news

News April 6, 2025

మార్కెట్ క్రాష్‌ను జయించిన వృద్ధుడి చాతుర్యం

image

టారిఫ్స్ ఎఫెక్ట్‌తో స్టాక్‌మార్కెట్స్ క్రాష్ అయి మస్క్, బెజోస్, బిల్‌గేట్స్ తదితర కుబేరులు రూ.కోట్ల సంపద కోల్పోయారు. అయితే టాప్10 బిలియనీర్ల జాబితాలో 94 ఏళ్ల వారెన్ బఫెట్ మాత్రమే $12.7B లాభాలతో మార్కెట్ పతనాన్ని జయించారు. కన్జూమర్ గూడ్స్, ఎనర్జీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టార్లలో ట్రేడింగ్‌తో పాటు ఈక్విటీ షేర్స్‌ అమ్మేసి షార్ట్ టర్మ్ US ట్రెజరీ బిల్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఆయన సక్సెస్ సీక్రెట్స్.

News April 6, 2025

ఎకనామిక్ గ్రోత్ రేట్‌.. రెండో స్థానంలో AP: మంత్రి లోకేశ్

image

ఎకనామిక్ గ్రోత్ రేట్(2024-25)లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచిందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కేంద్రం విడుదల చేసిన నివేదికను పంచుకున్నారు. AP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GSDP) ₹8.73 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 9.69% గ్రోత్ రేటుతో TN తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో AP (8.21%), అస్సాం (7.94), రాజస్థాన్ (7.82), హరియాణా(7.55), ఛత్తీస్‌గఢ్ (7.51), TG (6.69) ఉన్నాయి.

News April 6, 2025

సినిమాల్లోకి సీనియర్ హీరోయిన్ కూతురు?

image

సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమైపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న సీనియర్ హీరోయిన్ కుష్బూ, దర్శకుడు సుందర్‌ల కూతురు అవంతిక తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అవంతిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొత్త హీరోయిన్ వచ్చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నటించాలని తన మనసులో ఉందని, ఎప్పుడూ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని గతంలో అవంతిక చెప్పారు.

News April 6, 2025

శ్రీరామనవమి.. కొన్ని ప్రశ్నలు

image

రామాయణం గురించి మీకు కొన్ని ప్రశ్నలు. జవాబులు కామెంట్ చేయండి.
1.రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2.లక్ష్మణుని భార్య ఊర్మిళ తండ్రి ఎవరు?
3.రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలలు ఎవరు?
4.గంగను భూమికి తీసుకొచ్చేందుకు ఎవరు తపస్సు చేశారు?
5.శివధనుస్సును ఎవరు తయారుచేశారు?
6.సీతను అపహరించేందుకు రావణుడు ఎవరి సాయం కోరాడు?
7.రావణుడిని వధించేందుకు రాముడికి ఎవరు రథం పంపారు?

News April 6, 2025

మైనర్‌పై రేప్ కేసులో బ్యాడ్మింటన్ కోచ్ అరెస్ట్

image

బెంగళూరులో బాలికపై రేప్ కేసులో బ్యాడ్మింటన్ కోచ్ సురేశ్ బాలాజీ అరెస్టయ్యాడు. TNకు చెందిన సురేశ్ BGLRలో కోచింగ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఓ బాలిక(16) రెండేళ్ల క్రితం అందులో చేరగా లోబరుచుకుని పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులు వెల్లడించారు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని చెప్పారు. అతడి ఫోన్‌లో మరో 8మంది న్యూడ్ ఫొటోలు ఉన్నాయన్నారు. మిగతా ట్రైనీలపైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

News April 6, 2025

ఒంటిమిట్టలో 11న సీతారాముల కళ్యాణం

image

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం, ఏపీ ప్రభుత్వం ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు జరుపుతున్నాయి. భద్రాచలంలో శ్రీరామనవమి రోజు రాములోరి కళ్యాణం జరుపుతుండగా, ఒంటిమిట్టలో మాత్రం చతుర్దశి, పున్నమి రోజు చంద్రుడు వీక్షించేలా రాత్రి సమయంలో కళ్యాణం నిర్వహిస్తారు. ఈ సారి ఏప్రిల్ 11న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో కళ్యాణం జరగనుంది.

News April 6, 2025

‘బేబీ’ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?

image

‘బేబీ’తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య తన ఇష్టాయిష్టాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
*ఫస్ట్ క్రష్: రామ్ పోతినేని
*తొలి రెమ్యూనరేషన్: రూ.3వేలు *ఇష్టమైన ఫుడ్: బిర్యానీ
*ఫేవరెట్ హీరోయిన్: అనుష్క, సాయిపల్లవి
*మరిచిపోలేని ప్రశంస: చిరంజీవి జయసుధతో నన్ను పోల్చడం
కాగా సిద్ధు జొన్నలగడ్డతో వైష్ణవి నటించిన ‘జాక్’ మూవీ ఈ నెల 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News April 6, 2025

తారక మంత్రం పఠిస్తే ప్రయోజనాలు ఎన్నో?

image

తారక మంత్రాన్ని మూడు సార్లు చదివితే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా సహనం పెరుగుతుంది. సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. రామ అనే పదం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంగా పరిగణిస్తారు. తారక మంత్రం ఇదే..
‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే’

News April 6, 2025

సీతారాముల కళ్యాణం.. పోటెత్తిన భక్తజనం

image

TG: భద్రాద్రి భక్తజనసంద్రమైంది. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కళ్యాణమూర్తులను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకెళ్తుండగా అడుగడుగునా నీరాజనాలు పలికారు. మధ్యాహ్నం 12గం.లకు రామయ్య, సీతమ్మల కళ్యాణం జరగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించేందుకు కాసేపట్లో CM రేవంత్‌రెడ్డి అక్కడికి చేరుకోనున్నారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News April 6, 2025

ట్రెండింగ్‌లో #GetOutModi

image

కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొందరు తమిళ నెటిజన్లు Xలో ‘గెట్ ఔట్ మోదీ’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు. డీలిమిటేషన్‌తో తమ ప్రాధాన్యం తగ్గిస్తున్నారని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో హిందీని రుద్దాలని చూస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. నార్త్, సౌత్ స్టేట్స్‌ మధ్య నిధుల కేటాయింపులో తేడాలపై ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి PM వెళ్తున్న నేపథ్యంలో #GetOutModi ట్రెండవుతోంది.