news

News January 1, 2026

ఆపరేషన్ సిందూర్.. ప్రపంచానికి సందేశం: రక్షణ శాఖ

image

ఉగ్రవాదంపై పోరులో ఇండియా సంకల్పానికి ఆపరేషన్ సిందూర్ గొప్ప నిదర్శనమని రక్షణ శాఖ తెలిపింది. కచ్చితత్వం, నైపుణ్యంతో మన బలగాలు పాక్ ఉగ్ర స్థావరాల గుండెల్లోకి లోతుగా దూసుకెళ్లి దెబ్బకొట్టాయని చెప్పింది. ‘ఈ ఆపరేషన్ ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపింది. భారత్ ఉగ్రవాదాన్ని సహించదని, దాన్ని ప్రోత్సహించే వారు ప్రతీకార చర్యను ఎదుర్కోవాల్సిందేనని తెలియజేసింది’ అని ఇయర్ ఎండ్ రివ్యూ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.

News January 1, 2026

ఫ్రాన్స్‌లోనూ టీనేజర్లకు SM బ్యాన్?

image

15 ఏళ్ల లోపు పిల్లలకు SM వినియోగాన్ని నిషేధించాలని ఫ్రాన్స్ యోచిస్తోంది. ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయగా, సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలు చదువుతున్న స్కూళ్లలో ఫోన్ వాడటంపై ఇప్పటికే ఆంక్షలు విధించింది. త్వరలో ఉన్నత పాఠశాలల్లోనూ నిషేధించనుంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు SM వినియోగాన్ని నిషేధించిన తొలిదేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. తర్వాత మలేషియా కూడా ఇదే <<18381200>>నిర్ణయం<<>> తీసుకుంది.

News January 1, 2026

న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం!

image

TG: న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని ఇల్యూషన్ పబ్‌లో డీజే ఆర్టిస్ట్‌కు డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నార్సింగిలో రాజేంద్రనగర్ SOT పోలీసులు దాడులు చేశారు. ఐదు గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు.

News January 1, 2026

అసభ్యంగా తాకేందుకు ప్రయత్నిస్తే బూటుతో కొట్టా: బ్రిటన్ రాణి

image

టీనేజీలో తనకు ఎదురైన అనుభవాన్ని బ్రిటన్ రాణి కెమిల్లా తాజాగా పంచుకున్నారు. ‘16-17 ఏళ్ల వయసులో నేను లండన్‌లో రైలులో వెళ్తుండగా ఓ వ్యక్తి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకోవడంతో నాపై దాడి చేశాడు. నేను బూటు తీసి కొట్టాను. మహిళలపై జరుగుతున్న హింస ఎంత పెద్ద సమస్యో తెలియజేసేందుకే ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా’ అని ఓ రేడియో ఇంటర్వ్యూలో కెమిల్లా తెలిపారు.

News January 1, 2026

సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం?

image

AP: సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో శుభారంభ్ పేరుతో నిర్వహిస్తున్న న్యూఇయర్ వేడుకల్లో ఓ యువకుడు చనిపోయాడని సమాచారం. వేణుగోపాల్ నగర్‌కు చెందిన షౌకత్ కరెంట్ షాక్‌తో మృతి చెందాడని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేడుకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

News January 1, 2026

జనవరి 1: చరిత్రలో ఈరోజు

image

1892: స్వాతంత్ర్య సమరయోధుడు మహదేవ్ దేశాయ్ జననం
1894: గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జననం
1911: స్వాతంత్ర్య యోధురాలు ఎల్లాప్రగడ సీతాకుమారి జననం
1975: నటి సోనాలి బింద్రే జననం
1979: నటి విద్యాబాలన్ జననం
1955: శాస్త్రవేత్త శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ మరణం (ఫొటోలో)
1994: తెలుగు రచయిత చాగంటి సోమయాజులు మరణం (ఫొటోలో)
2007: తెలుగు సినీ నిర్మాత డూండీ మరణం

News January 1, 2026

ఈడీ సోదాల్లో నోట్ల కట్టలు.. సూట్‌కేస్ నిండా ఆభరణాలు!

image

ఢిల్లీలో జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలను ED గుర్తించింది. ఓ సూట్‌కేసులో ₹8.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయి. మరోవైపు ₹5 కోట్ల నగదుతోపాటు ₹35 కోట్ల ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ కేసులో ఇంద్రజిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. హరియాణాకు చెందిన ఇంద్రజిత్ సెటిల్‌మెంట్లు, బెదిరింపు వంటి కేసుల్లో నిందితుడు. UAEలో పరారీలో ఉన్నాడు.

News January 1, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 1, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 01, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:29 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6:46 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4:17 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:53 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7:10 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 1, 2026

‘స్పిరిట్’ సర్‌ప్రైజ్ వచ్చేసింది!

image

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శరీరం నిండా గాయాలతో, చేతిలో మందు బాటిల్‌తో ప్రభాస్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. ఒక్క పోస్టర్‌తో ‘యానిమల్’ను మించి స్పిరిట్ ఉండబోతోందని సందీప్ చెప్పేశారు. ‘ఇండియన్ సినిమా.. మీ ఆజానుబాహుడిని చూడండి’ అని క్యాప్షన్ ఇచ్చారు.