news

News April 18, 2025

గిరిజనులకు చెప్పులు పంపిన పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. అల్లూరి (D) డుంబ్రిగూడ (M) పెదపాడు గ్రామానికి చెందిన 345 మంది గిరిజనులకు పాదరక్షలు పంపారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల అక్కడ పర్యటించిన Dy.CM కొందరు గిరిజనులకు చెప్పులు లేవని గుర్తించారు. వారి పాదరక్షల సైజ్ వివరాలు తెప్పించుకుని, తన ఆఫీసు సిబ్బందితో చెప్పులు పంపించారు.

News April 18, 2025

ఇక అందరికీ అందుబాటులోకి పైలట్ శిక్షణ!

image

వాణిజ్య పైలట్ లైసెన్స్ శిక్షణ పొందాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా ఉండాలనే రూల్‌ను DGCA ఎత్తేయాలని యోచిస్తోంది. దీంతో ఆర్ట్స్, కామర్స్ తదితర కోర్సులు చేసిన వారు కూడా దీనికి అర్హత పొందనున్నారు. 1990 నుంచి ఇండియాలో ఈ రంగంలో సైన్స్& మ్యాథ్స్ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంది. దీనిపై త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది జరిగితే ఫిట్‌గా ఉండి విద్యార్హతలు ఉన్న వారందరూ అర్హత పొందనున్నారు.

News April 18, 2025

OTTలోకి రెండు కొత్త సినిమాలు.. ఎప్పుడంటే?

image

‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’ OTT రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అటు ‘DJ టిల్లు’ ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘జాక్’ సినిమా కూడా అనుకున్న తేదీ కంటే ముందే OTT బాట పట్టనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముంది.

News April 18, 2025

రాష్ట్రానికి రూ.28,842 కోట్ల మద్యం ఆదాయం

image

AP: ఈ ఏడాది రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 ఏడాదికిగానూ రూ.28,842 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. పన్నుల రూపంలో రూ.24,731 కోట్లు, వైన్స్, బార్లు, డిస్టిలరీల లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.2,206 కోట్లు, దరఖాస్తు రుసుముల రూపంలో రూ.1,905 కోట్లు వచ్చినట్లు వివరించింది. ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో 14 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది.

News April 18, 2025

స్టేషన్ల సుందరీకరణ కాదు.. రైళ్లను పెంచండి: నెటిజన్లు

image

అమృత్‌ భారత్ స్కీమ్ కింద కేంద్రం రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. TGలోని సికింద్రాబాద్, బేగంపేట, వరంగల్ తదితర రైల్వే స్టేషన్లను సుందరీకరిస్తున్నారు. అయితే, దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ట్రాక్స్‌ను పునరుద్ధరించడం, మరిన్ని రైళ్లను పెంచడానికి బదులుగా స్టేషన్ల కోసం ఖర్చు చేస్తున్నారని ట్వీట్స్ చేస్తున్నారు. సీట్ల లభ్యత, ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News April 18, 2025

చైనాతో మంచి డీల్ చేసుకుంటాం: ట్రంప్

image

వాణిజ్యంపై త్వరలోనే చైనాతో మంచి ఒప్పందం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే యూరప్‌తోపాటు ఇతర దేశాలతో డీల్ చేసుకోవడంలో కొంత సమస్య ఉందన్నారు. ఇటాలియన్ ప్రధానమంత్రి వైట్ హౌస్ పర్యటన సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. కాగా అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం ట్రేడ్ వార్ నడుస్తోంది. డ్రాగన్ వస్తువులపై US ఏకంగా 245శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.

News April 18, 2025

నితీశ్ ఈసారి అంతంతమాత్రమే..!

image

IPL: గత సీజన్లో రాణించి వెలుగులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈసారి తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఈ సీజన్‌లో 7 మ్యాచుల్లో 6 సార్లు బ్యాటింగ్ చేసిన నితీశ్ కేవలం 131 పరుగులే చేశారు. ఆ ఇన్నింగ్స్ ఇలా ఉన్నాయి.. 30(15), 32(28), 0(2), 19(15), 31(34), 19(21). ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. స్ట్రైక్ రేట్ కూడా ఆకట్టుకునేలా లేదని, ఆయన బ్యాటింగ్ మెరుగుపర్చుకోవాల్సి ఉందని నెటిజన్లు అంటున్నారు.

News April 18, 2025

వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌గా యుద్ధ బాధితుడి చిత్రం

image

గాజా‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో గాయపడిన ఓ బాలుడి చిత్రం ఈ ఏడాది వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైంది. పాలస్తీనాకు చెందిన ఫొటోగ్రాఫర్ సమర్ అబు ఎలూఫ్ ఈ ఫొటో తీశారు. ఈ చిత్రంలోని బాలుడు రెండు చేతులు కోల్పోయి దీనస్థితిలో కనిపిస్తున్నాడు. ఈ యుద్ధం వల్ల భవిష్యత్తు తరాలు ఎలా అంధకారంలోకి వెళ్లాయో ఈ చిత్రం చెబుతుందని వరల్డ్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.

News April 18, 2025

కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని నిరూపించే సమయమిది: కేటీఆర్

image

TG: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రధాని మోదీ కేవలం మాటలకే పరిమితం కావొద్దని KTR కోరారు. అందులో జీవవైవిధ్యాన్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థిక కుంభకోణం జరిగిందని చెప్పారు. భూముల తాకట్టు వ్యవహారాన్ని CBI, SEBI, RBI దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. TGలో కాంగ్రెస్, BJP ఒకటి కాదని నిరూపించే సమయమిదని వ్యాఖ్యానించారు.

News April 18, 2025

మెలోనీ అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్

image

ఇటలీ PM జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని ట్రంప్ తెలిపారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని అని, వ్యక్తిగతంగానూ ఆవిడతో మంచి అనుబంధం ఉందన్నారు. ఆవిడలో చాలా ప్రతిభ ఉందని, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరంటూ కొనియాడారు. టారిఫ్స్ పెంపుపై US వైఖరిని మెలోనీ వ్యతిరేకించినా.. యూరోపియన్ దేశాల నుంచి ట్రంప్‌ని కలిసిన తొలి ప్రధాని ఆవిడే.

error: Content is protected !!