news

News March 31, 2025

HCUలో హృదయవిదారకంగా నెమళ్ల ఆర్తనాదాలు: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం HCU భూములను వేలం వేయడాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి కూడా బుల్డోజర్లతో చెట్లను కూల్చడం వల్ల అక్కడి నెమళ్ల ఆర్తనాదాలు హృదయవిదారకంగా ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు, విద్యార్థుల గొంతు నొక్కుతూ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపి, HCU అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

News March 31, 2025

చైనాలో 1000 టన్నుల బంగారం నిక్షేపాలు

image

చైనా జాక్‌పాట్ కొట్టింది. దేశానికి ఈశాన్యంలోని లియావోనింగ్ ప్రావిన్స్‌లో 1000 టన్నుల బంగారు నిక్షేపాలు బయటపడ్డాయని భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వీటిని మైనింగ్ చేయడం అసాధ్యమన్న అభిప్రాయాలు అంతర్జాతీయ నిపుణుల నుంచి వ్యక్తమవుతుండగా చైనా పరిశోధకులు కొట్టి పారేస్తున్నారు. సుమారు 3 కి.మీ మేర నిక్షేపాలు విస్తరించి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచంలో స్వర్ణ ఉత్పత్తిలో చైనాయే అగ్రస్థానంలో ఉంది.

News March 31, 2025

ఎంపురాన్@రూ.200 కోట్లు

image

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘L2:ఎంపురాన్’ మూవీ చరిత్ర సృష్టించింది. 5 రోజులు పూర్తికాక ముందే రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగుతోంది. ఈ నెల 27న మూవీ విడుదలైన విషయం తెలిసిందే.

News March 31, 2025

ఇరగదీసిన కొత్త కుర్రాడు

image

కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కొత్త బౌలర్ అశ్వనీ కుమార్ ఇరగదీశాడు. ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలింగ్‌తో 3 ఓవర్లలో 24 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. IPL డెబ్యూలోనే 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా రహానే, రింకూ, మనీశ్, రసెల్ వికెట్లను దక్కించుకున్నాడు. బుమ్రా తరహాలో మరో మాణిక్యాన్ని MI వెలికితీసిందని, త్వరలోనే అతడు భారత్‌కు ఆడతాడని క్రికెట్ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.

News March 31, 2025

200 సిక్సర్లు.. ధోనీ అరుదైన రికార్డు

image

CSK ప్లేయర్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పారు. 30 ఏళ్ల వయసు దాటాక ఐపీఎల్‌లో 200 సిక్సులు బాదిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. ప్రస్తుతం 43వ వడిలో ఉన్న మిస్టర్ కూల్ నిన్న RRతో మ్యాచ్‌లో తుషార్ వేసిన 19వ ఓవర్‌లో సిక్స్ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా క్రిస్‌గేల్(347) ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారు. ఇక ధోనీ తర్వాత రోహిత్(113), అంబటి రాయుడు(109), దినేశ్ కార్తీక్(104) ఉన్నారు.

News March 31, 2025

ప్రతిదాడి తప్పదు.. USకు ఇరాన్ వార్నింగ్

image

న్యూక్లియర్ ఒప్పందానికి అంగీకరించకుంటే <<15942110>>దాడులు చేస్తామన్న<<>> US అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా అన్నంత పనిచేస్తే తాము ఎదురుదాడులు చేస్తామని సుప్రీం లీడర్ అయతుల్లా తేల్చిచెప్పారు. కాగా ప్రస్తుతం ఆ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్షిపణులను లాంచ్‌ప్యాడ్‌లపై సిద్ధంగా ఉంచినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. అగ్రరాజ్యంపై దాడులకు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంటున్నాయి.

News March 31, 2025

GOOD NEWS: రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు

image

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకం గడువును APR 14 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇది వరకు షెడ్యూల్ ప్రకారం APR 4 వరకే ఉండగా, పలువురి విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగా 5 లక్షల మందికి రూ.6వేల కోట్ల రుణాలను 60-80% వరకు రాయితీతో ఇవ్వనుంది. అప్లై <<15922104>>చేసుకోవడానికి<<>> రేషన్ కార్డు/ఇన్‌కం సర్టిఫికెట్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, ఫొటో అవసరం.
వెబ్‌సైట్: http//tgobmms.cgg.gov.in/

News March 31, 2025

రూ.2వేల కోట్ల ఆస్తి పన్ను.. GHMC రికార్డ్

image

TG: ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో GHMC రికార్డు సృష్టించింది. 2024-25కు గాను రూ.2,012 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. GHMC చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం కింద రూ.465 కోట్లు వసూలైందని చెప్పారు.

News March 31, 2025

హారతి ఇస్తుండగా మంటలు అంటుకొని మాజీ మంత్రికి తీవ్రగాయాలు

image

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గిరిజా వ్యాస్(78) తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో హారతి ఇస్తుండగా ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్‌కు తీసుకెళ్లారు. 1985 నుంచి 1990 వరకు ఆమె రాజస్థాన్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలందించారు.

News March 31, 2025

లోన్ తీసుకునేవారికి ALERT!

image

రుణాలు తీసుకోవాలనుకునేవారికి అలర్ట్. రేపటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తోంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వంటివాటిలో మూడింటికి మించి లోన్లు తీసుకోవడం ఇకపై కుదరదు. రుణాల ఎగవేతల్ని కట్టడి చేసేందుకు RBI ఈ నిబంధనను తీసుకొచ్చింది. గత ఏడాది డిసెంబరునాటికి 45 లక్షలమంది 3 కంటే ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకోవడం గమనార్హం.