news

News April 7, 2025

అత్యంత అందమైన అమ్మాయిలు ఎక్కడున్నారంటే?

image

సౌత్ కొరియాకు చెందిన మహిళలు ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటారని ‘ఇన్‌సైడర్ మంకీ’ రిపోర్టులో తేలింది. టాప్-50 దేశాల జాబితాలో ఇండియా 18వ స్థానంలో నిలిచింది. సౌత్ కొరియా తర్వాత బ్రెజిల్, అమెరికా, జపాన్, మెక్సికో, జర్మనీ, కొలంబియా, థాయ్‌లాండ్, ఇటలీ, వెనిజుల దేశాలు టాప్-10లో ఉన్నాయి.

News April 7, 2025

ఉత్తరాదికి నిధులు.. దక్షిణాదికి మోసం: కోదండరాం

image

కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని MLC కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. HYDలో ఈ అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. పన్ను వసూళ్లలో మనమే ఎక్కువ చెల్లిస్తున్నామని వివరించారు. కానీ ఉత్తరాదికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ, దక్షిణాదిని కేంద్రం మోసం చేస్తోందన్నారు.

News April 7, 2025

నాని ‘ది ప్యారడైజ్’లో ఉప్పెన బ్యూటీ?

image

‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ లుక్‌తోనే అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. హీరో నానిని సరికొత్తగా చూపిస్తోండగా తాజాగా మరో న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నటించనుందని తెలుస్తోంది. ఇదే విషయమై హీరోయిన్‌తో దర్శకుడు చర్చల్లో ఉన్నట్లు సమాచారం. ‘దసరా’లో కీర్తిని డీగ్లామర్‌గా చూపించగా ఈ మూవీలో బేబమ్మను ఎలా చూపిస్తారో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

News April 7, 2025

ఫేక్ ప్రచారంపై ప్రముఖులను విచారించేందుకు ప్రభుత్వం చర్యలు!

image

TG: HCU భూములపై ఫేక్ ప్రచారం చేసిన ప్రముఖులను విచారించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేత జగదీశ్, నటులు జాన్ అబ్రహం, రవీనా టాండన్, ఇన్‌ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ తదితర ప్రముఖులను విచారించనున్నట్లు సమాచారం. కాగా HCU భూములపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈనెల 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.

News April 7, 2025

ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

image

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని మిథున్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

News April 7, 2025

చెప్పులు దాస్తే ₹5వేలే ఇచ్చాడని వరుడిపై కర్రలతో దాడి..

image

కొన్ని ప్రాంతాల్లో వివాహాల్లో వరుడి చెప్పులను దాచి కట్నం తీసుకోవడం ఆచారం. UP బిజ్నోర్‌లో ఓ వరుడిని ₹50వేలు డిమాండ్ చేశారు. అతడు ₹5వేలు ఇవ్వడంతో గొడవ జరిగింది. తక్కువ డబ్బు ఇచ్చినందుకు వధువు వైపు మహిళలు వరుడిని ‘బిచ్చగాడు’ అని తిట్టడంతో ఇరు కుటుంబాలు దాడి చేసుకున్నాయి. దీంతో వధువు కుటుంబం (బావమరుదులు) వరుడిని రూమ్‌లో బంధించి కర్రలతో కొట్టింది. పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరింది.

News April 7, 2025

చిరు వ్యాపారులను కొల్లగొడుతున్న క్విక్ కామర్స్!

image

నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న క్విక్ కామర్స్ సంస్థలు సంప్రదాయ చిరు వ్యాపారుల పొట్టకొడుతున్నాయి. ఈ పది నిమిషాల డెలివరీ సంస్థలు భారీ దేశీ, విదేశీ పెట్టుబడులతో ఆఫర్లు, అర్ధరాత్రి తర్వాతా సేవలు అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో చాలా మంది ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఇదే కొనసాగితే వచ్చే ఐదేళ్లలో నగర వీధుల్లో కిరాణా, కూరగాయల, పండ్ల దుకాణాలు కనుమరుగవ్వొచ్చు.

News April 7, 2025

MPC మీటింగ్ ప్రారంభం.. రేట్ తగ్గింపుపై ఉత్కంఠ

image

RBI మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ఆర్థిక పరిస్థితులు, పాలసీ రేట్లపై సమీక్షించనుంది. FEBలో రెపోరేట్‌ను 6.5నుంచి 6.25కి తగ్గించిన విషయం తెలిసిందే. ఎకనామిక్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తూ మరో 25 బేసిస్ పాయింట్స్ తగ్గించొచ్చని SBI అంచనా వేసింది. కొంతమంది నిపుణులు 50Pts కోత అవసరమంటున్నారు. దీనిపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీటింగ్ అనంతరం ఏప్రిల్ 9న ప్రకటన విడుదల చేయనున్నారు.

News April 7, 2025

ముంబై డెడ్లీ బౌలింగ్ అటాక్.. ఆర్సీబీకి సవాలే!

image

ఇవాళ ముంబై బౌలర్ల రూపంలో ఆర్సీబీకి సవాల్ ఎదురుకానుంది. స్వింగ్‌తో మ్యాజిక్ చేసే బౌల్ట్, దీపక్ చాహర్‌లకు తోడుగా బుమ్రా వస్తున్నారు. వీరిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఒకపక్క పొదుపుగా బౌలింగ్ చేస్తూనే మరోపక్క వికెట్లు తీస్తారు. ఇక కెప్టెన్ హార్దిక్ గత మ్యాచులో 5 వికెట్లు తీసి జోరుమీద ఉన్నారు. యువ బౌలర్లు అశ్వనీకుమార్, విఘ్నేశ్‌లను బెంగళూరు బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

News April 7, 2025

‘అమరావతి’కి రూ.4,200 కోట్లు విడుదల చేసిన కేంద్రం

image

AP: రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల చేసింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూ.3,535 కోట్లు వచ్చాయి. వీటికి కేంద్ర నిధులు కూడా తోడవ్వడంతో రాజధాని పనులు ఊపందుకోనున్నాయి. గత నెల దాదాపు 70 పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.