News April 1, 2025
కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు

19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు 41 రూపాయలు తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ రేట్ రూ.1,762కు చేరింది. హైదరాబాద్‌లో 1,985గా ఉంది. ప్రతినెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తాయి. అందులో భాగంగానే రేట్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
Similar News
News April 20, 2025
రూ.3,900 కోట్ల భూమిని కాపాడిన బాలుడి లెటర్!

TG: హైడ్రాకు ఓ బాలుడు రాసిన లేఖ రూ.3,900 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. లంగర్‌హౌజ్‌కు చెందిన బాలుడు జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ సెంటర్ దగ్గర్లోని ఖాళీ స్థలంలో కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల నార్నె ఎస్టేట్స్ అనే సంస్థ అక్కడ కంచె ఏర్పాటు చేసి తవ్వకాలు చేపట్టడంతో అతడు హైడ్రాకు లేఖ రాశాడు. అది ప్రభుత్వ భూమి అని గుర్తించిన హైడ్రా, అక్కడి 39 ఎకరాల భూమిని తాజాగా స్వాధీనం చేసుకుంది.
News April 20, 2025
వక్ఫ్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర: ఒవైసీ

వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తగ్గేదే లేదని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ దారుసలాంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్రం నిర్ణయంతో ముస్లింల సమాధులకూ స్థలాలు ఉండబోవని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 నుంచి నిరసనలు చేపడతామన్నారు.
News April 20, 2025
థ్రిల్లింగ్ విక్టరీ.. అద్భుతం చేసిన ఆవేశ్

నిన్న LSGతో మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన RR మొదటి నుంచీ గెలుపు దిశగానే సాగింది. 17 ఓవర్లు ముగిసే సరికి స్కోర్ 156/2. 18 బంతుల్లో 25 రన్స్ కావాలి. అంతా విజయం ఖాయమనుకున్నారు. అయితే LSG బౌలర్ ఆవేశ్ ఖాన్ అద్భుతం చేశారు. 18వ ఓవర్‌లో జైస్వాల్, పరాగ్‌ను ఔట్ చేసి కేవలం 5 రన్స్ ఇచ్చారు. చివరి ఓవర్‌లో RRకు 9 రన్స్ కావాల్సి ఉండగా 6 పరుగులే ఇచ్చి హెట్మైర్ వికెట్ కూల్చి LSGకి విక్టరీ అందించారు.