India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

IPLలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 4 వికెట్లతో సత్తా చాటిన MI బౌలర్ అశ్వనీ కుమార్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తొలి మ్యాచ్ కావడం వల్ల ఒత్తిడితో లంచ్ చేయలేదని, కేవలం అరటి పండు తిన్నట్లు చెప్పారు. మంచి ప్రదర్శన ఇవ్వడానికి తాను కొంత ప్లాన్ చేసుకోగా, జట్టు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందన్నారు. షార్ట్ లెంగ్త్‌తో పాటు బ్యాటర్ల బాడీని టార్గెట్ చేస్తూ బంతులు వేయాలని కెప్టెన్ హార్దిక్ సూచించారని అశ్వనీ తెలిపారు.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ రేపు టారిఫ్‌లపై తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం అయ్యారు. సెన్సెక్స్ 450pts, నిఫ్టీ 100pts నష్టాలతో మొదలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 77,400, నిఫ్టీ 23,539 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. IT, Tech రంగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ట్రంప్ రెండోసారి US అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అధికారికంగా తొలి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల సౌదీ అరేబియా, ఖతర్, యూఏఈలో పర్యటించనున్నారని వైట్‌హౌస్ వెల్లడించింది. ‘సాధారణంగా UKకు ముందు వెళ్తారు. కానీ నేను సౌదీకి వెళ్తున్నా. గత పర్యటన కంటే రెట్టింపు పెట్టుబడులు సాధించడమే లక్ష్యం’ అని ట్రంప్ వెల్లడించారు. కాగా US కంపెనీల్లో $1ట్రిలియన్ పెట్టుబడులు పెడతామని సౌదీ హామీ ఇచ్చింది.

KKR ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ ఆ జట్టు ఫ్యాన్స్‌కు టార్గెట్ అయ్యారు. రూ.23.75cr పెట్టి కొంటే దారుణంగా ఆడుతున్నారని SMలో విమర్శలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో 3మ్యాచులకు గానూ 2సార్లు బ్యాటింగ్ చేసిన అయ్యర్ 9 పరుగులే చేశారు. భారీ ధరకు దక్కించుకోవడంతో పాటు వైస్ కెప్టెన్సీ ఇస్తే ఇలాగేనా ఆడేదంటూ మండిపడుతున్నారు. ఇతని కంటే కుర్రాళ్లు అనికేత్ వర్మ(SRH), విప్రాజ్ నిగమ్(ఢిల్లీ) మేలని కామెంట్లు చేస్తున్నారు.

SRHను వేధించిన ఘటనలో HCA అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఇవాళ విజిలెన్స్ విచారణకు హాజరుకానున్నారు. ఆయన విచారణకు రాకపోతే విజిలెన్స్ అధికారులే HCAకు వెళ్లే అవకాశం ఉంది. పాసుల కోసం జగన్‌మోహన్ రావు తమను వేధిస్తున్నాడంటూ ఇటీవల SRH సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

భారత్, కెనడా, జపాన్ తదితర దేశాలపై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని వైట్‌హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ వెల్లడించారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రేపు టారిఫ్‌లపై తుది నిర్ణయం తీసుకోనున్న వేళ ఈ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు దేశాలు ఎన్నో ఏళ్లుగా అధిక సుంకాలతో తమ దేశాన్ని దోచుకుంటున్నాయని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. IND 100% టారిఫ్స్ వసూలు చేస్తోందన్నారు. ఇప్పుడు తమ వంతని స్పష్టం చేశారు.

‘మోనాలిసా’ డైరెక్టర్ <<15946962>>సనోజ్ మిశ్రా<<>> తనపై లైంగిక దాడి చేశాడని ఓ యువతి ఫిర్యాదు మేరకు ఆయన్ను ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, సనోజ్ అమాయకుడు అని ఆ యువతి తెలిపారు. ఆయన్ను కావాలనే కొందరు ఇలా ఇరికిస్తున్నారని ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను సనోజ్‌తో ఉండటం, గొడవ పడటం వాస్తవమే కానీ.. ఎప్పుడూ ఆయన తనపై లైంగిక దాడి చేయలేదని వివరించారు.

పీఎఫ్ విత్‌డ్రా లిమిట్‌ను పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.లక్షగా ఉన్న ఆటో సెటిల్‌మెంట్ రూ.5 లక్షలకు పెంచాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో 7.5 కోట్ల మంది EPFO ఖాతాదారులకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. విద్య, వివాహ, ఇంటి ఖర్చులకు అప్లై చేసుకున్న మూడు రోజుల్లో పీఎఫ్ డబ్బులు ఖాతాలో జమచేస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ OTT తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. కొన్ని రోజుల కిందటే ఇది అమెజాన్ ప్రైమ్ OTTలోకి రాగా, ఇవాళ్టి నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ఫుల్ లవ్ స్టొరీతో వచ్చిన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ఈ మూవీలో ప్రియాంకా మోహన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.

AP: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ప్రభుత్వ సిబ్బంది ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేస్తున్నారు. ఉదయం 8.40 గంటల వరకు 53.98 శాతం మేర, 34 లక్షల మందికి పైగా నగదు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, ఇవాళ ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించనుండగా, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేయనున్నారు.
Sorry, no posts matched your criteria.