news

News March 31, 2025

మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ.. ఎవరీమె?

image

PM మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా IFS అధికారిణి నిధి తివారీ నియమితులయ్యారు. 2014 బ్యాచ్‌(UP)కు చెందిన ఈమె తొలుత వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత విదేశాంగ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో PMOలో అండర్ సెకట్రరీగా చేరి డిప్యూటీ సెక్రటరీగా ప్రమోషన్‌ పొందారు. అంతర్జాతీయ సంబంధాల్లో ఉన్న నైపుణ్యంతో ఆమె ఇప్పుడు 35 ఏళ్లకే PMOలో కీలక స్థాయికి వచ్చారు.

News March 31, 2025

‘ఎంపురాన్’పై తమిళనాట వివాదం.. రైతుల ధర్నా

image

మోహన్‌లాల్ ‘ఎంపురాన్’ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఆ మూవీలో ముళ్లై పెరియార్ డ్యామ్‌ గురించి తీసిన సన్నివేశాల్ని తొలగించాలని తమిళనాడు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సినిమాపై నిరసనగా వచ్చే నెల 2న కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ధర్నాలు చేపడతామని ప్రకటించాయి. కాగా.. ఓ వర్గాన్ని కించపరిచేలా కొన్ని సీన్స్ ఉన్నాయంటూ ఇప్పటికే ఆ సినిమాపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

News March 31, 2025

తెలంగాణ టు ఫిలిప్పీన్స్.. వయా కాకినాడ

image

ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్‌కు బియ్యాన్ని ఎగుమతి చేయనుంది. 8 లక్షల టన్నుల బియ్యం ఎక్స్‌పోర్ట్‌కు ఒప్పందం కుదరగా తొలి విడతగా ఇవాళ 12,500 టన్నుల MTU 1010 రకాన్ని పంపనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కాకినాడ వెళ్లి బియ్యం నౌకను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన వెంటన ఫిలిప్పీన్స్ ప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నారు.

News March 31, 2025

చైనా వండర్.. సముద్ర గర్భంలో డేటా సెంటర్

image

టెక్నాలజీలో చైనా మరో అద్భుతం చేసింది. ప్రపంచంలో తొలిసారిగా సముద్రం లోపల AI డేటా సెంటర్ ఏర్పాటు చేసింది. హాంకాంగ్‌కు ఆగ్నేయ దిశలోని లింగ్ షుయి తీరంలో దీన్ని ప్రారంభించింది. ఇక్కడ 400 హైపెర్ఫార్మెన్స్ సర్వర్లను కూల్ చేసే సౌకర్యాలు ఉంటాయి. ఒక సెకన్‌లో పారిశ్రామిక రంగం నుంచి మెరైన్ రీసెర్చ్ వరకు 7వేల Ai ప్రశ్నలను ప్రాసెస్ చేస్తుంది. ఇది ఆరంభమేనని, మున్ముందు వీటి సంఖ్యను పెంచుతామని పేర్కొంది.

News March 31, 2025

1 కాదు, 2 కాదు.. 10 ప్రభుత్వ ఉద్యోగాలు

image

TG: ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టం అవుతున్న ఈ రోజుల్లో భూపాలపల్లి (D) గుంటూరుపల్లికి చెందిన V. గోపీకృష్ణ 10 ఉద్యోగాలు సాధించారు. తాజాగా, TGPSC రిలీజ్ చేసిన గ్రూప్-1 ఫలితాల్లో 70వ ర్యాంకర్‌గా నిలిచారు. ఈయన ఇప్పటి వరకు 7 కేంద్ర, 3 రాష్ట్ర ప్రభుత్వ కొలువులు సాధించారు. ప్రస్తుతం గోపి మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌‌గా ట్రైనింగ్ పొందుతున్నారు. త్వరలో గ్రూప్-1 పోస్టులో జాయిన్ అవుతానని చెప్పారు.

News March 31, 2025

‘ghibli’ ట్రెండ్

image

దేశంలో ఇప్పుడిదే నడుస్తోంది. ఎవరి SM పేజీలు చూసినా ‘ghibli’ ఎడిటెడ్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్‌లో ఈ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. మనవాళ్ల వాడకం ఎలా ఉందంటే.. ‘ghibli’ వినియోగాన్ని తగ్గించండి మహాప్రభో అంటూ ఏకంగా Open AI CEO ఆల్ట్‌మనే ప్రాధేయపడుతున్నారు. తమ సిబ్బంది నిద్ర లేకుండా పనిచేస్తున్నారని చెబుతున్నారు. మరి మీరూ ‘ghibli’ ట్రెండ్‌లో జాయిన్ అయ్యారా?

News March 31, 2025

వేసవిలో ఇలా చేయండి..

image

వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. వివిధ కారణాలతో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 8 గ్లాసుల వాటర్ తాగడం, దోసకాయ, పుచ్చకాయ తినడం, జ్యూస్‌లు తాగడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. దాహం వేయకున్నా తరచుగా నీరు తాగాలని చెబుతున్నారు. చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.

News March 31, 2025

నిర్మాత ముళ్లపూడి కన్నుమూత

image

టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయన దివంగత ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలను ముళ్లపూడి నిర్మించారు.

News March 31, 2025

గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు

image

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల గుండె సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన నానిని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. రక్తనాళాల్లో బ్లాక్‌లకు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలిస్తున్నారు. నాని కుటుంబసభ్యులు ప్రత్యేక విమానంలో అక్కడికి బయల్దేరారు.

News March 31, 2025

ORANGE ALERT: రేపటి నుంచి ఈ జిల్లాల్లో వర్షాలు

image

TGలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, MBNR, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడుతాయంది. ఏప్రిల్ 2, 3న ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గుతాయని తెలిపింది.