథిలా కళ్యాణమండపంలో నిన్న స్వామి కళ్యాణం జరిగిన ప్రాంతంలోనే పట్టాభిషేకం అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగింది. స్వామికి పట్టువస్త్రాలను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమర్పించారు. భాగంగా స్వామికి పాదుకలు, రాజదండం, రాజముద్రిక, ఖడ్గం, ఛత్రం, చామరలు, రామదాసు పచ్చల పతకాన్ని రఘునందనుడికి అలంకరించి కిరీటాన్ని ధరింపజేశారు.

News April 7, 2025

పుండు మీద కారం.. గ్యాస్, పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్

image

గ్యాస్ సిలిండర్‌పై ₹50, పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు ₹2 పెంపుపై కాంగ్రెస్ ఫైరయ్యింది. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం వేశారని మండిపడింది. పుండు మీద కారం చల్లినట్లుగా కేంద్రం తీరు ఉందంది. ‘ఇవాళ ముడిచమురు ధర నాలుగేళ్ల కనిష్ఠానికి చేరింది. అయినా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా కేంద్రం పెంచింది. పైగా ప్రజలపై భారం పడదని డప్పు కొడుతోంది’ అని ట్వీట్ చేసింది.

News April 7, 2025

ఇంగ్లండ్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్

image

ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌ నియమితులయ్యారు. జోస్ బట్లర్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఈసీబీ బ్రూక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కాగా దేశం కోసం ఆడేందుకు బ్రూక్ ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మెగా వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. కానీ అనూహ్యంగా ఆయన ఐపీఎల్ నుంచి వైదొలిగారు.

News April 7, 2025

సెక్స్ వర్కర్లపై కేసులు పెట్టవద్దు: MP పోలీసులు

image

మధ్యప్రదేశ్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెక్స్ వర్కర్ల‌పై ఎటువంటి వ్యభిచార కేసులు పెట్టరాదని, వారిని మానసికంగా హింసించరాదని ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ, హోటళ్లు, దాబాల యజమానులపై ITPయాక్ట్ కింద కేసు నమోదు చేయాలన్నారు. అమాయక మహిళల్ని పడుపు వృత్తిలోకి తీసుకొస్తున్న వారిని కఠినంగా శిక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.