news

News April 6, 2025

స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్

image

తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తమిళనాడుకు 300% అధికంగా నిధులు ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో రూ.8,300 కోట్ల విలువైన జాతీయ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రం తమ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదన్న సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్ ఇచ్చారు. రైల్వే బడ్జెట్‌లో 700శాతం అధికంగా నిధులు కేటాయించామన్నారు. మరోవైపు మోదీ కార్యక్రమాన్ని ఎంకే స్టాలిన్ బహిష్కరించారు.

News April 6, 2025

వృద్ధి రేటులో రెండో స్థానంలో ఏపీ: CBN

image

AP: 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు(8.21%) సాధించిన రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే తమ విధానాలతో రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చామన్నారు. వ్యవసాయ పునరుజ్జీవం, తయారీ రంగం, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సమష్ఠి కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కాగా 9.69% వృద్ధి రేటుతో TN తొలి స్థానంలో ఉంది.

News April 6, 2025

ధోనీ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

image

CSK స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ 2023 ఐపీఎల్ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాల్సిందని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్నారు. ఆ సమయంలో ప్రకటన చేసి ఉంటే ఘనంగా వీడ్కోలు దక్కేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కీపింగ్ అదరగొడుతున్నా ఆయన బ్యాటింగ్ తీరుపై చెన్నై అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాగా నిన్నటి మ్యాచుతోనే ధోనీ వీడ్కోలు పలుకుతారని ప్రచారం జరిగినా కోచ్ ఫ్లెమింగ్ అలాంటి లేదన్నారు.

News April 6, 2025

పిఠాపురంలో టీడీపీ నేతలపై కేసు

image

AP: పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు <<15990895>>పర్యటన సందర్భంగా <<>>జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య బలప్రదర్శన వాగ్వాదానికి దారి తీసింది. తనను దూషించారని జనసేన నేత ఫిర్యాదుతో చినజగ్గంపేటకు చెందిన TDP నేతలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

News April 6, 2025

లోకేశ్ సొంత ఇలాకాలో ‘గంజాయి’: YCP

image

AP: మంత్రి లోకేశ్ సొంత ఇలాకా మంగళగిరిలో గంజాయి పట్టుబడిందని YCP ట్వీట్ చేసింది. ‘కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 1.2kgs గంజాయి, 8.71gms డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఒక్క చోట పట్టుకున్న గంజాయే ఇంత ఉంటే రాష్ట్రంలో ఎంత ఉందో? 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తానని లోకేశ్ బీరాలు పలికారు. మరి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలేదా’ అని విమర్శించింది.

News April 6, 2025

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కన్నుమూత

image

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. గుండెపోటుకు గురై గత కొన్ని రోజులుగా ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. కిమ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమెను జాక్వెలిన్ దగ్గరుండి చూసుకున్నారు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉన్నా తల్లి కోసం రద్దు చేసుకున్నారు. కిమ్ ఫెర్నాండెజ్‌కు మొత్తం నలుగురు సంతానం.

News April 6, 2025

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రేపు SCలో పిటిషన్: స్టాలిన్

image

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. దీనిని సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజా పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బిల్లును వ్యతిరేకిస్తూ MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ SCని ఆశ్రయించారు.

News April 6, 2025

జియో వినియోగదారులకు ఆఫర్ పొడిగింపు

image

IPL సందర్భంగా జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో హాట్‌స్టార్ యాక్సెస్‌ను ఫ్రీగా అందిస్తోంది. పలు రీఛార్జ్‌లపై గతంలో ప్రకటించిన ఈ ఆఫర్‌ను తాజాగా ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఆలోగా ₹100/₹195/₹949తో రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 90days యాప్ ఫ్రీగా చూడవచ్చు. ₹100 రీఛార్జ్‌కు 5GB డేటా, ₹195కి 15GB డేటా, ₹949తో రీఛార్జ్ చేసుకుంటే 84days వ్యాలిడిటీతో డైలీ 2GB డేటా, అన్ లిమిటెడ్ 5G డేటా&కాల్స్ పొందవచ్చు.

News April 6, 2025

ఆశ్చర్యకరంగా ధోనీ బ్యాటింగ్ గణాంకాలు

image

ఫినిషర్‌గా గతంలో CSKని ఎన్నో మ్యాచుల్లో గెలిపించిన ధోనీ ప్రస్తుతం తడబడుతున్నారు. నిన్న DCతో జరిగిన మ్యాచే ఇందుకు నిదర్శనం. 2023 సీజన్ నుంచి CSK ఓడిన 14 మ్యాచుల్లో 90.66 avgతో 272 రన్స్ చేసిన ఆయన, జట్టు గెలుపొందిన 13 మ్యాచుల్లో 13.80avgతో 69 రన్స్ మాత్రమే చేశారు. గెలిచిన మ్యాచుల్లో చేసిన రన్స్ కంటే ఓడిన మ్యాచుల్లో చేసిన పరుగులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

News April 6, 2025

కాంగ్రెస్, BRS పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలి: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్రంలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది BJPయేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. HYDలో BJP ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ అవినీతి పాలన, మజ్లిస్ పార్టీ అధికార దాహం నుంచి, KCR కుటుంబ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. INC, BRS పార్టీల కుట్రలు, నిజస్వరూపాన్ని బయటపెట్టి BJPని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలి’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.