news

News April 19, 2026

KKR జట్టులో చేరిన స్టార్ బౌలర్

image

IPL: KKR జట్టులో స్టార్ బౌలర్ మతీశ పతిరణ జాయిన్ అయ్యారు. శ్రీలంక క్రికెట్ బోర్డ్ NOC ఇవ్వడంతో ఆయన తాజాగా తమ క్యాంపులోకి ఎంట్రీ ఇచ్చినట్లు KKR యాజమాన్యం ప్రకటించింది. డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ఈ బౌలర్ రాకతో అయినా KKR ఫేట్ మారుతుందేమో చూడాలి. అయితే ఇవాళ RRతో జరిగే మ్యాచులో అతను ఆడతారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఈ సీజన్‌లో KKR ఆడిన 5 మ్యాచుల్లోనూ ఓడగా ఒకటి రద్దయింది.

News April 19, 2026

చిన్న పొరపాటు చేసినా తీవ్రస్థాయిలో దాడి: ఇరాన్

image

అమెరికాతో దౌత్యానికైనా, పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ స్పష్టం చేశారు. తాము యుద్ధంలో గెలిచేశామని, ఇప్పుడు చర్చలకు రెడీగా ఉన్నామని తెలిపారు. ఈ సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, చిన్న పొరపాటు చేసినా తీవ్ర స్థాయిలో బదులిస్తామన్నారు. గత సంఘర్షణలతో పోలిస్తే ఇరాన్ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు.

News April 19, 2026

మరోసారి తల్లి కాబోతోన్న దీపికా పదుకొణె

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి కాబోతున్నారు. తాను ప్రెగ్నెంట్ అని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. తన కూతురు దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. రణ్‌వీర్ సింగ్, దీపిక 2018లో వివాహం చేసుకోగా, 2024లో కూతురు జన్మించిన సంగతి తెలిసిందే.

News April 19, 2026

ఇంటర్ సెకండియర్‌కూ ఇంప్రూవ్‌మెంట్.. ఫీజు ఎంతంటే?

image

AP: ఈ ఏడాది నుంచి ఇంటర్ సెకండియర్ ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం <<19683959>>ఇంప్రూవ్‌మెంట్<<>> రాసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు రూ.600 ఫీజుతోపాటు ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున చెల్లించాలని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇటీవల పబ్లిక్ పరీక్షలకు కేటాయించిన ఐడీ నంబరుతోనే రేపటి నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా సప్లిమెంటరీ పరీక్షలకూ రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు.

News April 19, 2026

నేడే అక్షయ తృతీయ.. బంగారం ధర ఎంతంటే?

image

ఇవాళ అక్షయ తృతీయ కావడంతో చిన్న బంగారు వస్తువైనా కొని ఇంటికి తెస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని చాలామంది నమ్మకం. అయితే పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఉండటం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది. కాగా నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,55,780 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,800కు విక్రయిస్తున్నారు.

News April 19, 2026

‘లెనిన్’లో నాగ్ మార్పులు?

image

మురళీ కిశోర్ డైరెక్షన్‌లో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘లెనిన్’ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన నాగార్జున కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. దీంతో మూవీని ట్రిమ్ చేసే పనిలో ఎడిటర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన <<19666338>>‘యెట్టా యెట్టా’<<>> పాట ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News April 19, 2026

మధ్యాహ్నం వరకు ఎండలు.. ఆపై వర్షాలు

image

TG: ఇవాళ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఎండలు దంచికొడుతుండగా మధ్యాహ్నం నుంచి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం 42–45°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఆపై HYD, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, NZB, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

News April 19, 2026

మరో ఏడాదిపాటు చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్!

image

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని బోర్డు పొడిగించనున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. 2027 జూన్ వరకు ఎక్స్‌టెండ్ చేయనున్నట్లు పేర్కొంది. 2023లో అగార్కర్ చీఫ్ సెలక్టర్ అయిన తర్వాత భారత్ 2024, 2026 టీ20 వరల్డ్ కప్‌తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ టెస్టుల నుంచి రిటైర్ కావడానికి ఆయనే కారణమని విమర్శలూ వచ్చిన సంగతి తెలిసిందే.

News April 19, 2026

పవన్ త్వరలోనే కోలుకుంటారు: ప్రధాని మోదీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు. ఆయన త్వరలోనే కోలుకుంటారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు. సైనసైటిస్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌కు నిన్న <<19687368>>సర్జరీ<<>> జరిగిన సంగతి తెలిసిందే.

News April 19, 2026

అనిల్ రావిపూడి సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్?

image

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమా కోసం తొలిసారి తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఆయన తెరకెక్కించబోయే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్ కుమార్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అనిల్ డైరెక్ట్ చేసిన గత రెండు సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ అందించారు. అవి సూపర్ హిట్టయినా మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చడం ఆసక్తికరంగా మారింది.