news

News January 1, 2026

శుభ సమయం (1-1-2026) గురువారం

image

➤ తిథి: శుద్ధ త్రయోదశి రా.8.44 వరకు
➤ నక్షత్రం: రోహిణి రా.9.50 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.32-7.27, ఉ.9.16-10.10, ఉ.10.56-మ.12.01, మ.12.55-1.50, మ.3.53-5.30
➤ రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు
➤ యమగండం: 6.00 AM నుంచి 7.30 AM
➤ దుర్ముహూర్తం: ఉ.10.11 నుంచి 10.55, మ.2.34-3.18
➤ వర్జ్యం: మ.2.23 నుంచి మ.3.52, తె.3.03-4.33 వరకు
➤ అమృత ఘడియలు: సా.6.51 నుంచి రా.8.20 వరకు.

News January 1, 2026

శుభ సమయం (1-1-2026) గురువారం

image

➤ తిథి: శుద్ధ త్రయోదశి రా.8.44 వరకు
➤ నక్షత్రం: రోహిణి రా.9.50 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.32-7.27, ఉ.9.16-10.10, ఉ.10.56-మ.12.01, మ.12.55-1.50, మ.3.53-5.30
➤ రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు
➤ యమగండం: 6.00 AM నుంచి 7.30 AM
➤ దుర్ముహూర్తం: ఉ.10.11 నుంచి 10.55, మ.2.34-3.18
➤ వర్జ్యం: మ.2.23 నుంచి మ.3.52, తె.3.03-4.33 వరకు
➤ అమృత ఘడియలు: సా.6.51 నుంచి రా.8.20 వరకు.

News January 1, 2026

శుభ సమయం (1-1-2026) గురువారం

image

➤ తిథి: శుద్ధ త్రయోదశి రా.8.44 వరకు
➤ నక్షత్రం: రోహిణి రా.9.50 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.32-7.27, ఉ.9.16-10.10, ఉ.10.56-మ.12.01, మ.12.55-1.50, మ.3.53-5.30
➤ రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు
➤ యమగండం: 6.00 AM నుంచి 7.30 AM
➤ దుర్ముహూర్తం: ఉ.10.11 నుంచి 10.55, మ.2.34-3.18
➤ వర్జ్యం: మ.2.23 నుంచి మ.3.52, తె.3.03-4.33 వరకు
➤ అమృత ఘడియలు: సా.6.51 నుంచి రా.8.20 వరకు.

News January 1, 2026

హ్యాపీ న్యూ ఇయర్..

image

కొత్త ఆశలను, ఆకాంక్షలను మోసుకుంటూ న్యూ ఇయర్ వచ్చేసింది. ఎన్నో అనుభూతులను మిగిల్చిన 2025కు వీడ్కోలు చెబుతూ 2026ను ప్రపంచం ఆహ్వానించింది. గడియారం ముల్లు 12.00 దాటగానే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. టపాసుల మోత, కేకుల కోత, డీజే పాటలు, యువత కేరింతలతో సంబరాలు మిన్నంటాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఈవెంట్లు, లైట్ షోలు, కన్సర్ట్‌లు హోరెత్తుతున్నాయి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.

News January 1, 2026

TODAY HEADLINES

image

✦ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న TG CM రేవంత్
✦ ఉద్యోగులకు రూ.713 కోట్లు విడుదల చేసిన TG సర్కార్
✦ గోదావరి నీటి మళ్లింపును అంగీకరించం: ఉత్తమ్
✦ APలో పెరుగుతున్న స్ర్కబ్ టైఫస్ కేసులు.. ఇప్పటివరకు 2 వేలకుపైగా నమోదు, 22మంది మృతి
✦ పెయిన్‌కిల్లర్ డ్రగ్ Nimesulide తయారీ, సేల్స్‌పై బ్యాన్: కేంద్రం
✦ కోమాలోకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్టిన్

News January 1, 2026

ట్రైనీ కానిస్టేబుళ్లకు రూ.12వేలు.. ఉత్తర్వులు జారీ

image

AP: ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12వేలకు పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న మంగళగిరిలో జరిగిన నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్టైఫండ్‌ను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం రెండు దశల్లో 9 నెలలపాటు జరగనుంది.

News January 1, 2026

40’s తర్వాత నిద్ర తగ్గితే ఏం జరుగుతుందో తెలుసా?

image

40 ఏళ్ల తర్వాత శరీరానికి 7-9 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. 7గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుదలతోపాటు రోజువారీ కార్యకలాపాలకు బాడీ నెమ్మదిగా స్పందిస్తుంది. విటమిన్ డెఫిషియన్సీ, ప్రీ డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వచ్చే ప్రమాదముంది.

News January 1, 2026

IASలతో CM రేవంత్ సెలబ్రేషన్స్

image

TG: బేగంపేటలోని IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకల్లో CM రేవంత్ పాల్గొన్నారు. IASలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్​ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుంది. అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తాం’ అని తెలిపారు.