news

News October 27, 2024

‘అమెరికాలో మస్క్ అక్రమంగా పనిచేశారు’

image

కెరీర్ తొలినాళ్ల‌లో ఎలాన్ మ‌స్క్ అమెరికాలో అక్ర‌మంగా ప‌నిచేశార‌ని Washington Post క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. సౌతాఫ్రికాకు చెందిన మ‌స్క్ 1995లో స్టాన్‌ఫోర్డ్ నుంచి డ్రాపౌట్ అయ్యాక Zip2 సంస్థ‌లో 4ఏళ్ల‌ పాటు చ‌ట్ట‌విరుద్ధంగా అమెరికాలో ప‌నిచేసినట్టు తెలిపింది. 1997లో మస్క్ వ‌ర్క్ ఆథ‌రైజేష‌న్ పొందార‌ని అత‌ని మాజీ సహచరులు వెల్ల‌డించారంది. స్టూడెంట్ వీసాతో ఓవర్ స్టే సహజమే అయినా, అది అక్రమమని పేర్కొంది.

News October 27, 2024

షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికార తగాదా: VSR

image

AP: ‘షర్మిలది ఆస్తి తగాదా కాదు అధికార తగాదా’ అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘షర్మిల ప్రెస్‌మీట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని చెప్పారు. కానీ ఆ ప్రెస్‌మీట్ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు. కొంతకాలంగా జగన్‌ను తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. జగన్ మళ్లీ CM కావొద్దనే ఆమె పని చేస్తున్నారు’ అని మీడియాతో VSR అన్నారు.

News October 27, 2024

రేణూ దేశాయ్‌కి ఉపాసన సాయం!

image

నటి రేణూ దేశాయ్ ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలను రెస్క్యూ చేయడమే ఈ సంస్థ పని. అందుకు విరాళాలు ఇవ్వాలని ఆమె కోరగా హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన స్పందించినట్లు తెలుస్తోంది. తన పెంపుడు శునకం రైమ్ పేరిట ఆమె ఈ సాయం చేశారట. దీంతో పెట్స్ రెస్క్యూ కోసం వ్యాన్ కొనుగోలుకు సాయం చేసినందుకు ‘థాంక్యూ రైమ్, ఉపాసన’ అంటూ రేణూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

News October 27, 2024

ఏపీలో మంచి ఎకో సిస్టం ఉంది: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ఎకో సిస్టం ఉందని, అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు.

News October 27, 2024

కరెంట్ షాక్‌తో ‘యమరాజు’ కన్నుమూత

image

‘యమరాజు’గా పాపులర్ అయిన మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌కు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జవహార్‌సింగ్ యాదవ్ కన్నుమూశారు. తాను పెంచుకుంటున్న ఆవును మేపుతుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆ ఆవు కూడా మరణించింది. కాగా ఆయన కరోనా సమయంలో యమ ధర్మరాజు వేషధారణలో వాహనదారులకు అవగాహన కల్పించారు. అప్పట్లో ‘యమరాజు’ వినూత్న ఆలోచనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిశాయి.

News October 27, 2024

‘దీపావళి’ స్కామ్స్.. జాగ్రత్త

image

దీపావళి ముంగిట సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. భారీ ఆఫర్లంటూ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో నకిలీ వెబ్‌సైట్ల లింకులు, APK ఫైళ్లను వాట్సాప్ నంబర్లకు పంపుతున్నారు. ఏదైనా వస్తువు కోసం డబ్బు చెల్లించినా డెలివరీ కావట్లేదు. వ్యక్తిగత సమాచారం దుండగుల చేతుల్లోకి వెళ్తోంది. అలాగే బంపర్ డ్రా, లాటరీల పేరుతోనూ స్కామ్‌లు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News October 27, 2024

విశాఖలో ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్: లోకేశ్

image

AP ఆర్థిక రాజధాని విశాఖకు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్ రాబోతున్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్‌పోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా సంస్థలు రాబోతున్నాయి. అమరావతిలో 5 బిలియన్ డాలర్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం’ అని ఆయన చెప్పారు.

News October 27, 2024

విశాఖ-విజయవాడ విమాన సర్వీసులు ప్రారంభించిన కేంద్రమంత్రి

image

AP: విశాఖ-విజయవాడ మధ్య 2 విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ 9.35amకు విశాఖలో బయలుదేరి 10.35amకు గన్నవరం చేరుతుంది. తిరిగి 7.55pmకు విజయవాడ నుంచి బయలుదేరి 9pmకు విశాఖకు చేరుతుంది. ఇండిగో సర్వీసు 7.15pmకు విజయవాడ నుంచి విశాఖకు వెళ్లి, 8.45pmకు అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం చేరుతుంది. ఈ నగరాల మధ్య విమానాల సంఖ్య 3కి చేరింది.

News October 27, 2024

20 లక్షల ఉద్యోగాల కల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ

image

AP: 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకునేందుకు విధివిధానాలు రూపొందిస్తోంది. ఈమేరకు ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి మంత్రి లోకేశ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై ఫోకస్ పెట్టనుంది.

News October 27, 2024

‘దృశ్యం’లో వెంకటేశ్ చిన్నకూతురు.. ఇప్పుడెలా అయ్యారో చూడండి!

image

విక్టరీ వెంకటేశ్-మీనా నటించిన ‘దృశ్యం’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అందులో వారి పెద్దకూతురిగా కృతిక, చిన్నకూతురిగా ఎస్తేర్ అనిల్ అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు. తాజాగా ఎస్తేర్ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా ‘ఆ అమ్మాయి ఇప్పుడు ఇలా అయిందా?’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం’లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌ భాషల్లోనూ ఎస్తేరే నటించారు.