News April 1, 2025

ట్రంప్ తొలి విదేశీ పర్యటన.. ఎక్కడికంటే?

image

ట్రంప్ రెండోసారి US అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అధికారికంగా తొలి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల సౌదీ అరేబియా, ఖతర్, యూఏఈలో పర్యటించనున్నారని వైట్‌హౌస్ వెల్లడించింది. ‘సాధారణంగా UKకు ముందు వెళ్తారు. కానీ నేను సౌదీకి వెళ్తున్నా. గత పర్యటన కంటే రెట్టింపు పెట్టుబడులు సాధించడమే లక్ష్యం’ అని ట్రంప్ వెల్లడించారు. కాగా US కంపెనీల్లో $1ట్రిలియన్ పెట్టుబడులు పెడతామని సౌదీ హామీ ఇచ్చింది.

Similar News

News April 19, 2025

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

image

ఛానల్ అప్డేట్స్, మెసేజ్‌లను ఇతర భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకోగలిగే ఫీచర్‌‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. లేటెస్ట్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుని ట్రాన్స్‌లేషన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాక్టివేట్ చేసుకోవాలి. హిందీ సహా స్పానిష్, రష్యన్, అరబిక్ తదితర విదేశీ భాషలు సైతం అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో రోల్ ఔట్ కానుంది.

News April 19, 2025

‘జాట్‌’లో ఆ సీన్ తొలగింపు

image

జాట్‌లో ఓ సీన్ తమ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందంటూ క్రైస్తవులు ఆరోపించడంతో ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు మూవీ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఎవరి మనోభావాల్ని గాయపరచడం మా ఉద్దేశం కాదు. ఆ సన్నివేశం పట్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరుతున్నాం’ అని అందులో పేర్కొన్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్‌ను తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించారు.

News April 19, 2025

రక్షణ ఎగుమతులను రూ.50 వేల కోట్లకు చేరుస్తాం: రాజ్‌నాథ్

image

రక్షణ రంగంలో భారత్‌ స్వయం ప్రతిపత్తి సాధించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. MHలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మాట్లాడుతూ ‘మేం 2014లో అధికారం చేపట్టినప్పుడు రక్షణ ఎగుమతులు రూ.600 కోట్ల వరకే జరిగేవి. ప్రస్తుతం రూ.24వేల కోట్లకు చేరాయి. ఇక్కడితో సంతృప్తిపడం. 2029-30 వరకు ఎగుమతులను రూ.50 వేల కోట్లకు చేర్చాలనేదే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!