news

News April 7, 2025

దీని సమాధానం మీకు తెలుసా..?

image

సుడోకు, పజిల్స్ లాంటి వాటిని సాల్వ్ చేస్తే మెదడుకు ఒత్తిడి తగ్గడంతో పాటు యాక్టివ్‌గా మారుతుంది. అందుకే చాలామంది ఖాళీ సమయాలలో వీటిని పరిష్కరిస్తూ ఒత్తిడిని దూరం చేసుకుంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటిని పరిష్కరించడం కామన్‌గా మారిపోయింది. యూజర్స్ సైతం ఈ ప్రశ్నలకు సమాధానాలిస్తూ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. పైన ఇచ్చిన ప్రాబ్లంకి మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి.

News April 7, 2025

MI vs RCB: కోహ్లీకి ఆ వెలితి తీరేనా?

image

IPLలో భాగంగా మరికాసేపట్లో ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా ముంబైతో జరిగిన మ్యాచుల్లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇంతవరకూ ఎప్పుడూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోలేదు. దాదాపు 30-40 మ్యాచులు ఆడినా ఒక్కసారి కూడా అతడిని POTM వరించలేదు. 92*, 82*, 82* వంటి భారీ స్కోర్లు చేసిన మ్యాచుల్లోనూ ఆయనకు ఈ అవార్డు రాలేదు. ఈసారైనా ఆ వెలితి తీర్చుకోవాలని ఛేజ్‌మాస్టర్ భావిస్తున్నారు.

News April 7, 2025

ఆయుష్మాన్ భార్యకు మళ్లీ క్యాన్సర్

image

తనకు బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ వెల్లడించారు. రెండోసారి క్యాన్సర్‌పై యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే వ్యాధి నుంచి విముక్తి పొందుతానని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ అయిన ఈమె ఏడేళ్ల కిందట క్యాన్సర్ చికిత్స చేయించుకున్నారు.

News April 7, 2025

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం: ఆర్.నారాయణమూర్తి

image

AP: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం భారీ కుట్రకు తెరతీసిందని ఆయన ఆరోపించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘డీలిమిటేషన్ ఉత్తరాది రాష్ట్రాలకు మేలు, దక్షిణాది రాష్ట్రాలకు చెడు చేసేలా ఉంది. దురుద్దేశంతోనే కేంద్రం పునర్విభజనకు పూనుకుంటోంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News April 7, 2025

రేపు రాప్తాడుకు మాజీ సీఎం జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించనున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.

News April 7, 2025

ఒలింపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్ విడాకులు?

image

ఒలింపిక్ మెడలిస్ట్, బాక్సింగ్ ఐకాన్ మేరీకోమ్ వ్యక్తిగత జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. భర్త కరంగ్ ఓంఖోలర్(ఓంలర్)తో ఆమె విడాకులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. మరో బాక్సర్ భర్తతో ఆమె ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం ఆయన తన బిజినెస్ పార్ట్‌నర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో కలసి దిగిన ఫొటోలు ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ పుకార్లేనని కొందరు కొట్టిపడేస్తున్నారు.

News April 7, 2025

భార్య వల్ల పదవి పోగొట్టుకున్న అధ్యక్షుడు

image

భార్య తీసుకున్న బహుమతి ఏకంగా అధ్యక్షుడి పదవికే ఎసరు తెచ్చింది. S.కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై పార్లమెంటు అభిశంసనను కోర్టు సమర్థించడంతో అక్కడ 2 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం ఒక పాస్టర్ నుంచి ఆమె ఓ లగ్జరీ బ్యాగ్ బహుమతిగా అందుకున్నారు. దీనిపై అక్కడి ప్రతిపక్షాలు యూన్ సుక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఆ తర్వాత అక్కడ మార్షల్ లా ప్రకటించారు.

News April 7, 2025

ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

image

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.

News April 7, 2025

కొందరు అధికారులే నిజమైన అంధులు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

image

TG: దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంధులను కోర్టు చుట్టూ తిప్పడంపై మండిపడ్డారు. కొందరు అధికారులే నిజమైన అంధులని ఫైరయ్యారు. తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారంటూ 2017లో పలువురు అంధులు కోర్టును ఆశ్రయించారు. ఎనిమిదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. కాగా వీరి సమస్యను త్వరగా పరిష్కరించాలని జడ్జి అధికారులను ఆదేశించారు.

News April 7, 2025

97 ఏళ్ల వయసులో తాబేలుకు పిల్లలు

image

US ఫిలడెల్ఫియాలో అబ్రాజో, మోమీ అనే తాబేళ్ల జంట 97 ఏళ్ల వయసులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇవి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయని, సరిపడా ఆహారం తీసుకుంటున్నాయని జూ నిర్వాహకులు తెలిపారు. వెస్ట్రన్ శాంటాక్రూజ్ గలాపగోస్ జాతికి చెందిన ఈ తాబేళ్లు అంతరించే పోయే దశలో ఉన్నాయి. దీంతో సంరక్షిస్తున్నారు. మోమీ జూలో ప్రవేశించి ఈ నెల 23కు 93 ఏళ్లవుతుంది. ఆ రోజున దాని పిల్లలను బహిరంగంగా ప్రదర్శించనున్నారు.