News April 7, 2025

ముంబై డెడ్లీ బౌలింగ్ అటాక్.. ఆర్సీబీకి సవాలే!

image

ఇవాళ ముంబై బౌలర్ల రూపంలో ఆర్సీబీకి సవాల్ ఎదురుకానుంది. స్వింగ్‌తో మ్యాజిక్ చేసే బౌల్ట్, దీపక్ చాహర్‌లకు తోడుగా బుమ్రా వస్తున్నారు. వీరిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఒకపక్క పొదుపుగా బౌలింగ్ చేస్తూనే మరోపక్క వికెట్లు తీస్తారు. ఇక కెప్టెన్ హార్దిక్ గత మ్యాచులో 5 వికెట్లు తీసి జోరుమీద ఉన్నారు. యువ బౌలర్లు అశ్వనీకుమార్, విఘ్నేశ్‌లను బెంగళూరు బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Similar News

News April 18, 2025

కీవ్‌లో భారత ఫార్మా గోడౌన్‌పై దాడి.. ఉక్రెయిన్‌కు రష్యా కౌంటర్

image

కీవ్‌లో APR 12న భారత ఫార్మా గోడౌన్‌పై దాడి జరగ్గా, దానికి కారణం రష్యా క్షిపణి అని ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా తాజాగా స్పందించింది.
ఉక్రెయిన్ క్షిపణుల వల్లే ఇది జరిగి ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. ఆ దాడి తాము చేయలేదని భారత్‌లోని రష్యా ఎంబసీ స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లో రాకెట్ లాంచర్లు, ఫిరంగులు సహా ఇతర సైనిక పరికరాలను మోహరించడం ఉక్రెయిన్‌కు పరిపాటిగా మారిందని మండిపడింది.

News April 18, 2025

కాంగ్రెస్ బతుకు అగమ్యగోచరమే: బండి సంజయ్

image

TG: రాహుల్, సోనియా గాంధీ పేర్లను ED ఛార్జ్‌షీట్‌లో చేర్చడంపై HYD ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘దేశ ప్రజలంతా ఛీత్కరించుకోవడం, దేశాన్ని ఇంకా దోపిడీ చేయలేకపోయామనే నిరాశలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వివేకం, వ్యక్తిత్వం వదిలేసి PMపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వారి భాష చూస్తే 2029 కాదు, యుగం గడిచినా ఆ పార్టీ బతుకు అగమ్యగోచరమే’ అని ట్వీట్ చేశారు.

News April 18, 2025

అరుదైన ఘనత సాధించిన హెడ్

image

IPL: వాంఖడేలో MIతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. మొత్తంగా 575 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ జాబితాలో తొలి స్థానంలో రస్సెల్(545), హెడ్ తర్వాత క్లాసెన్(594), సెహ్వాగ్(604), మ్యాక్స్‌వెల్(610), యూసుఫ్ పఠాన్(617), నరైన్(617) ఉన్నారు.

error: Content is protected !!