India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రతిష్ఠాత్మక పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌ను 2007 నుంచి పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహిస్తోంది. ఇకపై ఇరు దేశాల్లోని ఇతర దిగ్గజాల పేరిట సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జూన్-జులై మధ్య జరిగే సిరీస్ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశముంది. IND తరఫున 46 టెస్టులు ఆడిన పటౌడీ 2011లో మరణించారు.

AP: రాష్ట్రంలోని వర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 1 తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దాదాపు 153 పీజీ కోర్సులకు సంబంధించి జూన్ 6 నుంచి 8 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.inలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

TG: రాష్ట్రంలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ విడుదల చేస్తుందని సమాచారం. సిటీల్లో ప్రతి 3 కి.మీ ఒకటి, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతి 30 కి.మీ ఒకటి ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టంట్ కేఫ్‌లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా గ్లాసులోకి వస్తుంది.

19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు 41 రూపాయలు తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ రేట్ రూ.1,762కు చేరింది. హైదరాబాద్‌లో 1,985గా ఉంది. ప్రతినెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తాయి. అందులో భాగంగానే రేట్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

IPL-2025: MIతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై KKR కెప్టెన్ రహానే స్పందించారు. మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోవడానికి బ్యాటర్ల వైఫల్యమే కారణమన్నారు. బౌన్స్‌తో కూడిన మంచి బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ భాగస్వామ్యాలు నమోదు కాలేదని చెప్పారు. 180-190 వరకు స్కోర్ చేస్తామని భావించినా పవర్ ప్లేలోనే 4వికెట్లు కోల్పోవడంతో సాధ్యపడలేదన్నారు. బౌలర్లు పోరాడినా స్కోర్ పెద్దగా లేకపోవడంతో ఫలితం దక్కలేదని తెలిపారు.

వేసవిలో ఆరోగ్యకరమైన డ్రింక్స్ జాబితాలో కొబ్బరి నీళ్లు ముందు వరుసలో ఉంటాయి. ఖాళీ కడుపుతో లేదా వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయని, బరువు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. కిడ్నీల్లో స్టోన్స్ రాకుండా నిరోధిస్తాయి. తరచుగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుకోవచ్చు.

IPLలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థిపై ఎక్కువసార్లు ఓడిన జట్టుగా KKR నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆ జట్టు ముంబై ఇండియన్స్‌పై 10 సార్లు ఓడింది. ఈ క్రమంలో PBKS (కోల్‌కతాలో KKRపై 9 ఓటములు) పేరిట ఉన్న చెత్త రికార్డును చెరిపేసింది. మరోవైపు ముంబైపై కేకేఆర్ ఇప్పటివరకు 24 సార్లు ఓడింది. ఒకే ప్రత్యర్థిపై ఎక్కువసార్లు ఓడిన జట్టుగా నిలిచింది.

AP: పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ దాదాపు రూ.620 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత విద్యాసంవత్సరంలో సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ ద్వారా ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యతో పాటు ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు నిర్వహించారు. వాటికి అయిన ఖర్చులకే తాజాగా నిధులు మంజూరయ్యాయి.

ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1న ‘ఫూల్స్ డే’ నిర్వహిస్తారు. 16వ శతాబ్దం వరకు జూలియస్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 1ని న్యూఇయర్‌గా జరుపుకునేవారు. ఆ తర్వాత పోప్ గ్రెగోరీ VIII నూతన సంవత్సర వేడుకలను జనవరి 1కి మార్చారు. ఈ విషయం తెలియని ఫ్రాన్స్ ప్రజలు ఏప్రిల్ 1నే వేడుకలు జరుపుకున్నారు. దీంతో ఇతర ప్రాంతాలవారు వారిని ఫూల్స్‌గా ఆటపట్టించారు. అప్పటి నుంచి ఏప్రిల్ 1నాడే ‘ఫూల్స్ డే’ జరుపుకుంటున్నారు.

‘మహానటి’ కీర్తిసురేశ్ పెళ్లి తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌పై కన్నేశారు. ‘బేబీ జాన్’తో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం అక్క, రివాల్వర్ రీటా ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ఈ అమ్మడు మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి కోసం ప్రత్యేక కథను రూపొందించినట్లు సినీ వర్గాల్లో టాక్. మరి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.