News April 14, 2025
కాంగ్రెస్ ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా: రాబర్ట్ వాద్రా

కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే, తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ భర్త అయినందునే ఇంతకాలం రాజకీయ చర్చల్లో తనపై విమర్శలు చేసేవారన్నారు. రాహుల్, ప్రియాంకలను చూసి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత తరుణంలో, పార్లమెంట్‌లో పోరాడటానికి మరిన్ని గొంతుకలు కావాలని రాబర్ట్ వాద్రా అభిప్రాయపడ్డారు.
Similar News
News April 23, 2025
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా

ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన అవతరించారు. హైదరాబాద్‌తో మ్యాచులో బుమ్రా ఈ ఫీట్ నెలకొల్పారు. 237 ఇన్నింగ్సుల్లో ఆయన ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ నిలిచారు. అగ్ర స్థానంలో ఆండ్రూ టై ఉన్నారు. అతడు 208 మ్యాచుల్లోనే 300 వికెట్ల మార్కును అందుకున్నారు.
News April 23, 2025
ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన

పహల్‌గామ్‌లో టూరిస్టులపై నిన్న ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ దేశస్థుడు చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ఉగ్రదాడిని ప్రపంచంలోని చాలా దేశాలు ఖండించాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించారు.
News April 23, 2025
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: CM చంద్రబాబు

AP: పహల్‌గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహానికి CM చంద్రబాబు నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామన్నారు. చంద్రమౌళితో పాటు కావలికి చెందిన మరో వ్యక్తి మరణించగా, ఇరు కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉగ్రదాడి జరిగిందని, సరిహద్దుల్లో చొరబాటుదారులను సమర్థంగా అడ్డుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.