India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో తెలంగాణ బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు రాజ్యసభలో కె.లక్ష్మణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని కోరారు.

వేసవిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఫుడ్, ఆన్‌లైన్ డెలివరీలు చేస్తూ ఇబ్బందిపడే గిగ్ వర్కర్ల కోసం చెన్నై కార్పోరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కాస్త ఉపశమనం కలిగించేందుకు చెన్నైలోని ప్రధాన రోడ్లపై ‘AC రెస్ట్ రూమ్స్’ను ఏర్పాటు చేయనుంది. స్విగ్గీ, జొమాటో, ఉబర్ డెలివరీ పార్ట్నర్స్ వీటిని ఉపయోగించుకోనున్నారు. ఈ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. HYDలోనూ ఇలాంటి ఏర్పాటు చేయాలని డిమాండ్ నెలకొంది.

హిట్‌మ్యాన్ రోహిత్ IPLలో విఫలమవ్వడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ విమర్శలు చేశారు. ప్రస్తుతం అతను కెప్టెన్ కాదని, కేవలం బ్యాట్స్‌మెన్ మాత్రమేనని పేర్కొన్నారు. రోహిత్ కాకుండా మరొకరు ఇలా తక్కువగా రన్స్ చేస్తే టీమ్ నుంచి బయటకు పంపేవారని చెప్పారు. అలాగని తాను రోహిత్‌ను టీం నుంచి డ్రాప్ కావాలని కోరుకోవట్లేదన్నారు. అయితే తిరిగి హిట్‌మ్యాన్ త్వరగా ఫామ్ అందుకొని జట్టుకు విజయాలు అందించాలని కోరారు.

సీబీఎస్‌ఈ 10 నుంచి 12 తరగతుల సిలబస్‌లో కీలక మార్పులు చేసింది. 2025-26 అకడమిక్ ఇయర్ నుంచి అన్ని అనుబంధ స్కూల్స్‌లో అప్డేటెడ్ సిలబస్ అందుబాటులోకి రానుంది. విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు తగినట్లు సిద్ధం చేయడం, మరింత క్రియాశీల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మార్పులు చేసినట్లు బోర్డు పేర్కొంది. వినూత్న పద్ధతిలో బోధించాలని, గైడ్‌లైన్స్ పకడ్బందీగా అమలు చేయాలని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది.

కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమవుతుండటంతో SBI కీలక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటలకు వరకు డిజిటల్ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. చెల్లింపుల్లో అంతరాయం లేకుండా ఉండేందుకు UPI LITE, ATMను వినియోగించాలని సూచించింది. వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.

ఉగాది’ సందర్భంగా చెన్నైలో శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ ఇచ్చిన అవార్డుల్లో దేవరను బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు వరించింది. ఈ విషయాన్ని దేవర ఫొటోగ్రఫీ డైరెక్టర్ రత్నవేలు ట్వీట్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా భారీ విజయాన్ని అందుకోగా ఇటీవలే జపాన్‌లో రిలీజైన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాకు DOPగా పనిచేస్తున్నారు.

AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై SC, ST కేసు నమోదైంది. గిరిజనులను బెదిరించినట్లు నెల్లూరు (D) పొదలకూరులో PSలో కేసు నమోదు చేశారు. అటు మైనింగ్ కేసులో ఇవాళ 11 గంటలకు విచారణకు రావాలని నిన్న పోలీసులు నోటీసులు ఇవ్వగా.. ఆయన గైర్హాజరయ్యారు. ప్రస్తుతం నెల్లూరు, హైదరాబాద్‌లో కాకాణి అందుబాటులో లేరని తెలుస్తోంది. మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది.

HCU భూములను వేలం వేయొద్దని, ప్రకృతిని కాపాడాలంటూ SMలో నెటిజన్లు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు చేస్తున్న ఈ ప్రచారంలో వేలాది మంది పాల్గొంటున్నారు. SAVE FOREST, SAVE HCU BIODIVERSTY అంటూ SMలో గళమెత్తుతున్నారు. ఈ ఇన్‌స్టా క్యాంపెయిన్‌లో ఇప్పటికే 10వేల మంది తమ మద్దతు తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలు సైతం HCU భూముల వేలంపై వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి?

దేశంలో డిజిటల్ పేమెంట్స్ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. మార్చిలో రూ.24.77లక్షల కోట్ల UPI పేమెంట్స్ జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) వెల్లడించింది. 18.3 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ నమోదయ్యాయంది. వరుసగా 11 నెలల నుంచి ప్రతినెలా రూ.20లక్షల కోట్లకు పైగా పేమెంట్స్ జరగడం విశేషం. JAN-MAR క్వార్టర్‌లో రూ.70.2లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఇది 24% అధికం.

భూకంపం వల్ల ఇటీవల బ్యాంకాక్ అల్లకల్లోలమైన విషయం తెలిసిందే. అక్కడి ఓ 30 అంతస్తుల భవనం కుప్పకూలగా, దాని కింద 74మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఆ శిథిలాల్లో 300-400 మంది చిక్కుకొని చనిపోయి ఉంటారని జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పటి వరకు ఆ శిథిలాల నుంచి 13 మృతదేహాలను వెలికి తీశారు. ఇటీవల మయన్మార్‌లో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భారీ భూకంపం రాగా, బ్యాంకాక్‌పై అది తీవ్ర ప్రభావం చూపింది.
Sorry, no posts matched your criteria.